సోమశిలకు 6348 క్యూసెక్కులు
సోమశిలకు 6348 క్యూసెక్కులు
Published Sun, Jul 31 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
సోమశిల : రాయలసీమలో కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి ఆదివారం ఉదయం 6348 క్యూసెక్కుల వంతున వరద కొనసాగుతోంది. పెన్నానది ఉపనది కుందూనది శనివారం రాత్రి 4 వేల క్యూసెక్కుల వంతున ప్రవహించింది. ఉదయానికి ఈ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. పాపాఘ్ని నదిలో ఉదయం 6వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహించింది. వైఎస్సార్ జిల్లా వద్ద పెన్నా నదిలో ఉదయం 12500 క్యూసెక్కుల వరద కొనసాగగా, మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టి 6,500 క్యూసెక్కులకు చేరింది. బద్వేలు, మైదుకూరు, తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సిద్దవటం వద్ద పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం జలాశయానికి చేరేందుకు మరో రెండు రోజులు పట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 11.033 టీఎంసీలు, 84.302 మీటర్లు, 276.68 అడుగుల నీటి మట్టం ఉంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 3 వేల క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలో 7.4 మీ.మీ.ల వర్షపాతం నమోదైంది.
Advertisement
Advertisement