రైల్వే ట్రాక్‌పై బాంబు?
కేసముద్రం (వరంగల్) : బాంబు భయంతో వరంగల్ జిల్లా కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 7.40 గంటల సమయంలో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ట్రాక్‌పై వైర్లు కనిపించడంతో బాంబు అమర్చినట్టు అనుమానించిన సిబ్బంది ఆ మార్గంలో సికింద్రాబాద్ వైపు వెళుతున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దాంతో మరికొన్ని రైళ్లు కూడా నిలిచినట్టు సమాచారం.