
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం ధాన్యానికి (ఆర్‌ఎన్‌ఆర్ పాతరకం) రికార్డుస్థాయిలో ధర రూ. 3,010లు పలికింది. ఈ సీజన్ ప్రారంభమైన నాటినుంచి ధాన్యానికి అత్యధికంగా ధర పలకడం ఇదే తొలిసారి.
మద్దతు ధర రూ.2,060 ఉండగా, మద్దతుకు మించే ధర రావడం విశేషం. కాగా, మార్కెట్ కు బుధవారం 1,778 బస్తాల ధాన్యం అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.3,010, కనిష్ట ధర రూ.2,219 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.