‘కృష్ణా’ జలాల వాడకం  920.4 టీఎంసీలు  | The Use Of Krishna Water Is 920.4 TMCs By Two States | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’ జలాల వాడకం  920.4 టీఎంసీలు 

Published Wed, May 20 2020 4:36 AM | Last Updated on Wed, May 20 2020 4:36 AM

The Use Of Krishna Water Is 920.4 TMCs By Two States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు ఈ ఏడాది వాటర్‌ ఇయర్‌లో రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 647.559 టీఎంసీలు వినియోగించుకోగా, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ వాటా పూర్తి కాగా, తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఏపీ వాటా పూర్తయిన నేపథ్యంలో సాగర్‌ కుడి కాల్వ, ముచ్చుమర్రి, హంద్రీనీవా కింద నీటి వినియోగం ఆపాలని ఏపీకి సూచించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. వాటర్‌ ఇయర్‌ మే 31తో ముగుస్తుండటంతో రెండు రాష్ట్రాలకు చేసిన నీటి కేటాయింపులు, వినియోగం, నీటి లభ్యత లెక్కలను కృష్ణా బోర్డు తేల్చింది.

బోర్డు తేల్చిన లెక్కలివే..
► శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్‌ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది.
► నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంది. 
► ఇక తెలంగాణ.. నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 
57.799, ఎడమ కాల్వ ద్వారా 91.007 వెరసి 148.806 టీఎం సీలను తెలంగాణ ఉపయోగించుకుంది.
► తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్‌ఎల్సీ ద్వారా 30.192, ఎల్‌ఎల్‌ఎల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్‌ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియో గించుకుంది. ఆర్డీఎస్‌ ద్వారా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది.
► జూరాల ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
► మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా
9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
► ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా బోర్డు లెక్క కట్టింది. ఇందులో ఏపీ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు, తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు.
► ఏపీ ఇప్పటికే 647.559 టీఎంసీలు వినియోగించుకుందని, వాటా కంటే 0.272 టీఎంసీలు అదనంగా వాడుకున్నట్లు కృష్ణా బోర్డు లెక్క కట్టింది. తెలంగాణ తన వాటా కంటే 60.605 టీఎంసీలు తక్కువగా 272.846 టీఎంసీలు వినియోగించు కున్నట్లు బోర్డు తేల్చింది. అంటే తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులు, తెలంగాణలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు లెక్క కట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement