భారతి, రెహాన్ జంట
సాక్షి, రాయచూరు: జిల్లాలో లవ్ జిహాద్ తరహా ఘటన జరిగిట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటికే పెళ్లి కుదిరిన హిందూ యువతి భారతి (22)ని, మరో మతం యువకుడు రెహాన్ (24) పెళ్లి చేసుకున్నాడని భారతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. రెహాన్ నగరంలో పూల వ్యాపారం చేస్తున్నాడు. భారతి అతని షాపులో పనికి వెళుతున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు.
భారతికి ముందుగానే విజయనగర జిల్లా హూవినహడగలికి చెందిన యువకునితో పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరిగింది. కానీ 3 రోజుల కిందట రెహాన్ భారతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. భారతిని పెళ్లికి ముందు మతం మార్పించారని చెప్పారు.
పోలీసు స్టేషన్‌లో విచారణ..
తమ కుమార్తె భారతి కనపడటం లేదని వారు నేతాజీ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిని పిలిచారు. భారతి స్టేషన్‌కు బుర్కా ధరించి వచ్చింది. తన కూతురు భారతి రెహాన్ వద్దకు కూలి పనికి వెళుతుండేదని, మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడని భారతి తల్లి నాగమ్మ ఆరోపించింది. ఇద్దరూ మేజర్లు కావడం, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు ఆ జంటను విచారించి పంపించివేశారు.
Comments
Please login to add a commentAdd a comment