
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టుకు 2.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. 3.08 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వాటర్ ఇయర్ (జూన్ 1 నుంచి మే 31 వరకు)లో శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి 1,230.22 టీఎంసీల వరద ప్రవాహం రావడంతో పదేళ్ల క్రితం నమోదైన రికార్డు బద్ధలైంది. 2009–10లో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,220.54 టీఎంసీల ప్రవాహం రావడం గమనార్హం.