
నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో అనుమానితులు
నవాబుపేట (జడ్చర్ల) : మండలంలోని చాకలపల్లిలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కలకలం సృష్టించారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేయడంతో.. పోలీసులు కల్పించుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. వివరాలిలా.. మండలంలోని చాకలపల్లిలో సోమవారం నలుగురు వ్యక్తులు సారా కోసం వాకబు చేశారు.
అయితే ఇటీవల చిన్నపిల్లలను ఎత్తుకెళ్లేందుకు కొందరు గ్రామాలకు వస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేíశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే గ్రామానికి చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వీరు గతంలో చాకలపల్లిలో మేస్త్రీపని చేశారని అదే సమయంలో వారికి ఇక్కడ సారా అలవాటు కావడంతో సోమవారం సారా కోసం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
వీరిని మహబూబ్‌నగర్ మండలంలోని ఎదిర గ్రామస్తులుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. గ్రామాలకు కొత్తగా అనుమానించే రీతిలో ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అకారణంగా వారిపై దాడులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోరాదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment