Hospeta
-
దుస్తులు కొంటామని వచ్చి కిరాతకంగా గొంతు కోసి..
సాక్షి,హొసపేటె( బెంగళూరు): హొసపేటెలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఒక ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళల గొంతు కోశారు. ఒక మహిళ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని రాణిపేటలో నివాసం ఉంటున్న అక్కా చెల్లెలు భువనేశ్వరి(58), శివభూషణ(56)లు తమ ఇంటిలోనే దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. గురువారం ఇద్దరు వ్యక్తులు వచ్చి తమ ఇంటిలో పెళ్లి ఉందని, రేపు వచ్చి దుస్తులు కొంటామని చెప్పి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఐదు మంది వ్యక్తులు వచ్చి దుస్తులు కొంటున్నట్లు నటించారు. సదరు మహిళలు దుస్తులు చూపిస్తుండగా చాకుతో గొంతు కోసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించారు. భువనేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా శివభూషణ తీవ్రంగా గాయపడింది. ఎస్పీ అరుణ్, డీఎస్పీ విశ్వనాథ్ కులకర్ణి, సీఐ శ్రీనివాస్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శివభూషణను ఆస్పత్రికి తరలించి దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు -
వింత: శిశువు కాలికి తొమ్మిది వేళ్లు
సాక్షి, బళ్లారి: కాలికి తొమ్మిది వేళ్లతో శిశువు జన్మించిన అరుదైన ఘటన హొసపేటెలో చోటు చేసుకుంది. హొసపేటె తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి కాన్పు కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే శిశువు ఎడమ కాలికి తొమ్మిది వేళ్లు ఉండటం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఇలా తొమ్మిది వేళ్లతో జన్మించిన బాలురు ప్రపంచంలో 20 మంది ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
లాక్డౌన్ నిబంధనలు గాలికి
హొసపేటె: సెకెండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. బుధవారం లాక్డౌన్ సడలింపు వేళలో ఒక్కసారిగా వందల మంది మార్కెట్లకు వచ్చారు. భౌతిక దూరం పాటించకుండా తిరిగారు. పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారు. రాయచూరు రూరల్: జిల్లాలో కరోనా కట్టడికి ఈనెల 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం కొంత విరామం ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అవకాశం కల్పించారు. ఇదే సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. చదవండి: డేంజర్ జోన్లో 6 జిల్లాలు చదవండి: టీకా రక్ష.. అందని ద్రాక్ష? -
మామతో వివాహేతర సంబంధం.. భర్తను అడ్డుతొలగించి..
హోసపేటె/కర్ణాటక: టీబీ డ్యాం పీఎల్సీ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద జరిగిన హత్య కేసులో మృతుడి భార్యను స్థానిక పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. వివరాలు.. గత నెల 20న రాత్రి టీబీ డ్యాం పీఎల్సీ కాలనీ నివాసి, కేబుల్ ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్న మైకేల్ జాన్(40) అనే వ్యక్తిని పాశవికంగా హతమార్చారు. రైల్వే ట్రాక్ వద్ద మద్యం మత్తులో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బండరాయిని తలపై వేశారు.ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.నారాయణ ఆధ్వర్యంలో పోలీసు బృందం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది. విచారణలో భాగంగా, చివరికి ఈ కేసులో మైకేల్‌జాన్ భార్య సుర్గుణంను ప్రధాన ముద్దాయిగా తేల్చారు. ఆమెకు తన బంధువు, వరుసకు మామ అయ్యే వినోద్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉండేది. ఎలాగైనా వినోద్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరికతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. మద్యానికి బానిసగా మారి తరచు తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న అతడిని హతమార్చేందుకు ప్రియుడు వినోద్‌తో కలిసి ఈ ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినోద్, అశోక్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కర్ణాటక: మరో రాసలీల వీడియో వైరల్ రాసలీలల కేసు: జార్కిహోళికి కరోనా.. అందుకే గైర్హాజరయ్యారా! -
ఎమ్మెల్యే కటౌట్‌కు చెప్పులహారం
హొసపేటె : హొసపేటె కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ కటౌట్‌కు గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులహారం వేయడం నగరంలో చర్చనీయంగా మారింది. హగరిబొమ్మనహళ్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన స్వంత కార్యాలయాన్ని ప్రారంభించారు. తన పొరుగు నియోజకవర్గమైన హగరిబొమ్మనహళ్లిలో కూడా పట్టు పెంచుకోవాలని ఆయన సన్నామాలు చేస్తున్నారు. సేవలు అందించేందుకు నడుం బిగించారు. దీంతో హగరిబొమ్మనహళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే భీమా నాయక్ ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఈ తరుణంలో ఆనంద్‌సింగ్ కటౌట్‌కు అల్లరి మూకలు చెప్పులహారం వేయడం కలకలం రేపింది. పొరుగు నియోజకవర్గంలో జోక్యం వద్దని గతంలోనే సిద్ధరామయ్య నచ్చచెప్పినా ఆనంద్‌సింగ్ పంథాను మార్చుకోలేదని సమాచారం. -
‘తుంగభద్ర’కు పోటెత్తిన వరద
- 31,303 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - 67.750 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ హొసపేటె(కర్ణాటక): తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగుంబె, శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళు, మంగళూరు, భద్రావతి తదితర చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతోంది. శుక్రవారం సుమారు 31,303 క్యూసెక్కుల మేర డ్యాంలోకి నీరు చేరింది. వర్షాభావం నేపథ్యంలో డ్యాం చరిత్రలోనే ఈ ఏడాది జలాశయంలో అతి తక్కువ నీరు నిల్వ ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో నాలుగైదు రోజులుగా ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే పదిరోజుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలోని నీటిమట్టం 1623.33 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 67.750 టీఎంసీలకు చేరింది. వివిధ కాలువలకు 2264 క్యూసెక్కుల వరకు మండలి అ«ధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటిమట్టం 1617.06 అడుగులు, నీటి నిల్వ 50.630 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 3800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 10866 క్యూసెక్కులుగా ఉండేదని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. -
తుంగభద్రకు పెరిగిన ఇన్ ఫ్లో
హొస్పేట: తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం డ్యాంకు 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 20 క్రస్ట్‌గేట్లు అడుగు మేర పెకైత్తి దిగువకు 46 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగొంబె, శివమొగ్గ, మొరాళు, తీర్థహళ్లి, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం మలెనాడులో కురుస్తున్న వర్షాల వల్ల డ్యాంలోకి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశముందని తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1633 అడుగులు, కెపాసిటీ 100.855 టీఎంసీలు, ఔట్‌ఫ్లో 40,999 క్యూసెక్కులు ఉంది.