దొంగతనమే ప్రాణాలు తీసింది | Thief killed by villagers attack | Sakshi
Sakshi News home page

దొంగతనమే ప్రాణాలు తీసింది

Published Thu, Jul 10 2014 8:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

దొంగతనమే ప్రాణాలు తీసింది

దొంగతనమే ప్రాణాలు తీసింది

దొంగతనానికి వచ్చిన వ్యక్తిని గ్రామస్తులు చితకబాదడంతో మృతి చెందిన సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలం అన్నవరంలో గురువారం తెల్లవారుజామునా చోటు చేసుకుంది. గత అర్థరాత్రి ఐదుగురు దొంగలు అన్నవరంలోని ఇళ్లలో చోరీకి యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమైయ్యారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని... కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు.

 

దాంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు దొంగలు పరారైయ్యారు. ఆ ఘటనపై అన్నవరం  గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement