Rehan
-
అప్పటికే నిశ్చితార్థం.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా.. షాపు ఓనర్‌తో కలిసి..
సాక్షి, రాయచూరు: జిల్లాలో లవ్ జిహాద్ తరహా ఘటన జరిగిట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటికే పెళ్లి కుదిరిన హిందూ యువతి భారతి (22)ని, మరో మతం యువకుడు రెహాన్ (24) పెళ్లి చేసుకున్నాడని భారతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. రెహాన్ నగరంలో పూల వ్యాపారం చేస్తున్నాడు. భారతి అతని షాపులో పనికి వెళుతున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. భారతికి ముందుగానే విజయనగర జిల్లా హూవినహడగలికి చెందిన యువకునితో పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరిగింది. కానీ 3 రోజుల కిందట రెహాన్ భారతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. భారతిని పెళ్లికి ముందు మతం మార్పించారని చెప్పారు. పోలీసు స్టేషన్లో విచారణ.. తమ కుమార్తె భారతి కనపడటం లేదని వారు నేతాజీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిని పిలిచారు. భారతి స్టేషన్‌కు బుర్కా ధరించి వచ్చింది. తన కూతురు భారతి రెహాన్ వద్దకు కూలి పనికి వెళుతుండేదని, మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడని భారతి తల్లి నాగమ్మ ఆరోపించింది. ఇద్దరూ మేజర్లు కావడం, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు ఆ జంటను విచారించి పంపించివేశారు. చదవండి: (ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం) -
నా కొడుకును రాహుల్‌కు దత్తత ఇవ్వలేదు: ప్రియాంక
న్యూఢిల్లీ: తన కుమారుణ్ని సోదరుడు రాహుల్ గాంధీకి దత్తత ఇచ్చినట్టుగా వచ్చిన వార్తలను ప్రియాంక గాంధీ ఖండించారు. ఈ వార్తను ప్రచురించిన ఓ వీక్లి, మరికొన్ని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు. ఇవన్నీ తప్పుడు కథనాలని, కుమారుడి పరువుకు భంగం కలిగేలా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ప్రియాంక తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. సంబంధిత మీడియాపై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్టు సమాచారం. రాహుల్ గాంధీ తన సోదరి ప్రియంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కొడుకు రెహాన్‌ను దత్తత తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. తద్వరా రెహాన్ ఇంటిపేరును గాంధీగా మార్చాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపినట్టు ఆ పత్రికలు కథనాలు ప్రచురించాయి. కాగా ఈ కథనాలను ప్రియాంక తోసిపుచ్చారు. -
పార్లమెంటులో ప్రియాంక కొడుకు
బుధవారం ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలను వీక్షించి వెలుపలికి వస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మనవడు, ప్రియాంకా వాద్రా కుమారుడు రెహాన్. -
ఇంకా ఏమీ అనుకోలేదు మూవీ న్యూ స్టిల్స్
-
చక్కటి కలబోత
ప్రముఖ రచయిత దివాకర్‌బాబు తనయుడు శ్రీకర్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’. రెహన్, అమోఘ్ దేశపతి, శ్వేతాజాదవ్ ఇందులో హీరో హీరోయిన్లు. శ్రీ చక్రికా ఫిలింస్ పతాకంపై నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, కుటుంబ విలువలు, వినోదం కలబోతగా చాలా చక్కగా చిత్రాన్ని తీర్చిదిద్దామని దర్శకుడు పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తీశామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి.