nuzvid
-
400 మంది టీడీపీ కార్యకర్తలు రాజీనామా
-
తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన ‘అక్రమ మైనింగ్’ పంచాయతీ
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడులో తెలుగు తమ్ముళ్ల అక్రమ మైనింగ్ పంచాయతీ రచ్చకెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చాక తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతుండగా.. చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా ఫిర్యాదు చేశారు. దీంతో ముద్దరబోయిన తీరుపై నూజివీడు మండలం రావిచర్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ముద్దరబోయిన కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నారు. రావిచర్లలో అక్రమ మైనింగ్ జరిగితే ఏ చర్యలైనా తీసుకోండని అధిష్టానాన్ని కోరుతున్నాం. సొంత పార్టీలోని నేతలపైనే బురద చల్లడం బాధాకరం. అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ముద్దరబోయిన చర్యలున్నాయి. తక్షణం ముద్దరబోయినను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
అనారోగ్యం బారిన పడిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
మోసకారి బాబూ మీకో దండం
సాక్షి ప్రతినిధి ఏలూరు/నూజివీడు: తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ నూజివీడు నియోజక వర్గ ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. నూజి వీడులోని తన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోతో కూడిన ఫ్లెక్సీని మంగళవారం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా తొలగించారు. అనంతరం ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో పదేళ్ల పాటు పనిచేసి టీడీపీని పటిష్టంగా తయారు చేస్తే ఇప్పుడు చంద్రబాబుకు తాను పనికిరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఎవరూ లేకపోవడంతో తాను అడగకుండానే యనమల రామకృష్ణుడితో కబురు చేసి నూజివీడు టికెట్ ఇచ్చారని, ఇప్పుడు టికెట్ నిరాకరించడంపై కారణమేమిటో అడుగుతుంటే చంద్రబాబు వద్ద సమాధానమే లేదని చెప్పారు. తనను పదేళ్ల పాటు వాడుకొని బలిపశువును చేశారని ధ్వజమెత్తారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా ఆఖరి కోరిక ఏమిటని జడ్జి అడుగుతారని, టీడీపీలో మాత్రం అలాంటి నైతిక విలువలు ఏమీ లేవని దుయ్యబట్టారు. ‘చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె¯న్నాయుడికి, యనమల రామకృష్ణుడికి నమస్కారం, టీడీపీకి నమస్కారం’ అంటూ చేతులెత్తి దండం పెట్టారు. తన అభిమానులు, సానుభూతిపరులు, కలిసివచ్చే కార్యకర్తలు, నాయకులతో చర్చించి వారి నిర్ణయం మేరకు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. నమ్మించి.. మోసం చేశారు: తనను పదేళ్లపాటు వాడుకొని అన్యాయంగా బయటకు గెంటివేసిన వారి అంతు చూస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడతానని తెలిపారు. పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి టీడీపీకి వచ్చిందని, తనకు అన్యాయం చేసిన ఆ పార్టీ సంగతి చూస్తానని హెచ్చరించారు. -
నూజివీడు: భారీ భూ పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం(ఫొటోలు)
-
చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు
-
ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాటలకి సీఎం జగన్ ఫిదా
-
సీఎం జగన్ కు ఘన స్వాగతం..నూజివీడులో జననీరాజనం..
-
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని తెలిపారు. ‘మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. దళిత వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాం. సామాజిక న్యాయాన్ని ఒక విధానంగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ -
నూజివీడులో సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్ విజువల్స్
-
చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Live Updates.. ►నూజివీడులో అర్హులకు పట్టాలు ప్రదానం చేసిన సీఎం జగన్. సీఎం జగన్ మాట్లాడుతూ.. ►ప్రజలకు మంచి చేసి చంద్రబాబు సీఎం కాలేదు. చంద్రబాబుకు మంచి చేద్దామనే ఆలోచనే లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే. బాబు హయాంలో అందరినీ మోసం చేశాడు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అబద్దాలతో వస్తారు.. ప్రతీఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ►తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తుకు తెచ్చుకోండి. ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారు. ఆయన అన్న మాటలను గుర్తుకుతెచ్చుకోండి. ►ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్లోని నాయకుడు చంద్రబాబు. కోడలు మగ పిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నది చంద్రబాబే. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతీ ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు మోసపోకండి. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ తోడేళ్లు అందరూ ఏకమవుతారు. ప్రజల దీవెనలు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోను. ►రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నాం. కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నాం. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. ►మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం. అసైన్డ్ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం. ►ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం. లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. దళిత వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్మశాసవాటికలకు స్థలాలు కేటాయించాం. ►నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. నేడు చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు. 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా గెలుస్తుంది. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడు.. ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి. లోకేశ్ ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభిస్తానంటే సీఎం జగన్‌కు చెప్పి అనుమతులు ఇప్పిస్తాను. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘతన సీఎం జగన్‌దే. దివంగత వైఎస్సార్ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదు. నూజివీడుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రెండు సీట్లు కూడా రావు. ►నూజివీడు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ►నూజివీడు బయలుదేరిన సీఎం జగన్ ►కాసేపట్లో అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం ►భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. సీఎం పర్యటన ఇలా.. ► ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ► 11.10 నుంచి 12.25 గంటల వరకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసి సభలో ప్రసంగిస్తారు. ► 12.50 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని స్థానిక నాయకులు, ప్రజలను కలుసుకుంటారు. అనంతరం 1.55 గంటలకు తాడేపల్లి పయనం కానున్నారు. గోడు విన్నారు.. పోడు భూములిచ్చారు సాక్షి, అమరావతి: గిరిజనుల గోడును ఆలకించి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం(ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్) ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజనులకు పోడు భూముల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా నిలిపారు. 2008 నుంచి 2019 వరకు గత ప్రభుత్వాలు 95,649 గిరిజన కుటుంబాలకు 2,33,410 ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చాయి. వీటిల్లో గత పదకొండేళ్లలో ఇచ్చిన మొత్తం పట్టాల్లో అత్యదికంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంపిణీ చేసినవే కావడం గమనార్హం. వాస్తవానికి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్సారే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా మొత్తం 1,30,368 కుటుంబాలకు 2,87,710 ఎకరాలకు పట్టాలిచ్చి పేదలకు మేలు చేయడంలో తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని నిరూపించుకున్నారు. వీటిలో 1,29,842 మందికి 2,19,763 ఎకరాలు, 526 సామూహిక(కమ్యూనిటీ) టైటిల్స్ ద్వారా 67,947 ఎకరాల పోడు భూములకు పట్టాలుగా పంపిణీ చేయడం విశేషం. డీకేటీ పట్టాల పంపిణీ.. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్ ఫారెస్ట్ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేయడం గమనార్హం. -
చినబాబు మూడు ముక్కలాట.. ‘గో ఎహెడ్.. నీకే టిక్కెట్..’
