పంచాయతీ పెద్ద కాళ్లు మొక్కుతున్న దళితులు
చెన్నె: అణగారిన వర్గాలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. అణగారిన వర్గాలను మరింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని దళితులతో కాళ్లు మొక్కించుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మే 12వ తేదీన తిరువన్నెనల్లూరు సమీపంలోని ఒట్టనందల్ గ్రామంలో దళిత కుటుంబాలు గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు. అయితే కరోనా నేపథ్యంలో అనుమతి లేకుండా ఉత్సవాలు జరిపారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీనిపై గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో నిర్వాహకులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం కోర్టుకు వెళ్లారు. వారిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేసింది. అయితే పంచాయతీ పెద్దలు మాత్రం తమ ముందుకు హాజరుకావాలని ఆదేశించారు. పంచాయతీ కోర్టు గ్రామ పెద్దలను కలిసి వారి కాళ్లపై పడాలని ఆదేశించింది. ఈ తీర్పుతో దళితులు తిరుమల్, సంతానం, అరుముగం పంచాయతీ సభ్యుల కాళ్లపై పడి క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై దళిత, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment