Karnataka Crime News Today: Man Assassinated By Extra Marital Affair With Woman Karnataka - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: చెల్లెలితో ఫోన్‌ చేయించి..

Published Tue, Jan 25 2022 7:02 AM | Last Updated on Tue, Jan 25 2022 11:47 AM

Man Assassinated Over Extra Marital Affair With Woman Karnataka - Sakshi

సాక్షి, హుబ్లీ(కర్ణాటక): వివాహేతర సంబంధం హత్యకు దారితీసిన ఘటన జిల్లాలోని కలఘటికి తాలూకా కురివినకొప్ప గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన వివాహిత మహిళ ఓ గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. పక్క గ్రామానికి చెందిన ఆటో నిర్వాహకుడు  మంజునాథ్‌ మరప్పనవర్‌ ఆటోలో ఆమె ప్రయాణించేది. ఈక్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.

అనైతిక సంబంధాలు తగదని ఆ మహిళ అన్న బసవరాజ కురడికేరి మంజునాథ్‌కు పలుసార్లు హెచ్చరికలు జారి చేశారు. అయినా పట్టించుకోలేదు. దీంతో బసవరాజ్‌ తన చెల్లెలితోనే ఫోన్‌ చేయించి మంజునాథ్‌ను పిలిపించి ఈ నెల 18న  రాళ్లు, మారణాయుధాలతో కొట్టి చంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేశార

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement