TMCs
-
తుంగభద్రలో నీటి లభ్యత సగంలోపే!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పుల కారణంగా తుంగభద్ర బేసిన్లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం వల్ల తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో నీటి లభ్యత ఈ ఏడాది సగానికి పడిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు డ్యామ్‌లోకి 114.58 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. తుంగభద్ర నదిలో వందేళ్ల ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని.. టీబీ డ్యామ్ వద్ద 75 శాతం లభ్యత ఆధారంగా 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా 1976లో వేసింది. దీన్ని బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ 2010లో ఖరారు చేసింది. కానీ.. రెండు ట్రిబ్యునళ్లు అంచనా వేసిన దాంట్లో సగం నీళ్లు కూడా ఈ ఏడాది టీబీ డ్యామ్‌లోకి చేరకపోవడం గమనార్హం. టీబీ డ్యామ్ చరిత్రలో 2016–17లో వచి్చన 85.71 టీఎంసీలే కనిష్ట ప్రవాహం. ఈ ఏడాది వచ్చింది రెండో కనిష్ట ప్రవాహం. శనివారం నాటికి టీబీ డ్యామ్‌లో 10.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 76.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. టీబీ డ్యామ్‌లో ఇదే సమయానికి గత పదేళ్లలో సగటున 50.60 టీఎంసీలు నిల్వ ఉండేవి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కనిష్ట నీటి నిల్వ ఉండడం కూడా ఇదే తొలిసారి. టీబీ డ్యామ్ నుంచి కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండడంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తున్నది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో 3 రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తున్నది. ఈ ఏడాది నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో ఆయకట్టులో ఆరు తడి పంటలకు నీటిని సరఫరా చేశారు. 2019–20 నుంచి 2022–23 వరకుటీబీ డ్యామ్‌లోకి భారీగా వరద చేరడంతో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించారు. టీబీ డ్యామ్ చరిత్రలో గతేడాది అంటే 2022–23లో వచి్చన 606.64 టీఎంసీలే గరిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. -
తెలంగాణకు 85, ఏపీకి 20 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవిలో తాగు, సాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ జలా శయంలోని నిల్వల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 20 టీఎంసీలు, తెలంగాణకు 85 టీఎం సీలను కేటాయిస్తూ కృష్ణానది యాజ మాన్య బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10న జరిగిన త్రిసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కేటాయింపులు జరిపింది. -
24 గంటల్లో 27.37 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్/ భద్రాచలం/ కాళేశ్వరం: కృష్ణా నది పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ నుంచి దిగువకు పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 24 గంటల్లో 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ .. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ఏ స్థాయిలో వరద ఉధృతి ఉందో ఇది స్పష్టం చేస్తోంది. తుంగభద్ర పోటెత్తడంతో డ్యామ్‌లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు 40 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే వరద మరింతగా పెరగనుంది. ప్రస్తుతం 4,05,064 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 95 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇలానే కొనసాగితే గురువారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సాగర్‌కు 31,784 క్యూసెక్కులు శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న నీటితో కలిపి సాగర్‌కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుం చి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తోంది. ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ గోదావరి నది శాంతించింది. భద్రాచలం వద్ద వరద తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున నీటిమట్టం 48 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను, సాయంత్రం 4 గంటలకు 43 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించారు. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం 13.70 మీటర్లు ఉన్న నీటిమట్టం ఆదివారం నాటికి 9.50 మీటర్లకు చేరింది. -
‘కృష్ణా’ జలాల వాడకం 920.4 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు ఈ ఏడాది వాటర్ ఇయర్లో రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ 647.559 టీఎంసీలు వినియోగించుకోగా, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తి కాగా, తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఏపీ వాటా పూర్తయిన నేపథ్యంలో సాగర్ కుడి కాల్వ, ముచ్చుమర్రి, హంద్రీనీవా కింద నీటి వినియోగం ఆపాలని ఏపీకి సూచించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. వాటర్ ఇయర్ మే 31తో ముగుస్తుండటంతో రెండు రాష్ట్రాలకు చేసిన నీటి కేటాయింపులు, వినియోగం, నీటి లభ్యత లెక్కలను కృష్ణా బోర్డు తేల్చింది. బోర్డు తేల్చిన లెక్కలివే.. ► శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది. ► నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. ► ఇక తెలంగాణ.. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాల్వ ద్వారా 91.007 వెరసి 148.806 టీఎం సీలను తెలంగాణ ఉపయోగించుకుంది. ► తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్ఎల్సీ ద్వారా 30.192, ఎల్ఎల్ఎల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియో గించుకుంది. ఆర్డీఎస్ ద్వారా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది. ► జూరాల ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. ► మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. ► ప్రస్తుత వాటర్ ఇయర్లో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా బోర్డు లెక్క కట్టింది. ఇందులో ఏపీ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు, తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు. ► ఏపీ ఇప్పటికే 647.559 టీఎంసీలు వినియోగించుకుందని, వాటా కంటే 0.272 టీఎంసీలు అదనంగా వాడుకున్నట్లు కృష్ణా బోర్డు లెక్క కట్టింది. తెలంగాణ తన వాటా కంటే 60.605 టీఎంసీలు తక్కువగా 272.846 టీఎంసీలు వినియోగించు కున్నట్లు బోర్డు తేల్చింది. అంటే తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులు, తెలంగాణలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు లెక్క కట్టింది. -
శ్రీశైలంలోకి 1,230 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టుకు 2.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. 3.08 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వాటర్ ఇయర్ (జూన్ 1 నుంచి మే 31 వరకు)లో శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి 1,230.22 టీఎంసీల వరద ప్రవాహం రావడంతో పదేళ్ల క్రితం నమోదైన రికార్డు బద్ధలైంది. 2009–10లో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,220.54 టీఎంసీల ప్రవాహం రావడం గమనార్హం. -
కర్ణాటక కరుణించె
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దౌత్యం ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం కరుణించింది. భానుడి ప్రతాపానికి ప్రియదర్శిని జూరాలలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోయి.. తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతోన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ఒప్పుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి శుక్రవారం రాత్రి నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజాము వరకు నీరు జూరాల ప్రాజెక్టులో చేరనుంది. జూరాల నుంచి రామన్‌పాడు, బీమా, కోయిల్‌సాగర్, కేఎల్ఐ తదితర ప్రాజెక్టుల్లో నీరు చేరనుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావాసుల తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు నెలకొన్నాయి. ఇదీలా ఉంటే కర్ణాటక విడుదల చేసే 2.5 టీఎంసీలలో ఒక టీఎంసీ నీరు మధ్యనే ఆవిరైపోతుందని, కేవలం 1.5 టీఎంసీ మాత్రమే జూరాలకు చేరుకుంటుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ 100క్యూసెక్కుల నీరు ఆవిరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60శాతానికి పైగా గ్రామాలకు జూరాల ప్రాజెక్టు నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అయితే ఈ సారి భానుడు నిప్పులు చెరుగుతుం డడంతో ప్రతిరోజూ సుమారు వంద క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 9.66 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీరు ఉంటే దాన్ని డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం జలాశయంలో 1.93 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. అంటే డెడ్‌స్టోరేజీ కంటే ఒక టీఎంసీకి పైగా నీళ్లు తక్కువగా ఉందన్న మాట. నీటి లభ్యత లేకపోవడంతో ప్రధాన గ్రిడ్ ద్వారా ఆవాసా ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి. చాలా చోట్ల నీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో జూరాలలో తగ్గుతోన్న నీటి మట్టంపై ఆందోళన చెందిన ఇరిగేషన్ అధికారులు సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేసి.. పాలమూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని గత నెలలోనే కర్ణాటక సీఎం కుమారస్వామికి లేఖరాశారు. లేఖపై స్పందించిన కర్ణాటక సీఎం అధికారులతో చర్చించి ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపారు. జూరాలే కీలకం.. ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న ప్రధాన గ్రిడ్ నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని 319 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు ప్రతి రోజూ 50ఎంఎల్డీ సరఫరా అవుతోంది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో అధికారులు అప్రోచ్ కెనాల్‌ను జేసీబీలతో సరి చేస్తూ నీరు సరఫరా చేస్తున్నారు. మరోవైపు జూరాల ఎడమ కాల్వ ద్వారా విడుదలయ్యే నీటిని వనపర్తిలో ఉన్న రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం అక్కడి నుండి వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న 500 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే రామన్‌పాడులోనూ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కావడం ఆయా ప్రాంతాల్లో నెలకొననున్న నీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. వీటితో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించి కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 300 గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తారు. ఎవరిదీ పాపం? మూడు నెలల క్రితం వరకు జూరాలలో తాగునీటి అవసరాలకు సరిపడేంత నీటి లభ్యత ఉంది. తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా జలాశయంలో నీరు ఆవిరవుతూ వచ్చింది. దీంతో అధికారులు రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే జూరాల, బీమా ప్రాజెక్టుల పరిధిలోని పెబ్బేరు, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగు చేసిన వరి, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయంటూ ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి లేఖరాశారు. దీనిపై స్పందించిన ఆయన నీటి విడుదలకు ఆదేశించారు. దీంతో జనవరి 6న సాగు కోసం జూరాల ఎడమ కాలువ నుంచి 0.7టీఎంసీల నీటిని తరలించారు. ఆ సమయంలో నీటిని తరలించకపోతే ఈ రోజు ఈ స్థాయిలో తాగునీటి కష్టాలు ఉండేవి కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదీలా ఉంటే ప్రతి సంవత్సరం జూరాల ప్రాజెక్టులో నీళ్లు అయిపోగోట్టుకోవడం, కర్ణాటకను అడుక్కోవడం నాలుగేళ్లుగా ఓ తంతుగా మారింది. తాగు, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని.. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