ఏలూరు తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది. గతం నుంచీ ఉన్న ఇన్‌చార్జ్‌ను కాదని మరో ఇద్దరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చినబాబు అడిగినవారందరికీ సీటు గ్యారెంటీ హామీ ఇస్తున్నారట. అసలే ప్రజల్లోకి వెళ్ళడానికి ధైర్యం లేక పసుపు కేడర్ బిక్కచచ్చిపోయింది. మరోవైపు నేనే అభ్యర్థినంటూ ముగ్గురు రంగంలోకి రావడంతో కేడర్ అయోమయానికి గురవుతోందట. నూజివీడు మూడు ముక్కలాట మీరూ చదవండి. ముద్దరబోయిన వర్సెస్ కమ్మ ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పెద్ద కష్టమే వచ్చిందట. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగు తమ్ముళ్లలో కన్ఫ్యూజన్ మొదలైందని టాక్ నడుస్తోంది. అందుకు కారణం నియోజకవర్గంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే అంటున్నారు. గట్టి పట్టున్న స్థానిక నేతలు లేకపోవడంతో.. గన్నవరం నుంచి వలస వచ్చిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లోనూ నూజివీడు నుంచి పోటీ చేశారు. ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం నూజివీడు టీడీపీకి ఆయనే ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడు ముద్దరబోయిన వర్సెస్ కమ్మ సామాజిక వర్గ టీడీపీ నేతలు అనేలా ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయట. కొంతకాలంగా ముద్దరబోయిన వర్సెస్ మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కాపా శ్రీనివాసరావు అనేలా ఇక్కడి స్థానిక రాజకీయాలు సాగాయంటున్నారు. ఫలితంగా నూజివీడులో ముద్దరబోయిన వర్గం ఒకవైపు కమ్మసామాజిక వర్గం మరో వైపు అనేలా పరిస్థితులు మారిపోయాయని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వ్యాపారం నుంచి రాజకీయం ఇదిలా ఉంటే.. ముద్దరబోయిన వర్సెస్ కాపా శ్రీనిసవారావు వర్గాలతోనే కేడర్ అయోమయంలో పడితే..తాజాగా మరో నేత ఎంట్రీ ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బిజినెస్ మ్యాన్ నూజివీడు టీడీపీ పాలిటిక్స్ లోకి ఎంటరయ్యాడట. నియోజకవర్గానికే చెందిన పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో గంగాధరరావు చినబాబుతో టచ్ లోకి వెళ్లాడట. నేనూ లోకలే..నాకూ టిక్కెట్ కావాలంటూ నూజివీడులో పర్యటిస్తున్నారట. ఫంక్షన్లు, ప్రారంభోత్సవాలు అంటూ గ్రామాల్లో తిరుగుతూ..తెలిసినవారికి, కావాల్సినవారికి ఆర్ధిక సహాయం అందిస్తూ ముద్దరబోయినను వ్యతిరేకించిన వారితో పాటు కమ్మ సామాజిక వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడట. చినబాబు టికెట్ల హామీలు నూజివీడులోని ఈ ముగ్గురి పంచాయతీ ఇటీవల పార్టీ యజమానులు చంద్రబాబు, చినబాబు వద్దకు చేరిందట. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడతో అటు చంద్రబాబు, ఇటు చినబాబు తమ వద్దకు వచ్చిన వారికి గో ఎహెడ్.. నీకే టిక్కెట్ అంటూ హామీ ఇచ్చి పంపించేశారట. దీంతో ఈ ముగ్గురూ ఈసారి నేనే క్యాండెట్.. నాకే సీటు అంటూ కేడర్ దగ్గర ప్రచారం చేసుకుంటున్నారట. పరిణామాలన్నీ గమనిస్తున్న క్యాడర్ కు ఈ ముగ్గురిలో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియడం లేదని టాక్. బీసీ సామాజికవర్గానికి చెందిన ముద్దరబోయినకు మద్దతివ్వాలా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాపా శ్రీనివాసరావు లేదా..బిజినెస్ మ్యాన్ పర్వతనేని గంగాధరరావు పంచన చేరాలో తేల్చుకోలేకపోతున్నారట. చదవండి: గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ముగ్గురు టిక్కెట్ అడుగుతున్నపుడు పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గన్నవరం నుంచి వలస వచ్చినా గతం నుంచి పార్టీని నమ్ముకుని ప్రస్తుతం ఇంచార్జ్‌గా ఉన్న.. బీసీ వర్గం నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పక్కన పెట్టేందుకు... కమ్మ వర్గం నేతలను ప్రోత్సహిస్తున్నారని చర్చ నూజివీడులో జరుగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
నూజివీడులో పొలిటికల్ హీట్..
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలోని నూజివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ నేత ముద్రబోయిన సవాల్‌ను ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు స్వీకరించారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. సవాల్ ప్రకారం.. ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు నూజివీడుకు వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నూజివీడు అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తెలిపారు. టీడీపీ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని మండిపడ్డారు. నూజివీడు నియోజకవర్గానికి టీడీపీ చేసిందేమీలేదని అన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని ముద్రబోయిన మమ్మల్ని విమర్శిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని మండిపడ్డారు. -
కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్రిక్తత
-
లబోదిబోమంటున్న డిపాజిటర్లు....
-
బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్ సొసైటీ’
సాక్షి, అమరావతి: ‘అమరావతి కేపిటల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ బోర్డు తిప్పేసింది. అవసరానికి అక్కరకొస్తుందనే ఆశతో పైసా పైసా కూడబెట్టి ఈ సొసైటీలో డబ్బు దాచుకున్న డిపాజిటర్లను ఆ సంస్థ నిలువునా ముంచేసింది. రెండు రోజులుగా నూజివీడులోని సొసైటీ కార్యాలయం తెరవకపోగా, డిపాజిట్ దారుల నుంచి డబ్బు వసూలు చేసిన ఏజెంట్లు ఎవరూ రావట్లేదు. దీంతో ఆందోళనకు గురైన డిపాజిట్‌దారులు శుక్రవారం సొసైటీ వద్దకెళ్లారు. అక్కడెవరూ లేకపోవడంతో సొసైటీ కార్యాలయానికి తాళాలేశారు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు మొరపెట్టుకోవడంతో సొసైటీ దగా వ్యవహారం వెలుగుచూసింది. 2018 నుంచి వసూళ్లు.. విజయవాడ కేంద్రంగా 2018లో ఏర్పాటైన అమరావతి కేపిటల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కృష్ణా జిల్లాలోని నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటల్లో బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు, నెలవారీ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు సేకరించింది. ఆ మొత్తాలను గోల్డ్‌లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ పేరుతో వడ్డీలకిచ్చింది. మరోవైపు నూజివీడులో చిరు వ్యాపారుల నుంచి ఏజెంట్లు డైలీ కలెక్షన్లు వసూలు చేసినట్టు సమాచారం. ఓ చిరు వ్యాపారి నెలకు రూ.3వేలు చొప్పున 12 నెలలకు రూ.36 వేలు కట్టే స్కీములో చేరితే అతను 6 నెలలు కట్టిన రూ.18 వేలతోపాటు మరో రూ.18వేల సొమ్మును కలిపి మొత్తం రూ.36 వేలు లోనుగా ఇస్తామని ఏజెంట్లు నమ్మబలికారు. దీంతో నూజివీడు, విస్సన్నపేట, హనుమాన్ జంక్షన్, తిరువూరు ప్రాంతాల్లో సుమారు 500 మందికిపైగా డిపాజిట్‌దారులు అమరావతి సొసైటీలో సొమ్ము జమ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నూజివీడు, తిరుపూరు ప్రాంతాల్లోనే రూ.50 లక్షల వరకు డిపాజిట్లు సేకరించినట్టు సమాచారం. అయితే గడిచిన కొద్దిరోజులుగా గడువు ముగిసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో యాజమాన్యం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. డిపాజిట్లు సేకరించిన ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఒక్క నూజివీడులోనే 35 మంది ఖాతాదారులకు గడువు ముగిసిన డిపాజిట్లకు సంబంధించి రూ.20 లక్షల వరకు సొమ్ము తిరిగి చెల్లించాల్సి ఉందంటున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును కోరారు. ఈ నేపథ్యంలో డిపాజిట్‌దారులైన భవానీశంకర్, రాజేశ్వరి, వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మిల తదితరుల నుంచి నూజివీడు పట్టణ ఎస్ఐ గణేష్‌కుమార్ వివరాలు సేకరించారు. విచారణకు ఆదేశించా: కృష్ణా జిల్లా ఎస్పీ దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారించి కేసు నమోదు చేయాలని నూజివీడు, తిరువూరు పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. నూజివీడుకు చెందిన వి.దుర్గాలక్ష్మీభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి కేపిటల్ బ్యాంకుపై ఛీటింగ్ కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ బి.శ్రీనివాస్ చెప్పారు. -
ప్రమాదం ఒకరిది.. ప్రాణాలు ఇతరులవి..
నూజివీడు: రెక్కాడితేగానీ డొక్కాడని ఇద్దరు నిరుపేద వ్యక్తులను కంటైనర్ లారీ రూపంలో పొంచి ఉన్న మృత్యువు కబళించివేసింది. కుటుంబాన్ని పోషించే వారు విగతజీవులవ్వడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘటన నూజివీడు మండలం పోలసానపల్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి నుంచి ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు వైపు వెళ్తున్న కంటైనర్‌కు పోలసానపల్లి సమీపంలోకి వచ్చే సరికి 11కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకి..ప్రాణాలు దక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో నూజివీడు మండలంలోని మీర్జాపురంలో చిన్న ఫ్యాన్సీ షాపు నడుపుకునే పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడుకు చెందిన పెనుమాక జోజిబాబు(36), మీర్జాపురం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్(65) ద్విచక్రవాహనంపై కోడిగుడ్ల కోసం వట్టిగుడిపాడు వైపు వెళ్తున్నారు. పోలసానపల్లి వద్దకు వచ్చే సరికి రోడ్డుపై అడ్డంగా కంటైనర్ ఉండడంతో.. ఇదేమిటని వారు కొద్దిగా ముందుకెళ్లి ఆ కంటైనర్‌ను ముట్టుకోగా.. తీవ్ర విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. అంతలోనే ద్విచక్రవాహనం పెట్రోలు ట్యాంక్ వద్ద నుంచి మంటలు చెలరేగి వారిద్దరూ ఘటనాస్థలంలోనే సజీవ దహనమయ్యారు. జోజిబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. తహసీల్దార్ మెండు సురేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును తెలుసుకున్నారు. రూరల్ ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పరామర్శించారు. -
నూజివీడులో ఆకస్మిక తనిఖీలు..
