దుస్తులు కొంటామని వచ్చి కిరాతకంగా గొంతు కోసి.. | Women Assassinated For Her Gold Karnataka | Sakshi
Sakshi News home page

పెళ్లి ఉందని దుస్తులు కొంటామని వచ్చి గొంతు కోశారు 

Published Sat, Oct 23 2021 6:55 AM | Last Updated on Sat, Oct 23 2021 9:18 AM

Women Assassinated For Her Gold Karnataka - Sakshi

సాక్షి,హొసపేటె( బెంగళూరు): హొసపేటెలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఒక  ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళల గొంతు కోశారు. ఒక మహిళ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని రాణిపేటలో నివాసం ఉంటున్న అక్కా చెల్లెలు భువనేశ్వరి(58), శివభూషణ(56)లు తమ ఇంటిలోనే దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. గురువారం ఇద్దరు వ్యక్తులు వచ్చి తమ ఇంటిలో పెళ్లి ఉందని, రేపు వచ్చి దుస్తులు కొంటామని చెప్పి వెళ్లారు.

శుక్రవారం సాయంత్రం ఐదు మంది వ్యక్తులు వచ్చి దుస్తులు కొంటున్నట్లు నటించారు. సదరు మహిళలు దుస్తులు చూపిస్తుండగా చాకుతో గొంతు కోసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించారు. భువనేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా శివభూషణ తీవ్రంగా గాయపడింది. ఎస్పీ అరుణ్, డీఎస్పీ విశ్వనాథ్‌ కులకర్ణి, సీఐ శ్రీనివాస్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శివభూషణను ఆస్పత్రికి తరలించి దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

చదవండి: వివాహేతర సంబంధం: మైనర్‌ బాలుడే నిందితుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement