సాక్షి, కేసముద్రం : మండలంలోని ఉప్పరపల్లికి చెందిన ఆవుల యుగంధర్ కరోనా నియంత్రణకు తన వంతు సాయం చేశాడు. 100 లీటర్ల హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని అందజేశాడు. గ్రామ ఇంజార్జి సర్పంచ్ సారయ్య పంచాయితీ కార్యదర్శి రంజిత్ కు అందజేశాడు. గ్రామంలోని అన్ని వార్డుల్లో పిచికారీ చేయడానికి హైడ్రోక్లోరైడ్ ద్రావణన్ని అందించిన యుగంధర్ ను గ్రామస్థులు అభినందించారు. అనంతరం ప్రతి వార్డులో పది లీటర్ల ద్రావణం పిచికారీ చేయాల్సిందిగా వార్డు సభ్యులకు ద్రావణం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణమూర్తి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సంకు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ సుధాకర్ వార్డు సభ్యులు కరొబార్ కట్టయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment