
హోస్పేట, రాయిచూరులో కిక్కిరిసిన మార్కెట్లు
కరోనా దేశంలోనే అత్యధికంగా వ్యాపిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా తిరుగుతూ.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
హొసపేటె: సెకెండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. బుధవారం లాక్‌డౌన్ సడలింపు వేళలో ఒక్కసారిగా వందల మంది మార్కెట్లకు వచ్చారు. భౌతిక దూరం పాటించకుండా తిరిగారు. పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారు.
రాయచూరు రూరల్: జిల్లాలో కరోనా కట్టడికి ఈనెల 24 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం కొంత విరామం ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అవకాశం కల్పించారు. ఇదే సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి.
చదవండి: డేంజర్ జోన్‌లో 6 జిల్లాలు
చదవండి: టీకా రక్ష.. అందని ద్రాక్ష?