'ఆ మూవీ ఇప్పుడు చూసినా బోర్ కొట్టదు'
న్యూఢిల్లీ : బాలీవుడ్ క్లాసిక్ మూవీ 'షోలే' రీమేక్ అనేది తన దృష్టిలో చాలా చెడ్డ నిర్ణయమని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డాడు. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2007 లో 'ఆగ్' మూవీ తీసి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయాన్ని ఈ నటుడు గుర్తుచేశాడు. రమేస్ సిప్పి దర్శకత్వంలో వచ్చిన షోలే సినిమా పాత్రలను ఏ ఒక్కరూ భర్తీ చేయలేరన్నాడు. ఇప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే ఉందని, ఇప్పుడ చూసినా అసలు బోర్ కొట్టడని ఈ హీరో అన్నాడు. బ్రదర్స్ మూవీ ప్రమోషన్లలో అక్షయ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు.
1975లో విడుదలైన ఆ మూవీలో స్టార్డమ్ ఉన్న అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయాబచ్చన్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ స్వాతంత్ర్యదినోత్సవం నాడు షోలే మూవీ 40 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలను అక్షయ్ గుర్తుచేశారు. ఆ గొప్ప సినిమా రీమేక్ చేస్తే ఏ పాత్రలో నటిస్తారని మీడియా ప్రశ్నించగా... అక్షయ్ ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఆ సినిమాను ఎప్పటికీ రీమేక్ చేయలేమని, ఆ పాత్రలకు వేరెవరూ న్యాయం చేయలేరని అభిప్రాయపడ్డాడు. తాను నటించిన 'బ్రదర్స్' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ అక్షయ్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మూవీ శుక్రవారం నాడు విడుదలకు సిద్ధంగా ఉంది.