ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,శివమొగ్గ(బెంగళూరు): ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కోడలిపై అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దారుణ ఘటన శనివారం శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హోళెనల్కెర గ్రామంలో చోటుచేసుకుంది. రిహానా బాను మంటల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు... తడగ గ్రామానికి చెందిన రిహానాబానుకు ఏడేళ్ల క్రితం ఇమ్రాన్ అలీకి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఏడాది క్రితం ఇమ్రాన్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. అప్పటి నుంచి రిహానా తన ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటోంది. రెండు రోజుల క్రితం భర్తకు చెందిన ఇన్సూరెన్స్ నగదు రూ .2 లక్షలు వచ్చాయి. నగదు ఆమె ఖాతాలో పడింది. ఈ విషయం తెలుసుకున్న అత్త, మామ కోడలు ఉంటున్న ఇంటికి వచ్చారు. డబ్బుల కోసం గొడవ పడ్డారు. డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వారు కోడలిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలతో రిహానా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి..
Comments
Please login to add a commentAdd a comment