సాక్షి, కృష్ణా జిల్లా: నూజివీడు మెడికల్ షాపుల్లో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మందు బాబులు ఈ మధ్య కాలంలో శానిటైజర్లు సేవించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. శానిటైజర్లు అధికంగా కొనుగోలు చేసే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శానిటైజర్ల అమ్మకానికి ప్రత్యేక రికార్డు మెయింటెన్ చేయాలని షాపుల యజమానులకు పోలీసులు సూచించారు. ప్రకాశం: జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మార్కాపురం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉదయం పొదిలి మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేని శానిటైజర్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నూజివీడులో 7న మ్యాంగో మీట్
సాక్షి, అమరావతి బ్యూరో: మామిడి రైతులకు మంచి ధర లభించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాంగో మీట్‌ను నిర్వహించనుంది. ఈనెల 7న రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు కృష్ణాజిల్లా నూజివీడులోని వేపర్ హీట్ ట్రీట్మెంట్ సెంటర్ వేదిక కానుంది. విదేశాలకు మామిడిని ఎగుమతి చేసే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మంది ప్రముఖ ఎగుమతిదారులు, ఎగుమతికి వీలుగా ఉండే నాణ్యమైన మామిడిని పండించే రాష్ట్రంలోని సుమారు వంద మంది రైతులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సదస్సు రోజు రైతులు తమతమ మామిడి శాంపిళ్లను ప్రదర్శిస్తారు. ఎగుమతికి అనువైన రకాలను ఎగుమతిదారులు ఎంచుకుని అక్కడికక్కడే రైతులతో కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటారు. ఈ మ్యాంగో మీట్ ద్వారా రైతులకు మంచి ధర లభిస్తుందని.. ఫలితంగా రైతుల్లో మామిడి సాగుపై ఆసక్తి పెరుగుతుందని ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఫ్రూట్స్) పీవీ రమణ ‘సాక్షి’కి చెప్పారు. రైతులకు మేలు చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ మీట్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. ఎగుమతిదారులు చుట్టుపక్కల మామిడి తోటలను కూడా సందర్శిస్తారు. బంగినపల్లిదే అగ్రస్థానం.. రాష్ట్రంలో విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో 3.82 లక్షల హెక్టార్లలో దిగుబడినిచ్చే మామిడి తోటలున్నాయి. వీటి నుంచి సగటున 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. అత్యధికంగా బంగినపల్లి రకం 1,70,048 హెక్టార్లలో సాగవుతోంది. వీటి దిగుబడి 21,25,600 టన్నులు ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో తోతాపురి (కలెక్టర్) 1.02 లక్షల హెక్టార్లలో సాగవుతూ 12,24,350 టన్నుల దిగుబడినిస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసం, సువర్ణరేఖ వంటివి ఉన్నాయి. విదేశాలకు ఎగుమతయ్యే రకాలు.. మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా బంగినపల్లి, చిన్న రసాలు, చెరుకు రసాలు, సువర్ణరేఖ రకాలు ఎగుమతి అవుతాయి. జర్మనీ, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా, రష్యా, మధ్య ఈశాన్య దేశాలకు ఏటా సగటున 1,200 మెట్రిక్ టన్నుల మామిడిని ఎగుమతి చేస్తుంటారు. -
అసలు నీ ఊరెక్కడా.. ఏం మాట్లాడుతున్నావ్..!
సాక్షి, విజయవాడ : టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై వైఎస్సార్సీపీ నేత, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, మాటల్ని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా నూజివీడుకి ఏం చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసు. అధికార పార్టీ ఇన్చార్జిగా నువ్ ఏం చేశావో కూడా ప్రజలకు తెలుసు. అసలు నీ స్వగ్రామం ఎక్కడ..? ఎక్కడ నుంచి వచ్చావో తెలియని నువ్వు నాపై విమర్శలు చేస్తావా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా. రాజకీయాల్లో ఉంటూ ముందు గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. నూజివీడు ప్రజలు నిన్ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’ అని వెంకట ప్రతాప్ హెచ్చరించారు. కాగా, నూజివీడులో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే మద్దరబోయిన పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. -
‘నూజివీడు సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, నూజివీడు: పట్టణంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేశ్ ఆరోపించారు. శనివారం పురపాలక సంఘం చేపట్టిన సిమెంట్ రోడ్డు ప్రారంభోవత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావ్‌కు టీడీపీ నేతలు అడ్డుతగిలి, వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నూజివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ప్రజా ప్రతినిధికి రక్షణ కల్పించకపోగా.. ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ సీపీ తరఫున డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నూజివీడు సీఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. 18వ వార్డులో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది ఆందోళన కారులను అడ్డుకోలేక.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లిన తనను పర్మిషన్ పేరుతో పోలీసులు గంటకు పైగా రోడ్డుపై నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా నూజివీడు సీఐ పథకం ప్రకారమే చేశారని మండిపడ్డారు. భవిష్యత్‌లో తనకేదయినా ప్రాణహాని జరిగితే ఇప్పుడున్న సీఐ బాధ్యత వహించాలన్నారు. ఉన్నతాధికారులు నూజివీడు సీఐ, ఎస్ఐలను బదిలీ చెయ్యాలని కోరారు. చదవండి: నూజివీడులో ‘టీడీపీ’ హైడ్రామా -
కూతుర్ని ప్రేమించాడని..
కృష్ణలంక(విజయవాడ తూర్పు): తన కూతురును ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడితోపాటు అతని స్నేహితుడిని అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి యత్నించి పోలీసులకు చిక్కిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కిడ్నాప్ ఘటన ఈ నెల 16న జరగ్గా పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను 17న అరెస్టు చేశారు. కోరువాడ శ్రీనివాసరావు జెంట్స్ బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ విజయవాడ చుట్టుగుంటలో నివాసముంటున్నాడు. కొడుకు నాగసాయి నూజివీడులోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ప్రసాదంపాడుకు చెందిన వడ్ల శ్రీనివాసరావు కుమార్తె, నాగసాయి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తండ్రి తన కూతురును, నాగసాయిని మందలించాడు. నాగసాయి తండ్రికి ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని అదుపులో పెట్టుకో.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని’ హెచ్చరించాడు. నాగసాయిని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన యువతి ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నాగసాయి అమ్మాయికి ఫోన్ చేయగా.. తాను అమ్మవారి గుడివద్ద ఉన్నానని తెలియజేయడంతో నాగసాయి, అతని స్నేహితుడు మణిదీప్, తండ్రి కలసి అక్కడకు వెళ్లి అమ్మాయిని తీసుకుని ఆమె తండ్రికి ఫోన్‌చేసి సమాచారమిచ్చారు. ఇదంతా చేసింది నాగసాయేనంటూ దుర్భాషలాడుతూ అమ్మాయి తండ్రితోపాటు మరికొంతమంది యువకులు అతడిని ఇష్టానుసారంగా కొట్టారు. అంతటితో ఆగకుండా నాగసాయితోపాటు అతని స్నేహితుడిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అబ్బాయి తండ్రి కోరివాడ శ్రీనివాసరావు తన కొడుకును కొంతమంది కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారధి వద్ద కారును గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు దాన్ని అడ్డగించి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నాగసాయి, అతని స్నేహితుడిని కిడ్నాప్ చేశారని అమ్మాయి తండ్రి శ్రీనివాసరావు, తల్లి చంద్ర, సుబ్రమణ్యం, వేణు, శివ, జగదీష్, రూపేష్సాయి, సాయివివేక్, ధీరజ్‌లను అరెస్టు చేశారు. -
దొంగ పోలీసు అరెస్ట్
నూజివీడు : పోలీస్ ఎస్ఐ డ్రెస్ కుట్టించుకుని దాన్ని ధరించి ఎస్ఐని అని చెప్పుకుంటూ తిరగడమే కాకుండా, బండిపై వెనుక, ముందు భాగంలో ‘పోలీస్’ అని రాసుకుని తిరుగుతున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు సీఐ మేదర రామ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కొత్తపేట ముస్లిం బజారుకు చెందిన షేక్ సలీంమాలిక్ (26) డిగ్రీ చదువుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో పోలీసు డ్రెస్ కుట్టించుకుని దాన్ని ధరించి వీధులలో తిరుగుతుండటమే కాకుండా తనకు ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు. ఈ నేపథ్యంలో స్థానిక ట్రిపుల్ ఐటీ వద్ద మధ్యాహ్న సమయంలో పట్టణ ఎస్ఐ రంజిత్‌కుమార్ వాహనాలను చెక్ చేస్తుండగా అనుమానం వచ్చి ఆపి ఎక్కడ ఎస్ఐగా పని చేస్తున్నారని ప్రశ్నించారు. సలీంమాలిక్ తడబడుతూ సమాధానం సరిగా చెప్పలేదు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ పోలీస్ అని తేలింది. దీంతో ఎస్ఐ ఉద్యోగాన్ని దుర్వినియోగం చేస్తుండటంపై అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పట్టణ, రూరల్ ఎస్ఐలు రంజిత్‌కుమార్, చిరంజీవి పాల్గొన్నారు. -
క్షుద్ర పూజలు అబద్ధం
నూజివీడు : మండలంలోని సుంకొల్లు పరిధిలోని తోటలలో క్షుద్ర పూజలు నిర్వహించడంతో పాటు నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారంటూ ముసునూరుకు చెందిన చిన్నం ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణల నేపథ్యంలో శనివారం పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించారు. సీఐ మేదర రామ్‌కుమార్, పట్టణ, రూరల్ ఎస్ఐ చెదరబోయిన రంజిత్‌కుమార్, మేడిబోయిన చిరంజీవిలతో పాటు తహసీల్దారు గుడిశే విక్టర్‌బాబు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోరిగే రాంప్రసాద్‌ను అతని తోటలోకి తీసుకెళ్లి అక్కడి ప్రాంతాలను పరిశీలించడంతో పాటు తోటలో కాపలా ఉంటున్న వృద్ధ దంపతులను జరిగిన విషయమై విచారించారు. ఆరోపణల్లో నిజం లేదు.. అనంతరం పట్టణంలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ రామ్‌కుమార్, తహసీల్దారు విక్టర్‌బాబు మాట్లాడారు. క్షుద్ర పూజలు, నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారని వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తమన్నారు. అమ్మవారి గుడి నిర్మించడానికి గాను గురు పౌర్ణమి రోజున జొరిగే రాంప్రసాద్ ఏడుగురు వ్యక్తులను, చిన్నం ప్రవీణ్‌ను తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెళ్తూ దారిలోనే ఉన్న గంగానమ్మ గుడి వద్ద పూజలు చేశారని చెప్పారు. గ్రామస్తులు ఎవరైనా పొలాల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ పూజలు చేయడం, మొక్కుకోవడం, ముడుపులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అనంతరం తోటలోకి వెళ్లిన తర్వాత ప్రవీణ్ వృద్ధుల పాక వద్దకు వెళ్లి డబ్బా తీసుకుని బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదన్నారు. అతను బహిర్భూమికి వెళ్లేటప్పుడు అతని వెంట ఎవరూ పడలేదని, మిగిలిన వ్యక్తుల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవని దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని, ఎక్కడైనా జరుగుతున్నట్లుగా చూసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనే లేదన్నారు. అయితే ప్రవీణ్‌కుమార్ నరబలి ఇవ్వడం కోసం క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఎందుకు చెప్తున్నాడో, దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా తదితర విషయాలపై దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. వారితో నాకు ప్రాణభయం ఉంది క్షుద్ర పూజల ఆరోపణలతో తప్పించుకున్న యువకుడి మొర ముసునూరు (నూజివీడు) : చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే శుభాలు కలుగుతాయనే మూఢ నమ్మకంతో అమాయకుడైన యువకుడిని బలి చేయడానికి యత్నించారనే విషయంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు మండలం యనమదల పరిసర అడవుల్లోకి జొరిగే రాంప్రసాద్, పామర్తి సాయి అనేవారు శుక్రవారం తనను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేసి, కత్తులతో తనపై దాడికి యత్నించారని ముసునూరుకు చెందిన చిన్నం ప్రవీణ్ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు శనివారం సాయంత్రం స్థానిక దళితవాడకు చెందిన పెద్దలు, యువకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తన యజమాని రాంప్రసాద్ పిలవడంతో వెళ్లానని, కానీ యనమదల అడవుల్లోకి వెళ్లాక అక్కడ మరికొందరు క్షుద్ర పూజారులు ఉండడంతో భయంతో వారి బారి నుంచి తప్పించుకుని నూజివీడు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు తేలికగా కొట్టిపారవేస్తూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడంతో ఆ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని, మీరే న్యాయం జరిగేలా చూడాలంటూ విలేకర్లను బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. తమకు సరైన న్యాయం జరగక పోతే విషయాన్ని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడతామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పెళ్లైన ఆరు నెలలకే..
నూజివీడు : కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి పెళ్లైన ఆరు నెలలకే విగతజీవిగా మారిన ఘటన పట్టణంలోని బాపూనగర్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఖుష్బూ (19), బాపూనగర్‌కు చెందిన రేపాని రాజు ప్రేమించుకుని గతేడాది డిసెంబరు నెలాఖరులో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఖుష్బూ భర్త ఇంటి వద్దనే ఉంటోంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వద్దన్నా వినకుండా తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందనే బాధతో కుష్బూ తల్లిదండ్రులు నూజివీడు నుంచి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే శనివారం మధ్యాహ్నం వరకు భార్యాభర్తలు ఇరువురూ పనికి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భర్త సెంటర్‌కు రాగా, భార్య రెండు మూడు సార్లు ఫోన్ చేసింది. దీంతో 3 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లగా ఖుష్బూ చీరతో ఉరి వేసుకుని ఉండటంతో వెంటనే రాజు ఇరుగుపొరుగు వారిని పిలిచి కిందకు దించి ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. ఘటనపై పట్టణ ఎస్ఐ రంజిత్‌కుమార్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్టును బట్టి తర్వాత సెక్షన్లు మారుస్తామని ఎస్ఐ తెలిపారు. -
మూగ జీవాలకూ తీపి మాత్రలు!
పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు అనారోగ్యానికి గురైనప్పుడు ఖరీదైన ఇంగ్లిష్ మందులుæ వాడటం తప్ప రైతులకు మరో మార్గం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇంగ్లిష్ మందులతో ఇతర సమస్యలు రావడంతోపాటు ఈ వైద్యం సన్న, చిన్నకారు రైతులకు శక్తికి మించిన భారంగా మారుతోంది. ఈ నేపధ్యంలో పశువులకు హోమియో వైద్యం ద్వారా అతి తక్కువ ఖర్చుతో సత్ఫలితాలను పొందవచ్చంటున్నారు డాక్టర్ దంటు సత్యన్నారాయణ. హోమియో మందులతో పశువుల్లో వచ్చే ఎలాంటి వ్యాధినైనా వేగంగా, పూర్తిగా తగ్గిస్తున్నారు. పశుపోషణపై ఆధారపడిన రైతులకు ఇది వరమని నిరూపిస్తున్నారు. డా. సత్యన్నారాయణ అందిస్తున్న హోమియో వైద్యంతో కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో పలువురు పాడి రైతులు, పశుపోషకులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఖమ్మంకు చెందిన డా. దంటు సత్యన్నారాయణ పశుసంవర్థకశాఖలో వైద్యునిగా పనిచేసి 2003లో రిటైరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈయన అల్లోపతి మందుల కంటే హోమియో మందులు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని గమనించి.. రిటైరవ్వకు ముందు నుంచే పశువులకు హోమియో వైద్యం చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కొన్న ధరకే 50 రకాల హోమియో మందుల కిట్‌ను రైతులకు అందజేస్తున్నారు. పశువులకు హోమియో వైద్యం వల్ల లాభాలు ఖర్చు తక్కువ, ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు, మందులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్ అవసరం లేదు. పశువులకు సారా, బీడీ, చుట్ట, మసాలా వంటి ఎలాంటి అలవాట్లు ఉండవు కాబట్టి పశువులలో ఈ మందులు బాగా పనిచేస్తాయి. డాక్టర్ కోసం ఎదురుచూడకుండా రైతే ఈ మందులను పశువులకు వేయవచ్చు. జబ్బులు రాక ముందుగానే ఈ మందులను అతితక్కువ ఖర్చుతో వేసుకోవచ్చు. తెల్ల మాత్రల్లో ద్రవరూప మందును ఒకసారి కలిపితే చాలాకాలం పాటు వాడుకోవచ్చు. ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడనందున పశువులు త్వరగా కోలుకుంటాయని డా. సత్యన్నారాయణ తెలిపారు. ఏయే పశు వ్యాధులకు హోమియో చికిత్స పశువులు మేత మేయకపోవడం, జ్వరం, కడుపు ఉబ్బరం, ఎదకు రాకపోవడం, పొదుగు వాపు, చూడి కట్టకపోవడం, మాయ వేయకపోవడం, గర్భకోశ వ్యాధులు, పాలు చేపకపోవడం, పాలు పితకకుండానే కారిపోవడం, పాలు తగ్గడం, గాయాలు, దెబ్బలు, గాంగ్రిన్, గాలికుంటు పుండ్లు, పాముకాటు, దూడలలో బొడ్డు వాపు, రక్త విరోచనాలు, తెల్ల విరేచనాలు, ఏలికపాములు, మలబద్దకం వంటి సమస్యలన్నిటికీ హోమియో మందులు వాడొచ్చు. కోళ్లు, గొర్రెలు, కుక్కలకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం ఉందని డా. సత్యన్నారాయణ తెలిపారు. గొర్రెలలో నీలి నాలుక వ్యాధిని కూడా హోమియో మందులతో తగ్గిస్తుండటం విశేషం. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు ఆవుల ఆరోగ్య సమస్యలు తగ్గాయి మాకు దేశవాళీ ఆవులు 13, ఆవు దూడలు 8 ఉన్నాయి. వీటికి అల్లోపతి వైద్యం చేయించి విసుగు పుట్టింది. వైద్యులు, సిబ్బంది మనకు కావల్సినప్పుడు అందుబాటులో ఉండరు. అటువంటి పరిస్థితుల్లో డా.దంటు సత్యన్నారాయణ గారి గురించి విని ఆవులకు హోమియో చికిత్స చేయిస్తున్నాను. హోమియో వైద్యం మొదలుపెట్టిన తరువాత ఆవుల్లో ఆరోగ్య సమస్యలు చాలా వరకూ తగ్గాయి. ఆవులలో అనారోగ్య లక్షణాలను కనిపెట్టి.. ఆ వెంటనే హోమియో మందులను మేమే ఎలా వాడుకోవాలో డా. సత్యన్నారాయణ నేర్పించారు. వీటితో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏ లక్షణాలకు ఏ మందులు వాడాలనే కరపత్రం కూడా ఉంది. దానిలో పేర్కొన్న విధంగా వాడితే పశువులకు నయమవుతోంది. మరీ అర్థంకాని పరిస్థితి ఉంటే.. డా. సత్యన్నారాయణకు ఫోన్ చేసి లక్షణాలు చెబితే ఏ మందు వాడాలో చెప్తారు. చెప్పిన మందు వాడితే తగ్గిపోతున్నది. దూడలకు విరేచనాలు, చర్మ సంబంధిత సమస్యలు, పొదుగువాపు, జ్వరం తదితర సమస్యలు వచ్చినప్పుడు హోమియో మందులు వాడి సత్ఫలితాలు పొందాము. అల్లోపతి కంటే హోమియోతో ఖర్చు చాలా తక్కువ. – మేకా అమృత (94402 40393), పశుపోషకురాలు, నూజివీడు, కృష్ణా జిల్లా గోపాల మిత్రల ద్వారా వ్యాప్తిలోకి తేవాలి! నా దగ్గర ఏడు దేశవాళీ ఆవులున్నాయి. వీటికి ఏడాది నుంచి హోమియో మందులే వాడుతున్నాను. మంచి ఫలితాలు వస్తున్నాయి. జ్వరాలు, విరోచనాలు, పొదుగు వాపు వ్యాధి, కాల్షియం లోపం, జ్వరం, చర్మ సంబంధిత వ్యాధులు, ఇతర జబ్బులకు హోమియో వైద్యం అందిస్తున్నాం. ఖర్చు బాగా తక్కువ. ఉపయోగించడం సులువు. ప్రభుత్వం గోపాల మిత్రలకు ఈ మందుల వాడకంలో శిక్షణ ఇప్పించడం ద్వారా హోమియో పశువైద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. యాంటీబయోటిక్ మందు మార్కెట్లో రూ.100లు ఉండగా, హోమియో మందు రూ.5లకే లభ్యమవుతుంది. – డా.రేమెళ్ల సత్యన్నారాయణ (9440996727) విశ్రాంత వైద్యులు, పశుపోషకులు, నూజివీడు పశువుల్లో పొదుగువాపు వ్యాధికి రూ.200తో చికిత్స! అల్లోపతి మందులు వాడినప్పటికంటే హోమియో వైద్యంలో వేగంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఖర్చు కూడా చాలా తక్కువ. మందులు బాగా పనిచేస్తున్నాయి. పశువైద్యం అంటే అల్లోపతి వైద్యం మాత్రమే కాదు. హోమియోపతి వైద్యం కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా. 1995 నుంచి పశువులకు హోమియో వైద్యాన్ని అందిస్తున్నా. తక్కువ ఖర్చే కాకుండా ఒకసారి తెచ్చి పెట్టుకున్న మందులు చాలాకాలం వరకు ఉపయోగపడతాయి. మందులను పశువులకు సులువుగా వేసుకోవచ్చు. పొదుగు వాపు వ్యాధికి అల్లోపతి మందులతో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేసినా తగ్గదు. హోమియో వైద్యంలో రూ. 200తో తగ్గిస్తున్నాం. ఈ వైద్యం సురక్షితమైనది. తక్కువ ఖర్చుతోనే అందించే ప్రయత్నం చేస్తున్నా. దీన్ని మరింతగా ప్రచారం చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. – డాక్టర్ దంటు సత్యన్నారాయణ (9440580903, 9059060491), హోమియో పశువైద్య నిపుణులు సహజాహారం కూరగాయలు, వరి, పత్తి విత్తనాలు సహజాహారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఖరీఫ్ సీజన్ కోసం సూటి రకం పత్తి(సూరజ్), సంప్రదాయ వరి, కూరగాయల దేశవాళీ విత్తనాలను సికింద్రాబాద్ తార్నాకలోని సహజ ఆహారం స్టోర్‌లో రైతులకు అందుబాటులో ఉంచింది. గత సీజన్లో సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తయిన ఈ సంప్రదాయ విత్తనాలు 90% మొలక, 80% ఏకరూపతతో ఉంటాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జనరల్ డా. రామాంజనేయులు తెలిపారు. బచ్చలికూర, బీర, బెండ, కాకర, వంగ, చెట్టుచిక్కుడు, మిరప(తేజ), గోరుచిక్కుడు, పత్తి(సూరజ్), చిక్కుడు, మునగ, గోంగూర రెడ్, మెంతి, పాలక్, గుమ్మడి, కంది, పొట్లకాయ, సొరకాయ, వరి (గోవింద్‌భోగ్, కాలాభాత్, సుగంధి, పరిమళ సన్న, జింక్ రైస్ వంటి 16 దేశవాళీ రకాలు) అందుబాటులో ఉన్నాయి. వివరాలకు.. సహజాహారం స్టోర్, తార్నాక, సికింద్రాబాద్. ఫోన్లు: 81439 47491, 83007 83300. విత్తనాలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. దూరప్రాంతాల రైతులు ఫోన్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. 10న సిరిధాన్యాలు, కూరగాయల సాగుపై శిక్షణ సేంద్రియ పద్ధతుల్లో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ సికింద్రాబాద్‌లో ఈ నెల 10(ఆదివారం– ఉ. 9.30 గం. నుంచి)న రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసా యం గ్రూప్ ఆధ్వర్యంలో ఉస్మాని యా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్లాటినం జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్ ఎస్ 6 రూమ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. హాజరుకాదలచిన వారు క్రాంతి(94903 87574, 80748 47144), శ్యాంరెడ్డి (84640 76429), పాపిరెడ్డి (85019 04201)లను సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలి. ప్రవేశం మొదట రిజిస్టర్ చేసుకున్న 500 మంది రైతులకు మాత్రమే. 10న సేంద్రియ సేద్యంపై డా. నారాయణరెడ్డి శిక్షణ కర్ణాటకకు చెందిన సుప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, సీనియర్ రైతు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి ఈ నెల 10(ఉ.10గం.–సా. 4 గం.)న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై తెలుగులో శిక్షణ ఇస్తారు. సేంద్రియ వ్యవసాయంపై తొట్టతొలిసారిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్‌క్లబ్, పతంజలి యోగ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగనుంది. బెంగళూరు రూరల్ దొడ్డబళ్లాపూర్ సమీపంలో గత 40 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న డా. నారాయణరెడ్డి ‘లీసా ఇండియా’ పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉన్నారు. సేంద్రియ రైతుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆయన వద్దకు దేశ విదేశాల నుంచి రైతులు వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారు. కొద్ది ఏళ్లుగా చోహాన్ క్యు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు. వివరాలకు.. డాక్టర్ పి.బి.ప్రతాప్‌కుమార్– 94401 24253 కూరగాయలు, ఔషధ మొక్కలపై 41 రోజుల ఉచిత శిక్షణ దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యూ సహజ సాగు, చింతల వెంకటరెడ్డి(సీవీఆర్) మట్టి ద్రావణం వాడే పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలతోపాటు.. కలబంద, అశ్వగంధ, నిమ్మగడ్డి, కాశీగడ్డి తదితర ఔషధ, సుగంధ మొక్కల సాగు, శుద్ధి, విక్రయాలపై ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో జూలై 1 నుంచి 41 రోజుల పాటు పొలంలో ఆచరణాత్మక ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్(హైదరాబాద్) వ్యవస్థాపకుడు శివశంకర్ షిండే తెలిపారు. కనీసం పదో తరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో శిక్షణ ఇస్తామని, శిక్షణతోపాటు భోజన, వసతి ఉచితమే. ఆసక్తిగలవారు పేరు, విద్యార్హత, వయస్సు, చిరునామా తదితర వివరాలను ఈ నెల 11వ తేదీ లోగా 70133 09949, 81210 08002 నంబరుకు వాట్సప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాత్రమే మెసేజ్ పంపవలసి ఉంటుంది.. 9న సేంద్రియ/ప్రకృతి సేద్యంపై అవగాహన సదస్సు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంపై హైదరాబాద్ లక్డీకపూల్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఈనెల 9(శనివారం)న ఉ.10 గం. నుంచి సా. 4 గం. వరకు అవగాహన సదస్సు జరగనుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప, పత్తి, కూరగాయలు, అరటి, చిరుధాన్యాల సాగు, కషాయాలు/ద్రావణాలు, జీవన ఎరువులు, వేస్ట్ డీకంపోజర్ వినయోగంపై అవగాహన కల్పిస్తారు. సీనియర్ రైతులు ఎం.సి.వి. ప్రసాద్, కొక్కు అశోక్‌కుమార్, లావణ్యారెడ్డి, శరత్, అరుసుమిల్లి కృష్ణ, పడాల గౌతమ్, కె.రామచంద్రం అవగాహన కల్పిస్తారు. వివరాలకు 98493 12629, 96767 97777 నంబర్లలో సంప్రదించవచ్చు. సదస్సుకు హాజరయ్యే రైతులకు తలా ఒక వేస్ట్ డీకంపోజర్ బాటిల్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు. -
ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబే బాధ్యత వహించాలి..
