హొస్పేట: తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం డ్యాంకు 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 20 క్రస్ట్‌గేట్లు అడుగు మేర పెకైత్తి దిగువకు 46 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగొంబె, శివమొగ్గ, మొరాళు, తీర్థహళ్లి, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న ఇన్‌ఫ్లో పెరుగుతోంది.
ప్రస్తుతం మలెనాడులో కురుస్తున్న వర్షాల వల్ల డ్యాంలోకి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశముందని తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1633 అడుగులు, కెపాసిటీ 100.855 టీఎంసీలు, ఔట్‌ఫ్లో 40,999 క్యూసెక్కులు ఉంది.
తుంగభద్రకు పెరిగిన ఇన్ ఫ్లో
Published Mon, Aug 25 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement
Advertisement