somasila project
-
తెలంగాణలో మినీ మాల్దీవులు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
సోమశిల నిర్వసితులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది
-
మెట్ట రైతు మేలు కోసం
-
3 రాజధానులతో మూడు ప్రాంతాలకు సమన్యాయం
మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగునీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేలకోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం. పల్నాడులో కరువు నివారణ కోసం వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి ఎత్తి పోతలను శర వేగంగా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్లతో ప్రాజెక్టును చేపట్టాం. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.3,500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులతోపాటు మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, వ్యవసాయం విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. సోమశిల ప్రాజెక్టు హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెన్నా నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. మొత్తంగా మెట్ట ప్రాంతాలైన దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుందని చెప్పారు. ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా కంపసముద్రం, గుండెమడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్ మిషనరీ (సీఎం), క్రాస్ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం, పంపింగ్ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఇదే ప్రాజెక్టుకు సంబంధించి రూ.527.53 కోట్లతో ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించామని చెప్పారు. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయిందని, అవినీతికి చెక్ పెట్టామని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సోమశిల హై లెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కండలేరు, రాళ్లపాడు జలాశయాలను వేగంగా నింపేలా చర్యలు ► నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. వాటి పనులు నత్తనడకన జరుగుతుంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి. ► పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి, కండలేరు జలాశయాన్ని వేగంగా నింపడానికి సోమశిల–కండలేరు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు పెంచేలా అభివృద్ధి (డబ్లింగ్ వర్క్స్) పనులను రూ.918 కోట్ల వ్యయంతో చేపడతాం. ► రాళ్లపాడు జలాశయాన్ని వేగంగా నింపడానికి సోమశిల–రాళ్లపాడు కాలువ సామర్థ్యాన్ని 720 క్యూసెక్కుల నుంచి 1,440 క్యూసెక్కులకు పెంచుతూ అభివృద్ధి చేసే పనులను రూ.632 కోట్ల వ్యయంతో చేపట్టనున్నాం. ► కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆ శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. పైలాన్ వద్ద మంత్రులు అనిల్, మేకపాటి గౌతమ్రెడ్ది తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాదే ఆరు ప్రాజెక్టులు పూర్తి ► జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. 2022 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ► వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ తొలి దశ, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ఈ ఏడాదే పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. -
సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2 శంకుస్థాపన
-
ఆశలు.. మోసులు
జిల్లాలో రబీ సీజన్ సాగుపై ఆశలు మోసులెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయానికి సోమశిల, కండలేరు జలవనరులే కీలకం. అటువంటి జలాశయాలు ప్రస్తుతం నిండుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో ఊరిస్తున్న మేఘాలు జల్లుకురిసే వరకు నిలవడం లేదు. ఈ పరిస్థితితో వర్షాలు జిల్లాకు మొహం చాటేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కృష్ణా జలాలు సోమశిలకు వస్తుండడంతో జిల్లా రైతులు రబీ సాగుపై ఆశలు పెట్టుకుంటున్నారు. వర్షం ఊరిస్తుందా.. ఊతమిస్తుందా అనేది చూడాల్సి ఉంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో వ్యవసాయం సాగుకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకున్నాయి. సోమశిల 71 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా రెండు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. సోమశిల కింద గతంలో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. కండలేరు కింద జిల్లాలో 2.54 జిల్లాలో ఆయకట్టు ఉంటే.. చిత్తూరు జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి స్టోరేజీని బట్టి ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని స్థిరీకరిస్తున్నారు. ఊరిస్తుందా..! ఊతమిస్తుందా!! సాధారణంగా సోమశిల జలాశయం నుంచి 18 నుంచి 20 టీఎంసీలు ఉంటేనే అరకొర నీరు వదులుతారు. కండలేరు పరిస్థితి కూడా అంతే. 8.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాగుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నీరు లేకపోవడంతో చాలా తక్కువ శాతం సాగు చేశారు. అయితే సోమశిల జలాశయంలో కొద్ది రోజుల వరకు 9 టీఎంసీల నిల్వ ఉండేది. ఇటీవల కృష్ణా జలాలు విడుదల కావడంతో సాగుపై కాసింత ఆశలు మొలకెత్తాయి. బుధవారం సాయంత్రానికి 18.587 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 16,440 క్యూసెక్కుల వంతున కృష్ణానది జలాల రాక కొనసాగింది. గతేడాది కూడా జిల్లాలో వర్షాలు కురవలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు నీళ్లు రావడంతో రబీ సాగు గట్టెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సోమశిలకు రావడంతో అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్‌పై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. చిత్తడి జల్లులతో సరి.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం తుంపర్లతో సరిపెడుతున్నాయి. గతేడాది కూడా పడాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 55 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రబీ అంతంత మాత్రంగా గట్టెక్కినా.. ఖరీఫ్‌లో అనుకున్నంతగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జిల్లాలో 45 మండలాలను కరువుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన రోజులు దాటిపోతున్నా.. నీటి నిల్వల పరిస్థితి రైతాంగాన్ని కలవరపెడుతుంది. జిల్లాలో ఏడాది కూడా ప్రస్తుత సమయానికి పడాల్సిన వర్షాలు కూడా పడలేదు. ఈ ఏడాది పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుండడంతో రబీ ప్రారంభం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రబీలో కొంత, ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది రబీలోనైనా గట్టెక్కాలనుకుంటే వరుణుడు కనికరించక పోవడంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఈ విధంగా లేదు ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాగు, తాగుకు నీరు ఇబ్బందికరంగా మారింది. భూగర్భ జలాలు ఎండిపోయాయి. బోర్లు వేద్దామన్నా నీరు పడే పరిస్థితి లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి. – కొప్పోలు యల్లారెడ్డి, ఆత్మకూరు జేడీ వ్యవసాయశాఖఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కొంత కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎక్కువగా రాపూరు మండలంలో కరువు ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షాలపై ఎక్కువగా ఆధార పడి సాగు చేస్తారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేకపోతే ఈ ఏడాది పంట ఏ విధంగా సాగుచేయాలో ఆందోళన కలిగిస్తుంది.– టి హరగోపాల్, రాపూరు ప్రత్యామ్నాయ పంటలను చూస్తాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనుకున్నంతగా సాగు చేయలేదు. కానీ మరో నెల తర్వాత రబీ ప్రారంభం కానుంది. అప్పటికీ వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. రబీకి విత్తనాలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – బీ చంద్రనాయక్, -
అన్నీ మంచి శకునములే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అడుగంటిన రైతుల ఆశలు చిగురు తొడుగుతున్నాయి. సోమశిల ప్రాజెక్ట్‌కు సుమారు 50 టీఎంసీల నీరు చేరడం.. మూడేళ్ల తరువాత వరుణుడు కటాక్షించి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో వ్యవసాయ రంగానికి మంచి శకునాలే కనిపిస్తున్నాయి. సోమశిల ప్రాజెక్ట్ నుంచి డెల్టాకు గురువారం నీరు విడుదల కానుంది. రోజుకు 4,900 క్యూసెక్కులు అవసరం ఉండగా.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెయ్యి క్యూసెక్కులను మాత్రమే విడుదల చేయనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి నీటి సరఫరా పెంచుతారు. బుధవారం సాయంత్రానికి సోమశిల ప్రాజెక్ట్‌లో 50.310 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 8,670 క్యూసెక్కుల వరద నీరు సోమశిలకు చేరింది. జిల్లాలో మొత్తం రబీ సీజన్ కింద 4.95 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అంచనా వేశారు. ఆ మేరకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. సాగునీటి సలహా మండలి సమావేశం ముందు రోజు సోమశిలలో 49.969 క్యూసెక్కుల నీరుంది. నవంబర్‌లో 6.688 టీఎంసీలు, డిసెంబర్లో 5.365 టీఎంసీలు రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహ జలాలు (ఇన్ ఫ్లో) వస్తాయని అంచనా వేసి మొత్తం నీటి నిల్వను 62.022 టీఎంసీలుగా చూపారు. ఇందులో 7.5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ నిల్వగా ఉంటుంది. నెల్లూరు నగరం, కావలి, అల్లూరు తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు కేటాయించాలని, మొత్తం నీటిలో 1.5 టీఎంసీలు ఆవిరైపోతుందని అంచనా వేశారు. మొత్తంగా 12 టీఎంసీల నీరు పోగా.. 52.281 టీఎంసీలను పంటలకు అందించనున్నారు. కండలేరుకు ఆపేయాలి వరద నీరు అధికంగా వస్తుందనే కారణంతో కండలేరుకు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా నుంచి కండలేరు ప్రాజెక్ట్ ద్వారా చిత్తూరు, చెన్నై అవసరాలకు ఇప్పటికే 15 టీఎంసీలను విడుదల చేశారు. ఈ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే మొదటి హక్కు జిల్లా రైతులకు మాత్రమే ఉంది. ఈ క్రమంలో నూరు శాతం సాగుకు నీరిచ్చి ఆ తర్వాతనే ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కృష్ణా జలాలు విడుదల కాకముందే కండలేరుకు నీరు విడుదల చేయడంపై జిల్లా రైతులు తీవ్రస్థాయిలో అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 15 టీఎంసీల కృష్ణా జలాలను కండలేరు ద్వారా చెన్నై, చిత్తూరుకు పంపుతుంటారు. ఈ ఏడాది కృష్ణా జలాలు విడుదల కాకముందే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సోమశిల జలాలను ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం రోజూ 7,500 క్యూసెక్కుల చొప్పున పంపిస్తున్నారు. తక్షణమే దీనిని నిలిపివేసి సోమశిలలో నిల్వ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. నాన్ డెల్టాలోనూ చిగురిస్తున్న ఆశలు గత ఏడాది వర్షాలు లేక నాన్ డెల్టా ప్రాంతమైన ఓజిలి, చిల్లకూరు, వాకాడు, చిట్టమూరు, పెళ్లకూరు, తడ మండలాల్లో పంటలు పండలేదు. కోట, రాపూరు మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోవడంతో రైతులు అష్టకష్టాలు పడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ ప్రాంత రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వర్షాలకు చెరువులు నిండితే.. పంటలు వేసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. రోజూ 4,900 క్యూసెక్కులు అవసరం జిల్లాలో రబీ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ క్రమంలో రోజూ 4,900 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉంది. పెన్నా డెల్టా ద్వారా నెల్లూరు, సంగం కాలువలకు 2,500 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 600, కనుపూరు కెనాల్‌కు 400 క్యూసెక్కులు విడుదల చేయాలి. నాన్ డెల్టా ప్రాంతంలోని నార్త్ ఫీడర్‌కు 450, సౌత్ ఫీడర్‌కు 450 క్యూసెక్కుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అంత నీరు అవసరం లేదని లెక్క తేల్చారు. కలిగిరి రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 500 క్యూసెక్కులను మూడు రోజుల క్రితమే విడుదల చేశారు. రిజర్వాయర్‌లో 17 అడుగుల మేర నీటి నిల్వ ఉండటంతో తాత్కాలికంగా విడుదల చేసినట్లు చెబుతున్నారు. నాన్ డెల్టాకు సంబంధించి ఈనెల 7న రైతులతో సమావేశం నిర్వహించి నీటి విడుదల షెడ్యూల్ సిద్ధం చేసి 8వ తేదీ నుంచి నీరు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నార్త్, సౌత్ ఫీడర్లకు గురువారం నీరు విడుదల చేయడం లేదు. సోమశిల నుంచి పెన్నాకు నీరు విడుదల చేశాక అక్కడ నుంచి డెల్టాలోని ప్రధాన కెనాల్స్‌కు వెళుతుంది. -
సోమశిల ముంపువాసులకు న్యాయం చేయాలి
► పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయాలనడం అన్యాయం ►వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కడప కార్పొరేషన్: సోమశిల ముంపు వాసుల సమస్యలు పరిష్కరించకుండా వారిని ఖాళీ చేయమనడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబుతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సోమశిల ప్రాజెక్టు వల్ల జిల్లాలోని అట్లూరు, భాకరాపేట, ఒంటిమిట్ట, నందలూరు మండలాల పరిధిలోని రైతుల భూములు, ఇళ్లు, ఆస్తులు ముంపునకు గురై తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నెల్లూరు జిల్లా రైతులకు మాత్రమే మేలు జరిగిందన్నారు. ఒంటిమిట్ట, పెన్నపేరూరు, తప్పెటవారిపల్లె గ్రామాల రైతుల భూములు చాలా వరకూ ముంపునకు గురయ్యాయన్నారు. వారికి అధికారులు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని, పునరావాసం కల్పించలేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంపువాసులకు వారు కోరినదానికన్నా ఎక్కువగా నష్టపరిహారం అందించారని గుర్తు చేశారు. రైతులు తక్షణం ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. పైర్లు పెట్టుకోవద్దని బలవంతం చేయడం సరికాదన్నారు. సోమశిల ముంపు రైతులకు నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. ముంపు వాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28వ తేదీ రైతులతో కలిసి భాకరాపేట నుంచి కడపకు పాదయాత్ర నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ముంపుగ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. 27న టోల్గేట్ ఎదుట ధర్నా– ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చెన్నూరు, చిన్నమాచుపల్లెలో రహదారి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27వ తేదీ టోల్గేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కడప నుంచి కర్నూల్ వరకు కేఎంసీ అనే సంస్థ రహదారిని నిర్మించిందని, ఈమేరకు టోల్గేట్ వసూలు చేస్తోందన్నారు. చెన్నూరు, చిన్నమాచుపల్లెలో అప్రోచ్, సర్వీసురోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదన్నారు. దీనివల్ల పలు కాలనీలకు చెందిన 18వేల మంది ప్రజలు నిత్యం అగచాట్లు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని తాము పలుసార్లు కేఎంసీ వారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రహదారి విస్తరణ వల్ల ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఈనాటికి నష్టపరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించలేదన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యేవరకూ ధర్నా విరమించే ప్రసక్తేలేదన్నారు. జి ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఏ కరిముల్లా, ఎస్ఎండీ షఫీ పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై ఇంత నిర్లక్ష్యమా..?
► రాళ్లపాడు పరిరక్షణకు కదంతొక్కిన రైతులు ► ఆయకట్టు రైతులకు నీళ్లిచ్చి ఆదుకోవాలని డిమాండ్ ► సోమశిల ఉత్తరకాల్వను పూర్తి చేయడంలో సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం ► వైఎస్సార్సీపీ సమన్వయకర్త తూమాటి ఆధ్వర్యంలో ధర్నా కందుకూరు : కందుకూరు నియోజకవర్గానికి జీవనాడి లాంటి రాళ్లపాడు ప్రాజెక్టు పట్ల్ల సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పామూరు బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్, అంకమ్మదేవాలయం మీదుగా పోస్టాఫీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టాఫీస్ సెంటర్లో రాళ్లపాడు ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లపాడుకు నీరందించే సోమశిల ఉత్తరకాల్వ నిర్మాణం, ప్రాజెక్టు ఎడమకాల్వ పొడగింపు పనులు పూర్తి చేయాలని, రాళ్లపాడు నుంచి నీళ్లు తరలించే జీఓ నంబర్ 40 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరందించే సోమశిల ఉత్తర కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చింతలదీవి అనే గ్రామం వద్ద భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో సర్కారు విఫలం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడగింపు పనులు మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, భూసేకరణ గ్రామాల్లో సోషల్ ఇంపాక్టు సర్వే పూర్తి చేయడం కూడా ప్రభుత్వానికి చేతకాదా అని నిలదీశారు. ఈ కారణంతో పనులు ఆగాయంటే ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో, కందుకూరు నియోజకవర్గం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా నేడు రైతులు గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదని మండిపడ్డారు. అధికారులకు వినతి పత్రాలు: అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల సమస్యలపై ఆర్డీఓ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. రాళ్లపాడు రైతులను ఆదుకోకపోతే గ్రామాలు ఖాళీ అవుతాయని చెప్పారు. స్పందించిన ఆర్డీఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తర్వాత రాళ్లపాడు ప్రాజెక్టు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ప్రాజెక్టు డీఈ శ్రీనివాసమూర్తికి వినతి పత్రం అందజేశారు. రాళ్లపాడు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు మాజీ చైర్మన్ ఘనిపినేని నరశింహారావు, గుడ్లూరు జడ్పీటీసీ దోర్శిల వెంకట్రామిరెడ్డి, కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల కన్వీనర్లు కొత్తా రాఘవరెడ్డి, దామా ప్రవీణ్, చంద్రశేఖరరావు, కొండారెడ్డిపాలెం, బసిరెడ్డిపాలెం, అమ్మవారిపాలెం సర్పంచ్‌లు సురేష్, నరసింహ, మాలకొండయ్యలు, నాయకులు షేక్ రఫి, గణేశం గంగిరెడ్డి, దాసరి మాల్యాద్రి, వెంకటస్వామి, సుదర్శి శ్యామ్, ఎస్.సుధాకర్, థామస్, రాఘవ, వెంకట్, రాజారెడ్డి, వెంట్రామిరెడ్డి, నగళ్ల నారయ్య, హాజీమలాంగ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. జీఓ 40 అత్యంత దుర్మార్గం: ఒకపక్క ప్రాజెక్టుకు నీరు వచ్చే పూర్తి చేయకుండా మరోపక్క రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామథేనువు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 40ని విడుదల చేయడం మరీ దుర్మార్గంగా ఉందని తూమాటి పేర్కొన్నారు. ప్రాజెక్టులో నీరు లేక నాలుగేళ్లుగా కరువుకాటకాలతో అల్లాడుతుంటే ప్రాజెక్టు నుంచి నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కామథేను పశు అభివృద్ధి కేంద్రం భూముల్లోంచే సోమశిల కాల్వ వస్తున్నా అక్కడి నుంచి నీటిని మళ్లించకుండా, రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి వెనక్కి 12కిలోమీటర్లు నీటిని తరలించడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు. ఇది పూర్తిగా రాళ్లపాడు ప్రాజెక్టును నిర్వీర్యం చేసు కుట్రను ప్రభుత్వం చేస్తుందని, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. -
సోమశిలకు 6348 క్యూసెక్కులు
సోమశిల : రాయలసీమలో కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి ఆదివారం ఉదయం 6348 క్యూసెక్కుల వంతున వరద కొనసాగుతోంది. పెన్నానది ఉపనది కుందూనది శనివారం రాత్రి 4 వేల క్యూసెక్కుల వంతున ప్రవహించింది. ఉదయానికి ఈ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. పాపాఘ్ని నదిలో ఉదయం 6వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహించింది. వైఎస్సార్ జిల్లా వద్ద పెన్నా నదిలో ఉదయం 12500 క్యూసెక్కుల వరద కొనసాగగా, మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టి 6,500 క్యూసెక్కులకు చేరింది. బద్వేలు, మైదుకూరు, తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సిద్దవటం వద్ద పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం జలాశయానికి చేరేందుకు మరో రెండు రోజులు పట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 11.033 టీఎంసీలు, 84.302 మీటర్లు, 276.68 అడుగుల నీటి మట్టం ఉంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 3 వేల క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలో 7.4 మీ.మీ.ల వర్షపాతం నమోదైంది. -
సోమశిలలో నీరు దుర్వినియోగం కాలేదు
నెల్లూరు(పొగతోట): సోమశిల ప్రాజెక్ట్‌లో నీరు దుర్వినియోగం కాలేదని కలెక్టర్ జానకి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సోమశిల ప్రాజెక్ట్‌లో 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారని, ఈ విషయమై పత్రికల్లో వార్తలు సైతం ప్రచురితమయ్యాయని వివరించారు. రైతు సంఘాల నాయకులు సేకరించిన సమయంలో నీటి గణాంకాలు పూర్తి స్థాయిలో లేవన్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీరు, విడుదల, వస్తున్న నీటి గణాంకాలను పూర్తిగా పరిశీలించారని చెప్పారు. 26 టీఎంసీల నీరు దుర్వినియోగం కాలేదని, ప్రాజెక్ట్‌లోనే నిల్వ ఉన్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ 12న ఐఏబీ సమావేశం జరిగిందని, అప్పటికి జిల్లాలో 68.9 టీఎంసీల నీరు నిల్వ ఉందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారన్నారు. ఐఏబీ నాటికి 67.862 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గత నెల 20 నాటికి 18 టీఎంసీల నీరు ఇన్‌ఫ్లో ఉందని తెలిపారన్నారు. 3.918 టీఎంసీల నీరు మాత్రమే ఇన్‌ఫ్లో వచ్చిందని, కండలేరు రిజర్వాయర్‌కు 7.348 టీఎంసీల నీటిని విడుదల చేస్తే, మూడు టీఎంసీలనే విడుదల చేశారని నాయకులు తెలిపారన్నారు. ఇలాంటి తేడాల వల్ల 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే సోమశిల ప్రాజెక్ట్‌లో 33 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందన్నారు. నాయకులు చెప్పిన దానికి రికార్డులను పరిశీలిస్తే ఒక టీఎంసీ నీరు మాత్రమే తేడా వస్తోందని, ఇది ఆవిరి, వృథా కిందపోయి ఉంటుందని తెలిపారు. నాయకులు ఫిర్యాదు చేసిన వెంటనే రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు. 4.32 లక్షల ఎకరాలకు 43.7 టీఎంసీల సాగునీటిని విడుదల చేయాలని ఐఏబీలో తీర్మానించి నివేదికలను ప్రభుత్వానికి పంపి అనుమతితో నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. సోమశిల ప్రాజెక్ట్‌లో ఈఈ 3.2 టీఎంసీల నీటిని గణాంకాల్లో తక్కువగా నమోదు చేశారని చెప్పా రు. -
భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం
-
భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం
నెల్లూరు : నెల్లూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించి... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నై - విజయవాడ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం 67 టీఎంసీలకు చేరింది. సూళ్లురుపేటలో కాళంగి నది ఉగ్ర రూపం దాల్చింది. జిల్లాలోని గూడూరు వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అలాగే జిల్లాలోని కండలేరు, కుక్కుటేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తిప్పకుంటపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గూడూరు మండలంలోని కైవల్యానది పొంగి ప్రవహిస్తుంది. ఆత్మకూరు, చమడపాలెం, జీఎస్ కండ్రిగ, రామలింగాపురం, విండూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
సోమశిలకు పెరిగిన ఇన్‌ఫ్లో
సోమశిల: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతుండటంతో లక్షా 24 వేల 722 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది. ఉదయం 6 గంటల సమయానికి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా..4 గంటల వ్యవధిలోనే 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో 32.8 టీఎంసీల నీరు ఉంది. సోమశిల డ్యాం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు గా ఉంది. -
కృష్ణా నుంచి పెన్నాకు నీరు
సమగ్ర సర్వేకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ విజయవాడ బ్యూరో: భవిష్యత్‌లో పెన్నా ఆయకట్టులో సాగునీటి అవసరాలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్న రాష్ట్ర సర్కారు.. ఈ మేరకు కృష్ణానది నుంచి పెన్నాకు నీరు మళ్లించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా.. మొదట గోదావరి జలాలను కృష్ణాకు, అక్కడి నుంచి పెన్నానదిపై నిర్మించిన సోమశిల ప్రాజెక్టుకు ఎగువకు మళ్లించడం బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల వృథాగా పోతున్న గోదావరి జలాలను కృష్ణా, పెన్నా ఆయకట్టుల్లో సద్వినియోగం చేసుకోవచ్చని సర్కారు అభిప్రాయపడుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే మొద ట గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించాలంటే.. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి. అప్పుడు 80 టీఎంసీల నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదికి మళ్లించవచ్చు. అయితే ఇప్పటికే చాలా వరకు తవ్వకం పూర్తయిన కుడికాల్వ.. పోలవరం పూర్తయ్యేలోపే దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నాటికి ఒక ఎత్తిపోతల పథకం ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని ఈ కాల్వకు మళ్లించి అక్కడి నుంచి బుడమేరు ద్వారా కృష్ణానదిలో కలపాలని నిర్ణయించింది. ఇందు కోసం... ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం ప్రాజెక్టుకు మధ్యలో నిత్యం 7 మీటర్ల లోతున నీరుండే ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఇరిగేషన్ అధికారులు యోచిస్తున్నారు. బకింగ్‌హామ్ కాల్వ ఉపయోగపడుతుందా? కృష్ణా నీటిని పెన్నాకు తరలించేందుకు బకింగ్‌హామ్ కాల్వ ఏ మేరకు ఉపయోగపడుతుందో పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఇరిగేషన్ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నెల 19న సచివాలయంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించారు. విజయవాడ నుంచి నెల్లూరు వరకూ సుమారు 210 కిలోమీటర్ల మేర నీటిని తరలించాలంటే కనీసం రూ.200 కోట్లన్నా ఖర్చు ఖాయమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ బకింగ్‌హామ్ కాల్వ.. కాకినాడ నుంచి తమిళనాడు వరకూ కోస్టల్ కారిడార్‌కు ఆనుకుని ఉన్న బకింగ్‌హాం కాల్వ పొడవు 421 కిలోమీటర్లు. విజయవాడ నుంచి గుంటూరు జిల్లా దుగ్గిరాల వరకూ కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్ ఉంది. ఇక్కడ నుంచి ఇదే కాల్వ ప్రకాశం జిల్లా పెదగంజాం వరకూ కొమ్మమూరు కాల్వగానూ, అక్కడి నుంచి చెన్నై వరకూ బకింగ్‌హామ్ కాల్వగానూ పిలుస్తున్నారు.