హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ క్యాటరింగ్ కంపెనీ ఫుడ్‌లింక్ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్ ఇండియా తాజాగా దక్షిణాదిన అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో 15,000 చదరపు అడుగుల్లో అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక కిచెన్‌తోపాటు గిడ్డంగిని ఏర్పాటు చేసింది.
అంబానీ–పిరమల్, దీపిక–రణ్‌వీర్, కేఎల్ రాహుల్–అథియా శెట్టి, తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీవీ, రెడ్డి ల్యాబ్స్ కుటుంబ సభ్యుల వివాహ వేడుకల క్యాటరర్‌గా వ్యవహరించిన ఫుడ్‌లింక్‌కు రోజుకు 10 లక్షలకుపైగా అతిథులకు ఆహారం అందించే సామర్థ్యం ఉంది. ఫోర్బ్స్ ఇండియా టాప్–100లోని 75% వ్యాపార సంస్థలు, వారి కుటుంబ సభ్యులకు సేవలు అందించినట్టు ఫుడ్‌లింక్ సీఈవో సంజయ్ వజిరాణి మీడియాకు తెలిపారు.
‘లగ్జరీ క్యాటరింగ్, రెస్టారెంట్ల వ్యాపార విస్తరణకు హైదరాబాద్‌లో మూడేళ్లలో రూ.100 కోట్లు వెచ్చిస్తాం. ఇండియా బిస్ట్రో, చైనా బిస్ట్రో, గ్లోకల్ జంక్షన్, ఆర్ట్ ఆఫ్ దమ్ రెస్టారెంట్ల సంఖ్యను ఇప్పుడున్న 35 నుంచి 100కు చేరుస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.450 కోట్ల టర్నోవర్ దాటు తాం. మూడేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. అప్పుడు ఐపీవోకు వెళ్తాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment