పులిపై దాడి చేసి చంపిన గ్రామస్తులు | Villagers Killed Tiger In Karnataka's Raichur | Sakshi
Sakshi News home page

పులిని చంపిన గ్రామస్తులు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Published Tue, Jul 9 2024 7:36 AM | Last Updated on Tue, Jul 9 2024 9:13 AM

Villagers Killed Tiger In Karnataka's Raichur

రాయ్‌చూర్‌: ఆ పులి గ్రామంలో నలుగురిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో గ్రామస్తులకు పులిపై ఎక్కడలేని కోపం వచ్చింది. ఇంకేముంది  వందలాది మంది గ్రామస్తులు కర్రలు,రాళ్లతో పులిపై దాడి చేసి చంపేశారు. 

ఫారెస్ట్‌ అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన రాయ్‌చూర్‌ జిల్లాలోని దేవదుర్గ ఫారెస్ట్‌ రేంజ్‌లో జరిగింది.  పులిని చంపిన ఘటనపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి విచారణకు  ఆదేశించారు. 

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అయితే ఫారెస్ట్‌ అధికారులు వెంటనే స్పందించి ట్రాప్‌లో చిక్కుకున్న పులిని కాపాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement