పశ్చిమగోదావరి: పాతకక్షలతో సర్పంచ్ పై దాడి చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. కోనాల గ్రామసర్పంచ్ బూరుగుపల్లి ఆనంద రమేష్ ఇటీవలి కాలంలో పొలం తగాదాకు సంబంధించి ఒక వివాదాన్ని సద్దుమనచడానికి ప్రయత్నించారు.
ఈ విషయంపై సర్పంచ్‌తో చర్చించేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సర్పంచ్‌పై దాడి: ఆస్పత్రికి తరలింపు
Published Wed, Jul 1 2015 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement
Advertisement