నిందితురాలు శ్వేత
బనశంకరి(కర్ణాటక): యలహంకలో నేత కార్మికుని దారుణ హత్య కేసులో భార్య శ్వేత లీలలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసినప్పటికీ పట్టించుకోకుండా అడుగులేసింది. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది.
ఈ నెల 22వ తేదీన యలహంక కొండప్పలేఔట్‌లో మేడపై హత్యకు గురైన సత్యసాయి జిల్లా హిందూపురం వాసి చంద్రశేఖర్ (35) కేసులో భార్య శ్వేత, ఆమె ప్రియుడు సురేశ్‌లను పోలీసులు బుధవారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సురేశ్‌ను పిలిపించి హత్య చేయించినట్లు విచారణలో తెలిపింది.
కాలేజీలో ఇష్టానుసారం స్నేహాలు
బెంగళూరులో ఎంఎస్‌సీ చదివిన శ్వేత కాలేజీలో పలువురు స్నేహితులతో డేటింగ్ చేసింది. టీవీలు, సినిమాలు చూసి అదే లోకం అనుకుంది. ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండడం గొప్ప అనుకుని అలాగే చేసేది. కనీసం 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్ లిస్టులో పెట్టేదని తెలిసింది. ఇంటి యజమాని కుమారునితోనూ చనువుగా మెలిగింది. అతనితో బైక్‌పై కాలేజీకి వెళ్లేది. ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. ఇవి భర్త చంద్రశేఖర్‌కు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇక ప్రియుడు సురేశ్‌తో మాట్లాడానికి కొత్త సిమ్‌కార్డును కొని అందులో హత్య కుట్ర గురించి మాట్లాడింది.
భర్తను పైకి పంపింది ఇలా
ఈ నెల 22 తేదీన సురేశ్‌ను ఇంటికి పిలిపించింది. భర్త చంద్రశేఖర్ పని నుంచి ఇంటికి రాగానే నీరు రావడం లేదు, పైకి ట్యాంకు వద్దకు వెళ్లి చూడాలని శ్వేత చెప్పింది. అతడు వెళ్లగానే అక్కడ దాగి ఉన్న సురేశ్ రాడ్‌తో తలపై కొట్టి, మర్మాంగం కత్తిరించి హత్య చేసి ఉడాయించాడు. తరువాత తనకేమి తెలియనట్లు శ్వేత నాటకమాడింది. భర్త శవంపై పడి వెక్కివెక్కి విలపించింది. ఆమెపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విషయమంతా వివరించింది.
చదవండి: భర్త కంటే 16 ఏళ్లు చిన్న.. వివాహేతర సంబంధం మోజుతో
Comments
Please login to add a commentAdd a comment