
సౌత్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది.

ఈ వివాహ వేడుకకు ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఒకరు.

జీవితంలో పెళ్లి చేసుకోనని శపథం చేసిన ఈ బ్యూటీ.. తన స్నేహితురాలు కీర్తి వివాహానికి మాత్రం హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కీర్తి సురేశ్ పెళ్లిలో తన నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాను. ఎందుకంటే వృత్తిపరమైన ఫోన్ కాల్స్ అదేపనిగా వస్తూనే ఉన్నాయి.

దాంతో పెళ్లి వేడుకలయ్యేంతవరకు ఉండలేకపోయాను. పనుందని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను.

కానీ కీర్తి, ఆంటోని పెళ్లికి హాజరైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లిలో నువ్వు ఆనందభాష్పాలు కారుస్తూ అతడిని హత్తుకోవడం చూసి మా కళ్లు చెమ్మగిల్లాయి.

ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో కలకాలం భద్రంగా దాచుకుంటాను. ఇంత మంచి అనుభూతినిచ్చినందుకు థాంక్యూ.. అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

కాగా ఐశ్వర్య లక్ష్మి.. గాడ్సే, పొన్నియన్ సెల్వన్, అమ్ము, కుమారి, కింగ్ ఆఫ్ కొత్త.. వంటి పలు చిత్రాల్లో నటించింది.








