సోమశిల: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతుండటంతో లక్షా 24 వేల 722 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది. ఉదయం 6 గంటల సమయానికి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా..4 గంటల వ్యవధిలోనే 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో 32.8 టీఎంసీల నీరు ఉంది. సోమశిల డ్యాం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు గా ఉంది.