Raichur District
-
పులిపై దాడి చేసి చంపిన గ్రామస్తులు
రాయ్‌చూర్: ఆ పులి గ్రామంలో నలుగురిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో గ్రామస్తులకు పులిపై ఎక్కడలేని కోపం వచ్చింది. ఇంకేముంది వందలాది మంది గ్రామస్తులు కర్రలు,రాళ్లతో పులిపై దాడి చేసి చంపేశారు. ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన రాయ్‌చూర్ జిల్లాలోని దేవదుర్గ ఫారెస్ట్ రేంజ్లో జరిగింది. పులిని చంపిన ఘటనపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అయితే ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ట్రాప్‌లో చిక్కుకున్న పులిని కాపాడారు. -
కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్
కర్ణాటకలో జికా వైరస్ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. రాయచూర్ జిల్లాలోని అయిదేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. కొన్ని రోజులుగా చిన్నారి అనారోగ్యానికి గురైందని, డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో టెస్ట్‌లు చేయించినట్లు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్‌గా రావడంతో చిన్నారికి అన్ని జాగ్రత్త చర్యలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి సుధాకర్ మాట్లాడుతూ.. పూణె నుంచి వచ్చిన ల్యాబ్ నివేదిక ద్వారా జికా వైరస్ నిర్ణారణ జరిగిందన్నారు. డిసెంబర్ 5న ముగ్గురి నామూనాలను ల్యాబ్‌కు పంపించగా ఇద్దరికి నెగిటీవ్ వచ్చిందని అయిదేళ్ల చిన్నారికి పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. రాష్ట్రంలో ఇదే మొదటి కేసని వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో పరిస్థితిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఏదైనా ఆసుపత్రుల్లో అనుమానాస్పద ఇన్ఫెక్షన్ కేసులు కనిపిస్తే జికా వైరస్ పరీక్షల కోసం నమూనాలను పంపాలని రాయచూర్ దాని పొరుగు జిల్లాల్లోని ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని, అన్ని ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా కొన్ని నెలల కిత్రం జికా వైరస్ కేరళలో తొలిసారి వెలుగు చూసిన విషయం తెలిసిందే. తరువాత మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. చదవండి: అందుకే ‘హెల్మెట్’ పెట్టుకోమని చెప్పేది.. ఓసారి ఈ వీడియో చూడండి జికా వైరస్ ఏలా వ్యాప్తిస్తుంది జికా వైరస్ వ్యాధి ఎడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్ఫెక్షన్లను కూడా ఇదే దోమే వ్యాపి చేస్తుంటుంది. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1947లో ఉగాండాలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఎడెస్ దోమలు సాధారణంగా పగటిపూట కుడతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. అయితే ఈ వైరస్ పెద్దగా ప్రాణాంతకం కాదు. చికిత్సతో రికవరీ అవుతారు. కానీ గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారి కడుపులోని పిండానికి ఇది చాలా ప్రమాదకరం. మైక్రోసెఫాలీ (మెదడుపై ప్రభావం) లేదా పుట్టుకతో వచ్చే జికా సిండ్రోమ్ అని పిలువబడే ఇతర పరిస్థితులకు కారణమవుతుంది. -
అప్పటికే నిశ్చితార్థం.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా.. షాపు ఓనర్‌తో కలిసి..
సాక్షి, రాయచూరు: జిల్లాలో లవ్ జిహాద్ తరహా ఘటన జరిగిట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటికే పెళ్లి కుదిరిన హిందూ యువతి భారతి (22)ని, మరో మతం యువకుడు రెహాన్ (24) పెళ్లి చేసుకున్నాడని భారతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. రెహాన్ నగరంలో పూల వ్యాపారం చేస్తున్నాడు. భారతి అతని షాపులో పనికి వెళుతున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. భారతికి ముందుగానే విజయనగర జిల్లా హూవినహడగలికి చెందిన యువకునితో పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరిగింది. కానీ 3 రోజుల కిందట రెహాన్ భారతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. భారతిని పెళ్లికి ముందు మతం మార్పించారని చెప్పారు. పోలీసు స్టేషన్లో విచారణ.. తమ కుమార్తె భారతి కనపడటం లేదని వారు నేతాజీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిని పిలిచారు. భారతి స్టేషన్‌కు బుర్కా ధరించి వచ్చింది. తన కూతురు భారతి రెహాన్ వద్దకు కూలి పనికి వెళుతుండేదని, మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడని భారతి తల్లి నాగమ్మ ఆరోపించింది. ఇద్దరూ మేజర్లు కావడం, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు ఆ జంటను విచారించి పంపించివేశారు. చదవండి: (ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం) -
భర్త మృతి.. ఆ తర్వాత భార్య ఏం చేసిందంటే..?