పూర్తి నిల్వకు చేరువలో శ్రీశైలం
మరో 18 టీఎంసీలు చేరితే పూర్తిస్థాయి నీటిమట్టం ఇప్పటికే 1.37 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. నేడు గేట్లు ఎత్తే అవకాశం సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వారం, పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.46 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువనున్న కర్ణాటక నుంచి వస్తున్న ప్రవాహాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 1.37 లక్షల క్యూసెక్కుల మేర కొనసాగుతోంది. అక్కడి నుంచి 77 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి మరో 18 టీఎంసీలు చేరితే పూర్తి స్థాయి మట్టానికి చేరుకోనుంది. దీంతో బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌కు 73 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ప్రస్తుత నిల్వ 153.13 టీఎంసీలకు చేరింది. కాగా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోనూ నీటి ప్రవాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులన్నింటిలోకి భారీ ఇన్‌ఫ్లో నమోదవుతుండటంతో అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 30 వేల చెరువులు ఫుల్! ప్రస్తుత వర్షాలతో రాష్ట్రంలోని చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. మొత్తంగా 43 వేల చెరువులకుగానూ ప్రస్తుతం 20 వేల చెరువులు పొంగిపొర్లుతుండగా మరో 10 వేల చెరువులు 90 శాతం నీటితో కళకళ్లాడుతున్నాయి. మరో 6 వేల చెరువులు 75 శాతం నిండాయి. ఇందులో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయని నీటిపారుదల శాఖ లెక్కలు చెబుతున్నాయి. -
సోమశిలకు 6348 క్యూసెక్కులు
సోమశిల : రాయలసీమలో కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి ఆదివారం ఉదయం 6348 క్యూసెక్కుల వంతున వరద కొనసాగుతోంది. పెన్నానది ఉపనది కుందూనది శనివారం రాత్రి 4 వేల క్యూసెక్కుల వంతున ప్రవహించింది. ఉదయానికి ఈ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. పాపాఘ్ని నదిలో ఉదయం 6వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహించింది. వైఎస్సార్ జిల్లా వద్ద పెన్నా నదిలో ఉదయం 12500 క్యూసెక్కుల వరద కొనసాగగా, మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టి 6,500 క్యూసెక్కులకు చేరింది. బద్వేలు, మైదుకూరు, తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సిద్దవటం వద్ద పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం జలాశయానికి చేరేందుకు మరో రెండు రోజులు పట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 11.033 టీఎంసీలు, 84.302 మీటర్లు, 276.68 అడుగుల నీటి మట్టం ఉంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 3 వేల క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలో 7.4 మీ.మీ.ల వర్షపాతం నమోదైంది. -
డెల్టాకు 3.5 టీఎంసీల నీరు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం ముగిసింది. డెల్టా తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాల్సిందేనని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు తాజాగా నిర్ణయించింది. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున వారం పాటు నీటి విడుదలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అమలు చేయాలంటూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు సూచించింది. డెల్టాకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర స్థాయి కమిటీ ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది. బోర్డు ఇన్చార్జ్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఎ.బి. పాండ్య ఇరు ప్రాంతాల అధికారులతో చర్చించారు. ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకుని డెల్టాకు నీటిని విడుదల చేయాలని నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్‌కు సూచించారు. దీని ప్రకారం వారం రోజుల పాటు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలి. ఇలా విడుదల చేసే జలాలు సుమారు 3.5 టీఎంసీల వరకు ఉండొచ్చని అంచనా. వారం తర్వాత ఆయన మళ్లీ ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారు. సీడబ్ల్యూసీకి టీ-సర్కారు లేఖ బోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా సాగుకూలంగా స్పందించింది. బోర్డు ఆదేశాలు వెలువడిన వెంటనే నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, ముఖ్య కార్యదర్శి అరవిందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నీటి పరిమాణాన్ని 10 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీలకు తగ్గించినందున నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ నీటిని కేవలం తాగునీటి కోసమే వాడుకునే విధంగా పర్యవేక్షించాలని సూచించినట్టు సమాచారం. ఈ మేరకు సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి బి.అరవింద్‌రెడ్డి మంగళవారమే కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌కు లేఖ రాశారు. రాష్ర్ట స్థాయి కమిటీ ఇక లేనట్లే! బోర్డు రంగంలోకి దిగి బాధ్యతలను చేపట్టడంతో ప్రస్తుతమున్న రాష్ర్ట స్థాయి కమిటీ రద్దయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నిర్ణయం ఇప్పటికే వివాదాస్పదమైనందున భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి ఎదురుకావచ్చని భావించిన కృష్ణా బోర్డు వెంటనే రంగంలోకి దిగి నిర్ణయం తీసుకున్నట్లు సాగునీటి వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలకూ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ కూడా పర్యవేక్షించారు. బోర్డు నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఆయన తాజాగా సూచించారు.