సాక్షి, నూజివీడు : నేటికి ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాటమే అని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయన్ని రాష్ట్రపతిని కలిసి వివరించామని ఎంపీ చెప్పారు. పాదయాత్ర శిబిరం వద్ద ఎంపీలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలను ఎంపీలు వైఎస్ జగన్‌కు వివరించారు. అనంతరం ఎంపీ మేకపాటి మీడియాతో మాట్లాడుతూ. 25మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం చర్చ జరిగేదని ఎంపీ అన్నారు. సీఎం చంద్రబాబు తీరుపై ఎంపీ మేకపాటి మండిపడ్డారు. ‘ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను చంద్రబాబు ఇంకా చేస్తునే ఉన్నారు. నిరాహార దీక్ష చేసి మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయనికి ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబే బాధ్యత వహించాలి. ప్రత్యేక హోదా వస్తే అందరూ వచ్చి ఇక్కడే పరిశ్రమలు పెట్టేవారని’ మంత్రి పేర్కొన్నారు. అంతేకాక నిరుద్యోగులందరికి ఉద్యోగాలు వచ్చేవని మంత్రి తెలిపారు. అవన్నీ విషయాలను చంద్రబాబు పక్కాన పెట్టి.. ప్యాకేజీకి ఒప్పుకున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నేతలతో చర్చించి ఈ నెల 22న భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. -
నూజివీడు నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, నూజివీడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం మైలవరం నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని నూజివీడు నియోజవర్గంలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టారు. శోభనాపురం అడ్డరోడ్డు వద్ద నూజివీడు నియోజకవర్గంలోకి జననేత ప్రవేశించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఘనస్వాగతం పలికారు. రాజన్నబిడ్డను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా జిల్లా గణపవరం వద్ద బుధవారం పాదయాత్ర 1800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు వైఎస్ జగన్‌ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరారు. -
వైఎస్సార్ సీపీ ఆందోళనతో దిగొచ్చిన అధికారులు
సాక్షి, విజయవాడ: ఉయ్యూరులో ప్రభుత్వ కార్యాలయాలు మార్పు విషయంలో వైఎస్సార్ సీపీ నేతల ఆందోళనతో అధికారులు దిగొచ్చారు.జాతీయ రహదారి వెడల్పు చేసే క్రమంలోనే ఉయ్యూరులోని ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలతో పాటుగా పోలీస్ స్టేషన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. కార్యాలయాల ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం కొంత మంది రైతులు వద్ద భూమిని సేకరిస్తున్నామని నూజివీడు ఆర్డీవో రంగయ్య తెలిపారు. ఓ రైతు కార్యాలయాల ఏర్పాటుకు ఎకరం 30 సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు కోరినట్లుగానే అందరి ఆమోదంతోనే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ నిర్మించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్డీవో రంగయ్య వివరించారు. -
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇం జినీరింగ్ ప్రథమ సంవత్సరం సివిల్ బ్రాంచి విద్యార్థిని అన్నారపు వీణ(18) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన వీణ గురువారం ఉదయం తలనొప్పిగా ఉంద ని, తరగతులకు హాజరుకాలేనని స్నేహి తురాలు సంధ్యకి చెప్పిన హాస్టల్‌కి వెళ్లి పోయింది. తరగతుల అనంతరం వీణ రూంకి వెళ్లిన సంధ్యకు... వీణ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న సెక్యూరిటీ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వీణ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. -
కృష్ణాజిల్లాలో టీడీపీ నాయకురాలి దాష్టీకం
కృష్ణాజిల్లా: నూజివీడులో టీడీపీ మహిళా కార్యదర్శి రాణీసింగ్ దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక సూపర్ బజార్లో పనిచేస్తున్న ఓ బాలికను రాణీసింగ్ తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు చెప్పుతో కొట్టింది. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక అదే సూపర్ బజార్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసుల తీరు విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. రాణీసింగ్పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. టీడీపీ నాయకురాలిని శిక్షించడంతో పాటు బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కృష్ణాజిల్లాలో టీడీపీ నాయకురాలి దాష్టీకం.
-
తలదించుకుని వెళ్లాలి..!
సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ ఎదురుతిరిగిన జూనియర్లు ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట నూజివీడు : తాము ఎదురొస్తే తలదించుకుని వెళ్లాలి.. సీనియర్లు అంటే గౌరవం ఉండాలి.. తమ ముందు నడవకూడదని.. ఇలా సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో ఇలాగే ర్యాగింగ్ చేశారని తెలిసింది. ఫార్మశీ నాలుగో సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేస్తుండడంతో వారు కూడా ఎదురు తిరిగారు. ఇరువర్గాల మధ్య వివాదం తోపులాటకు దారితీసింది. సీనియర్ విద్యార్థుల పట్ల గౌరవంగా ఉండాలని, తాము ఎదురొస్తే తలవంచుకుని వెళ్లాలని, మా ముందు నడవకూడదని, పాటలకు డ్యాన్స్‌లు వేయాలని ర్యాగింగ్ చేస్తున్నారు. అంతేగాకుండా తమ పేర్లు ఏమిటో చెప్పాలని సీనియర్ విద్యార్థులు అడుగుతున్నారని, దీనికి మీపేర్లు తెలియదని జూనియర్లు చెబితే, మా పేర్లు ఎందుకు తెలుసుకోలేదని చెంపమీద కొడుతున్నారు. ఇలా కొట్టగా ఒక విద్యార్థి కళ్లజోడు కూడా పగిలింది. ఈ విధంగా ర్యాగింగ్ జరుగుతుండడంతో పట్టణానికి చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థి ఒకరు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. వారు వచ్చి సీనియర్ విద్యార్థులను నిలదీసే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం తోపులాటకు దారితీసింది. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కళాశాల యాజమాన్యం గొడవ ఏమీలేదని తెలపడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారే తప్పితే ర్యాగింగ్ అంశంపై ఆరా తీయలేదు. ర్యాగింగ్ విషయమై ప్రథమ సంవత్సర విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లినా సరిగా పట్టించుకోకపోవడంతో వారు తమ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వారు రావడంతో కళాశాల వెలుపల గొడవ, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రా్యాగింగ్కు కారణమైన ఆఖరి సంవత్సరం విద్యార్థులను తల్లిదండ్రులను తీసుకురమ్మంటూ యాజమాన్యం ఇంటికి పంపించడంతో వారు శనివారం కళాశాలకు రాలేదు. చిన్నవిషయమే కళాశాలలో విద్యార్థుల మధ్య ఇగో సమస్య కారణంగా ఉత్పన్నమైనదే తప్ప సమస్యేమీ కాదు. తల్లిదండ్రులను తీసుకురమ్మని విద్యార్థులకు తెలిపాం. ఇన్నేళ్లలో కళాశాలలో ఎన్నడూ ర్యాగింగ్ అనేది లేదు. - శ్రీనాథ్ నిశ్శంకరరావు, ప్రిన్సిపాల్ -
నూజివీడులో దారుణం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఆస్తి తగాదాలు పరిష్కరిస్తానని టీడీపీ నాయకుడు చేసిన మోసంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుడు లక్కినేని వెంకటేశ్వర్లు, ఆయన భార్య, కుమారులతో టీడీపీ నేత నుతక్కి వేణు ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడని.. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని సంబంధిత ఆస్తులను తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. విషయం తెలిసి వేణును వెంకటేశ్వర్లు నిలదీశాడు. వేణు, అతడి అనుచరుల బెదిరింపులతో ఒక్కసారిగా వెంకటేశ్వర్లు కుప్పకూలిపోయాడు. గుండెనొప్పితో అక్కడిక్కడే మరణించాడు. వెంకటేశ్వర్లు మృతి టీడీపీ నేత నుతక్కి వేణు కారణమని ఆరోపిస్తూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వేణుపై కఠిన చర్యలు తీసుకుని ఆస్తుల డాక్యుమెంట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. -
భక్తుల వద్దకే భగవంతుని ఆశీస్సులు
మంత్రి మాణిక్యాలరావు నూజివీడు : వచ్చే ఉగాది నుంచి భగవంతుడి ఆశీస్సులు భక్తులకు అందించడానికి భక్తబృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. కృష్ణాజిల్లా నూజివీడులో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో 50 నుంచి 100 మందితో ఈ బృందాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఈ బృందాలు బిడ్డలు పుట్టిన సమయంలోను, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం, నామకరణం సమయాల్లో భజన చేస్తూ వారి ఇళ్లకు వెళ్లి ఆశీర్వదిస్తాయని చెప్పారు. ఎవరైనా వ్యక్తి చనిపోతే 12రోజుల తరువాత స్థానిక శివాలయం నుంచి అభిషేక జలాన్ని తీసుకుని చనిపోయిన వ్యక్తి ఇంట్లో సంప్రోక్షణ చేసి, అరగంట సేపు భజన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. దేవాలయ భూములను ఆక్రమించుకున్న వారిలో 90 శాతం మంది రాజకీయ నాయకులేనని చెప్పారు. కోర్టు తీర్పులు వచ్చిన వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. దేవాదాయ శాఖలో 23వేల సిబ్బంది అదనంగా ఉన్నారని, ఈవో స్థాయి పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి రూ.2300కోట్లను కేంద్రప్రభుత్వం అందజేసిందన్నారు. దేశం మొత్తంలో ఒక్క ఏపీకే కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలోని పేదల కోసం ఒక లక్షా 86వేల గృహాలను నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ దొరై, జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు. -
సీసీ కెమేరాలే పట్టుకెళితే ఎలా పట్టుకోవాలబ్బా..!?
చోరీ ఘటనలో జుట్టుపీక్కుంటున్న నూజివీడు పోలీసులు నూజివీడు : దొంగతనాలు జరగకుండా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల ప్రజలకు పోలీసులు చేస్తున్న సూచన. ఎందుకంటే ఇంటిగానీ, దుకాణానికిగానీ ఎవరెవరు వస్తున్నారనేది సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమవుతోంది. ఈ క్రమంలో దొంగతనాలు, ఇతర నేరాలు జరిగితే నిందితులను పట్టుకోవడం సులువుగా ఉంటుందనేది పోలీసులు ఉద్దేశం. అయితే దొంగతనానికి వచ్చి దుండుగులు దొంగతనం చేసిన తరువాత సీసీ కెమేరాలను, సీసీ కెమేరాల ఫుటేజీ నిక్షిప్తం అయ్యే హార్డ్‌డిస్క్ బాక్సును ఎత్తుకెళ్తే పరిస్థితి ఏంటి..? కచ్ఛితంగా ఇదే పరిస్థితి నూజివీడు పోలీసులకు ఎదురైంది. మొక్కుబడిగా వేలిముద్రలు సేకరించి వాటిని విశ్లేషణ చేస్తున్నారు. పట్టణంలోని స్టార్ జనరల్ స్టోర్‌లో ఇటీవల దొంగలు పడి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లడంతోపాటు వెళుతూవెళుతూ షాపులో ఉన్న ఏడు సీసీ కెమేరాలను, వాటి ఫుటేజీ నిక్షిప్తం అయ్యే హార్డ్‌డిస్క్ బాక్స్‌ను సైతం ఎత్తికెళ్లారు. దొంగలను పట్టుకునే మీకే అన్ని తెలివితేటలు ఉంటే దొంగతనం చేసే మాకెన్ని తెలివితేటలు ఉండాలి అన్న చందంగా పోలీసులకు సవాల్ విసిరారు. ఈ చోరిని చేధించడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన ఆధారం లభ్యమవ్వలేదని తెలుస్తోంది. -
సూపర్మార్కెట్లో భారీ చోరీ
నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని స్టార్ సూపర్ మార్కెట్లో గురువారం ఆర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు వెనుక భాగంలో కిటీకీ తలుపులు బద్దలు కొట్టుకుని దొంగలు లోపలికి ప్రవేశించారు. రూ. 40 వేలు, విలువైన వస్తువులతోపాటు సీసీ కెమెరా, కంప్యూటర్ను అపహరించుకుని పోయారు. శుక్రవారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన షాపు సిబ్బంది... యజమానికి సమాచారం అందించారు. యజమాని షాపు వద్దకు చేరుకుని... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా షాపునకు చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
విజయవాడలో రియల్టర్ ఆత్మహత్య
నూజివీడులో భూములు కొని నష్టపోయిన వ్యాపారి రాజధాని అక్కడే వస్తుందని నమ్మి అప్పులు చేసి కొనుగోళ్లు వడ్డీ వ్యాపారులు ఒత్తిడి పెంచడంతో బలవన్మరణం విజయవాడ: రాజధాని నిర్మాణం కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలోనే జరుగుతుందని నమ్మి ఆ ప్రాంతంలో భూములు కొని నష్టపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుప్పాల విజయ్‌కుమార్.. సోమవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజధాని గుంటూరు జిల్లా తుళ్లూరుకు వెళ్లడంతో విజయ్ కుమార్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని విజయ్‌కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణంపై గతంలో ప్రభుత్వం పలు ప్రకటనలు చేయడంతో.. విజయవాడలోని రామవరప్పాడులో నివాసి విజయ్‌కుమార్ నూజివీడులో స్థలాలు కొన్నాడు. దాని కోసం తనకు గన్నవరం సమీపంలోని తేలప్రోలు వద్దనున్న 36 సెంట్ల స్థలాన్ని అమ్మాడు. ఆ సమయంలో పొరుగు స్థలం వారితో వివాదం ఏర్పడినట్లు సమాచారం. సొంత స్థలం అమ్మిన పైకంతో పాటు.. అధిక వడ్డీలకు మరో రూ. కోటి వరకూ అప్పుచేసి మొత్తం రూ. 5 కోట్లతో నూజివీడులో స్థలాలను కొనుగోలు చేశాడు. వాటిలో కొన్నింటికి అడ్వాన్స్‌లు మాత్రమే చెల్లించాడు. కొన్ని రిజిస్ట్రేషన్లు చేయగా, కొన్ని రిజిస్ట్రేషన్ కాలేదు. స్థలాలు వెంటనే అమ్ముడుబోతే వారికి పూర్తిగా డబ్బు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. స్థలాలు అమ్మకాలు జరగకపోవడంతో తాను కొన్న భూములకు మిగిలిన డబ్బులు వెంటనే చెల్లించలేకపోయాడు. కాగా, సాయిరామ్ అనే ఫైనాన్షియర్ వద్ద రూ. 3 వడ్డీకి రూ. 40 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానిపై నెలకు రూ. 1.20 లక్షల వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఐదు నెలల నుంచి ఫైనాన్షియర్స్ నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నెల 9వ తేదీ వచ్చినా వడ్డీ చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి వద్ద నుంచి సోమవారం ఉదయం 10.23 గంటలకు ఫోన్ వచ్చింది. దీంతో విజయకుమార్ వణికిపోయాడు. భార్యను బయటకు పంపి..: అప్పుడే రామవరప్పాడులోని స్కూల్లో చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలకు భోజనం క్యారియర్ ఇచ్చేందుకు భార్య బయలుదేరింది. ఆమెతో ఫోన్ విషయాన్ని వివరించి బాధపడ్డాడు. భార్య బయటకు వెళ్లగానే ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ వద్ద విజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. అప్పులిచ్చినవారి ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడని, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. -
