కేసముద్రం :ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పత్రాల’ వ్యవహారంలో కేసముద్రం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి పేరు వినబడడం చర్చనీయూంశమైంది. సదరు వ్యాపారి పేరు బుధవారం వివిధ చానళ్లలో వచ్చింది. ఆ వ్యాపారి కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఓ కంపెనీని నడుపుతూ స్థిరపడ్డాడు.
గత రెండు రోజులుగా పనామాలో డబ్బులు దాచుకున్న పలువురు ప్రముఖుల పేర్లు ఐసీఐజే బయటపెట్టడం సంచలనం రేకిత్తించింది. ఇదే క్రమంలో కొందరి తెలుగువారి పేర్లు పనామా వ్యవహారంలో ఉన్నట్లు బుధవారం పలు టీవీ చానళ్లలో రావడం, అందులో కేసముద్రం వాసి పేరు వినిపించడం కలకలం రేపింది.