
బొమ్మనహళ్లి: ఐటీ సిటీలో హత్యల సంస్కృతి పెరిగిపోతోంది. స్నేహితులు, భార్యభర్తలు, ప్రేమికులు సైతం పరస్పరం హత్యలకు తెగబడడం పెరిగిపోతోంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటి పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో అర్చనా రెడ్డి (38) అనే మహిళను ఆమె రెండవభర్త నవీన్ కుమార్, మరో ఇద్దరితో కలికి కత్తులతో నరికి చంపాడు.
వివరాలు... ఆనేకల్ జిగణికి చెందిన అర్చనకు మొదట పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు. భర్తతో గొడవలు వచ్చి విడిపోయి, తరువాత నవీన్‌కుమార్‌ను రెండవ పెళ్ళి చేసుకుంది. ఆస్తుల విషయంలో అతనితోనూ గొడవలు వచ్చి బెళ్లందూరులో విడిగా నివసిస్తోంది. పురసభ ఎన్నికల్లో ఓటు వేసి కారు డ్రైవర్, కొడుకుతో కలిసి కారులో వస్తోంది. కాపు కాసిన నవీన్‌కుమార్, అనుచరులు కారును హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద అటకాయించి దాడి చేశారు. ఆమె కుమారుడు, డ్రైవర్ పరారయ్యారు. కారులో ఉన్న అర్చనా రెడ్డిని ముగ్గురు కలిసి దారుణంగా నరికి హత్య చేసి వెళ్లిపోయారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పరిశీలించి ఆమె కుమారుడు, డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment