
ఆత్మహత్య చేసుకున్న తల్లి బిడ్డ
సాక్షి, రాయచూరు రూరల్ : కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. శాహబాద్‌లో ఆదివారం రాత్రి శాంత కుమారి (32), ఆమె ఆరు నెలల చిన్నారితో కలిసి బీమా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త చిత్తాపూర్‌కు తాలూకా మూడబూళ సిద్దలింగతో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ క్రమంలో భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇది భరించలేక శాంతకుమారి తన ఆరు నెలల పసికందుతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందని శాహబాద్ పోలీసులు తెలిపారు. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: (నగ‍్నంగా వీడియో కాల్స్ చేసి.. 200 మందిని మోసం చేసిన జంట)
Comments
Please login to add a commentAdd a comment