సాక్షి, బెంగళూరు: భర్త మరణ వార్తను ఆమె తట్టుకోలేకపోయింది. కట్టుకున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. మరణ వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే తన ఆరు నెలల కుమారుడిని చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్నాటకలోని రాయ్‌చూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, గంగాధర్ (36), శ్రుతి(30) భార్యాభర్తలు.. వీరికి ఆరు నెలల కుమారుడు అభిరామ్ ఉన్నాడు. గంగాధర్ కుటుంబం రాయ్‌చూర్‌లో నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి.. గంగాధర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుంటికాన సమీపంలో నేషనల్ హైవే-66పై గంగాధర్ దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే, రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడన్న వార్త శ్రుతికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన భార్య.. భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం అర్దరాత్రి సమయంలో తన ఆరు నెలల చిన్నారి అభిరామ్‌ను హత్యచేసి, తాను సూసైడ్ చేసుకుంది. ఒక్క మరణంతో ఆ కుటుంబంలో ఊహించని పరిస్థితులు నెలకొనడంతో ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
అనుమానం.. చిత్రహింసలు.. నదిలో దూకి తల్లీ, బిడ్డ ఆత్మహత్య
సాక్షి, రాయచూరు రూరల్ : కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. శాహబాద్‌లో ఆదివారం రాత్రి శాంత కుమారి (32), ఆమె ఆరు నెలల చిన్నారితో కలిసి బీమా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త చిత్తాపూర్‌కు తాలూకా మూడబూళ సిద్దలింగతో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ క్రమంలో భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇది భరించలేక శాంతకుమారి తన ఆరు నెలల పసికందుతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందని శాహబాద్ పోలీసులు తెలిపారు. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (నగ్నంగా వీడియో కాల్స్ చేసి.. 200 మందిని మోసం చేసిన జంట) -
లాక్డౌన్ నిబంధనలు గాలికి
హొసపేటె: సెకెండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. బుధవారం లాక్డౌన్ సడలింపు వేళలో ఒక్కసారిగా వందల మంది మార్కెట్లకు వచ్చారు. భౌతిక దూరం పాటించకుండా తిరిగారు. పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారు. రాయచూరు రూరల్: జిల్లాలో కరోనా కట్టడికి ఈనెల 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం కొంత విరామం ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అవకాశం కల్పించారు. ఇదే సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. చదవండి: డేంజర్ జోన్లో 6 జిల్లాలు చదవండి: టీకా రక్ష.. అందని ద్రాక్ష? -
ఘోరం: మృగాళ్లకు బాలిక బలి
రాయచూరు రూరల్: పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికపై కామాంధులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం కర్నాటకలోని యాదగిరి జిల్లా సురపుర తాలూకా హుణిసిగిలో ఆలస్యంగా వెలుగుచూసింది. హుణిసిగిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలిక (16) అదే పట్టణంలో పీయూసీ చదువుతోంది. కరోనా నేపథ్యంలో కళాశాలకు సెలవు కావడంతో ఇంటివద్దనే ఉంటోంది. ఈనెల 9వ తేదీ ఆదివారం ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. ఆ సమయంలో ముగ్గురు యువకులు బలవంతంగా పొలాల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. అయితే బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకుని గాలింపు చేపట్టగా పట్టణ సమీపంలోని పొలాల్లో బాలిక మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. కామాంధుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అదే పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ (18) అరెస్ట్ చేశారు. అతడితోపాటు 16, 17 ఏళ్ల వయసున్న బాలురు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే వారిద్దరూ పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం గాలిస్తున్నట్లు సురపుర సీఐ శివయ్య హిరేమఠ్ తెలిపారు. చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా -
పాతనోట్లు చలిమంట
రాయచూరు రూరల్: అది రాయచూరు నగరంలోని గంజ్ సర్కిల్ ప్రాంతం. ఒక మూలన ఏవో కాగితాలు తగలబడుతున్నాయి. కొందరు అనుమానం వచ్చి చూస్తే.. అవి 500, 1000 రూపాయల నోట్లు. దీంతో గగ్గోలు మొదలైంది. కాకపోతే అవి రద్దయిన పాత నోట్లు. ఇక్కడి ఏపీఎంసీ మార్కెట్లోని వ్యాపారులు ఎవరైనా పాత నోట్లను అలాగే ఉంచుకుని ఉంటారు, మార్పిడికి చేతకాక అంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాత కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు. దీనిపై మార్కెట్ యార్డ్ ఎస్ఐ అగ్ని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారం తెలియగానే జిల్లా ఇన్చార్జ్ మంత్రి వెంకటరావ్ నాడగౌడ ఘటన స్థలాన్ని సందర్శించారు. పాతనోట్ల రద్దయిన దాదాపు రెండేళ్ల తరువాత కూడా అవి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎంతమొత్తంలో కాల్చి ఉంటారనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
బసవరాజ్.. బీజేపీని గెలిపించాలి!
రాయ్‌చూర్: వెర్రి వేయి విధాలన్న మాటను బసవరాజ్ ఒప్పుకునే స్థితిలో లేడు! ఎన్నికల క్షేత్రం కర్ణాటకలో బీజేపీని గెలిపించాల్సిన భారం ఆయనదే మరి!! అతనికి బాధ్యతలు అప్పజెప్పింది మరెవరోకాదు.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీనే!!! గడిచిన కొద్ది గంటలుగా సాధారణ మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోన్న ఈ ఫొటో వివరాల్లోకి వెళితే.. రాయ్‌చూర్‌కు చెందిన బసవరాజ్ బీజేపీ కార్యకర్త. అంతకుమించి నరేంద్ర మోదీకి భక్తుడు. అతని వీరాభిమానం ఏ స్థాయిలో ఉందంటే.. ఏకంగా వీపుపై అతిపెద్ద మోదీ టాటూ వేయించుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బసవడు ఓ హాట్‌టాపిక్‌గా మారాడు. ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం రాయ్‌చూర్‌కు వచ్చిన మోదీ.. ఈ వీరాభిమాని గురించి ఆరాతీశారు. ప్రసంగంలో అతని పేరును ప్రస్తావిస్తూ.. ‘‘బసవరాజ్.. బీజేపీని గెలిపించాలి మరి..’’ అని అన్నారు. అంతే! అవధుల్లేని ఆనందంతో పొంగిపోయాడా అభిమాని! 15 గంటలు పట్టింది: ‘‘మోదీగారంటే నాకు చాలా ఇష్టం. గడిచిన నాలుగేళ్లలో ఆయన దేశాన్ని బాగా అభివృద్ధిచేశారు. ఆ అభిమానంతోనే టాటూ వేయించుకున్నా. ఇందుకోసం కదలకుండా 15 గంటలు కూర్చోవాల్సి వచ్చింది. అదేమంత కష్టంకాదుగానీ, మోదీ నోటి వెంట నా పేరు వినిపించడం మహదానందం. ఆయన చెప్పినట్లే బీజేపీ గెలుపు కోసం కష్టపడతా..’ అని మీడియాతో చెప్పాడు బసవరాజ్. రాయ్‌చూర్‌లో ట్యూటర్‌గా పనిచేస్తున్నాడతను. కాగా, మనోడి టాటూ వ్యవహారంపై భిన్నస్పందనలు వస్తున్నాయి. బసవరాజ్ అభిమానాన్ని వెర్రితనని కొందరంటే.. ఇందులో తప్పేమీ లేదని ఇంకొందరు వాదిస్తున్నారు. -
ఆగిన కృష్ణమ్మ పరుగులు
- వట్టిపోయిన జీవనది - దాహంతో అల్లాడుతున్న గ్రామీణులు - విద్యుత్ ఉత్పత్తికి గండం రాయచూరు రూరల్ : ఎప్పుడు నీటి పరవళ్లతో తొణికసలాడే కృష్ణమ్మ ఈ ఏడాది రాయచూరు జిల్లాలో వెలవెలపోతోంది. దీంతో నదీ ప్రాంత పరిధిలో నీటి ఎద్దడి ఉధృత రూపం దాల్చుతోంది. మరో వైపు కృష్ణా నీటిపై ఆధారపడి విద్యుత్ ఉత్పతి చేసే రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రానికి గండం పొంచి ఉంది. బెల్గాం జిల్లాలో ఐనాపూర్ వద్ద కర్ణాటకలోకి అడుగు పెట్టే కృష్ణమ్మ 482 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రాయచూరు జిల్లా దేవరసుగూర్ ప్రాంతంలో వీడ్కోలు పలికి మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఈ ఏడాది ఎలోనిన్ కారణంగా వర్షాభావం ఏర్పడి కృష్ణమ్మలో నీటి జాడలు కనుమరగు అవుతున్నాయి. దీంతో రాయచూరు జిల్లాలో నదీ తీరంలోని పట్టణాలు, గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడి పోతున్నారు. మరో వైపు పశువులు సైతం దాహంతో అలమటించి పోతున్నాయి. ఆ ప్రాంతంలో సంచరించే వన్య మృగాలు కూడా కనుమరుగవుతున్నాయి. కృష్ణమ్మలో నీటి జాడలు లేక ఈ నదిపై ఆధారపడి నిర్మించిన ఆర్టీపీఎస్లోని ఎనిమిది యూనిట్లు ఆగిపోయే ప్రమాదం నెలకొంది. ఆర్టీపీఎస్ నడవాలంటే రోజు ఒక లక్ష క్యూబెక్ నీరు అవసరం. రాష్ట్రానికి రోజూ 182 దశలక్ష యూనిట్ల విద్యుత్ అవసరం కాగా ఆర్టీపీఎస్ నుంచి 35 దశలక్ష యూనిట్లు అందుతుంది. అయితే నది ఎండిపోతుండటంతో ఆర్టీపీఎస్కు చీకటి ఆవరించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడి రాష్ర్టం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.