‘పాలడుగు’ మృతి కాంగ్రెస్‌కు తీరనిలోటు
ఆంధ్రరత్నభవన్‌కు చేరిన పార్థీవ దేహం నేడు నూజివీడు తరలింపు విజయవాడ సెంట్రల్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలడుగు వెంకట్రావు పార్థీవ దేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు పాలడుగు పార్థీవ దేహం ఆంధ్రరత్న భవన్‌కు చేరింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మాజీమంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), సిటీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, కడియాల బుచ్చిబాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్‌కుమార్, నరహరిశెట్టి నరసింహారావు, పార్టీ నాయకులు సుంకర పద్మశ్రీ భక్త, సలీమ్ సర్వేజ్, సి.రమేష్‌తో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఉదయం 11 గంటల వరకు ఆంధ్రరత్న భవన్లో పాలడుగు భౌతికకాయాన్ని ఉంచనున్నట్లు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు తెలిపారు. అనంతరం నూజివీడు తరలిస్తామన్నారు. విలువలున్న నేత రాజకీయాల్లో పాలడుగు విలువలున్న నేత అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ కొనియాడారు. నేటితరం నాయకులకు ఆయన ఆదర్శమన్నారు. రెండు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ, పి.వి. నరసింహారావు లాంటి జాతీయస్థాయి నాయకులతో సన్నిహిత సంబంధాలను పాలడుగు కొనసాగించారన్నారు. పోరాట యోధుడు జమీందారీ వ్యతిరేక పోరాటాన్ని నడిపిన ఘనత పాలడుగుకే దక్కుతోందని మాజీమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అన్నారు. నూజివీడు ప్రాంతంలో పాలడుగు చేసిన భూ పోరాటాల ఫలితంగా ఎందరో పేదలకు భూములు దక్కాయన్నారు. తాను విద్యార్థి నాయకుడిగా ఉండగానే పాలడుగు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే వారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే ముగిసిందని చెప్పారు. తీరని లోటు పాలడుగు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు చెప్పారు. పి.వి. నరసింహారావుతో మంచి సంబంధాలు కలిగిన పాలడుగు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అప్పట్లోనే తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పారన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన పాలడుగును నేటి తరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విజయవాడ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మృతికి పలువురు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. వెంకట్రావు మరణం కాంగ్రె స్ పార్టీకి తీరని లోటని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన ఎనలేని సేవలందించారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని పిళ్లా కోరారు. గాంధీనగర్ : ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మృతిపై ఏపీ ఫార్మర్ లెజిస్లేటర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కె. సుబ్బరాజు సంతాపం తెలిపారు. నూజివీడు మ్యాంగో మార్కెట్‌తో పాటు కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. -
రెప్పవాల్చిన నిఘా నేత్రం
నూజివీడు : పెచ్చుమీరుతున్న నేరాలను అదుపు చేసేందుకు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసు నిఘా నేత్రంఅధికారులు గాలికొదిలేశారు. రెండేళ్ల క్రితం నూజివీడులో రోడ్లపైనే బంగారు గొలుసులు తెంపుకొనిపోవడం, ఇళ్లలో పట్టపగలే చోరీలకు పాల్పడటం, ఆ క్రమంలో ప్రాణాలు తీసేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు విచ్చలవిడిగా జరిగాయి. 2012లో పట్టపగలు మధ్యాహ్న సమయంలో మహిళ మెడలోని బంగారు గొలుసులు లాక్కొని హత్యచేసిన ఘటనలో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభ్యంకాని నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించారు. పట్టణంలోని చిన్న గాంధీబొమ్మ సెంటర్, సింగ్ హోటల్ సెంటర్, బస్టాండు సెంటర్ల వద్ద అప్పటి ఎస్ఐ ఐవీ నాగేంద్రకుమార్ దాతల సహకారంతో వీటిని ఏర్పాటుచేశారు. వీటి పర్యవేక్షణ కోసం చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఒక కంప్యూటర్ గదిని కూడా కేటాయించారు. సీసీ కెమెరాల కారణంగా అప్పట్లో చైన్ స్నాచింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌లు, ట్రాఫిక్ ఉల్లంఘనలు అదుపులోకి చాలావరకు తగ్గాయి. కొరవడిన పర్యవేక్షణ... సీసీ కెమెరాలను ఏర్పాటుచేసిన కొత్తలో కొద్దిరోజులపాటు బాగానే నిర్వహించినా.. అనంతర కాలంలో వాటి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో నిఘా నేత్రాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని రోజులు మాత్రమే పనిచేసిన ఈ సీసీ కెమెరాలు ఆ తర్వాత పనిచేయడం లేదు. పోలీసు అధికారులు కూడా వాటిని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీసీ కెమేరాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన గది కూడా ఖాళీచేయడం గమనార్హం. తీవ్ర నేరాలు జరిగితే గుర్తించడం ఇబ్బందే... సీసీ కెమెరాలు వినియోగంలో లేని నేపథ్యంలో గతంలో మాదిరిగా తీవ్ర నేరాలు జరిగితే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను పసిగట్టడానికి, నేరాలను నిరోధించడానికి ఉపయోగపడే సీసీ కెమెరాలను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
భారీగా క్యాట్ ఫిష్ లు పట్టివేత
విజయవాడ: నూజివీడు - హనుమాన్ జంక్షన్ రహదారిలోని మీర్జాపురం వద్ద గురువారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల క్యాట్ ఫిష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గరు వ్యక్తులతోపాటు లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. క్యాట్ ఫిష్‌ను కైకలూరు నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు నిందితులు తమ దర్యాప్తులో వెల్లడించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
కోరిక తీర్చకుంటే కోసుకుని చస్తా!
రెండు నెలలపాటు యువతి నిర్బంధం బెదిరించి వాంఛ తీర్చుకున్నఇంజినీరింగ్ విద్యార్థి సహకరించిన రౌడీషీటర్ విజయవాడ సిటీ: ‘కోరిక తీర్చకుంటే కోసుకుని చస్తా.. పారిపోతే నీ కుటుంబాన్ని అంతం చేస్తా..’ అంటూ ఓ శాడిస్టు రెండు నెలలపాటు ఓ విద్యార్థినిని నిర్బంధించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఎలాగోలా రెండు రోజుల కిందట అతడిబారి నుంచి తప్పించుకున్న ఆమె.. కుటుంబ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోసారి ఆ శాడిస్టు ప్రతాపం చూపుతాడేమోనన్న ఆందోళనతో నగరంలోని పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రయించగా.. ఇలాంటి సైకోలకు తగిన శాస్తి చేయాలంటే పోలీసు కేసు పెట్టడమే మంచి దనే సలహా ఇచ్చారు. సంబంధిత పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలంటూ కుటుంబ సభ్యులకు, ఆమెకు ధైర్యం చెప్పి పంపారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని నగర పంచాయతీకి చెందిన ఓ యువతి కానూరులోని బీఈడీ కాలేజీలో చదువుతోంది. దీనికి సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీలో నూజివీడుకు చెందిన ఓ యువకుడు కూడా చదువుతున్నాడు. రోజూ ఇంటికి రాకపోకలు సాగించే క్రమంలో వీరికి బస్టాండ్‌లో పరిచయం ఏర్పడింది. పక్కపక్క కాలేజీల్లోనే చదువుతుండడంతో ఇద్దరూ బస్టాండ్‌లో దిగి ఒకే బస్సులో కాలేజీకి, కాలేజీ నుంచి బస్టాండ్‌కు వెళ్లేవారు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తన కోరిక తీర్చాలంటూ ఆ యువతిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించి మాట్లాడడం మానేసింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత క్షమాపణతో మాటలు కలిపాడు. రెండు నెలల కిందట పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మంచి మాటలతో మభ్యపెట్టి బిస్కెట్లలో మత్తు కలిపి ఇచ్చాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను నేరుగా నూజివీడులోని తన ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించాడు. అతడి తల్లి మందలించే ప్రయత్నం చేయగా కత్తులతో కోసుకుని బెదిరించాడు. దీంతో కొడుకు మాటకు ఆమె ఎదురుచెప్పలేదు. రెండు నెలలపాటు ఆ యువతిని ఇంట్లోనే బంధించి తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆమె ప్రతిఘటిస్తే చనిపోతానంటూ చేతులు, వంటిపై కోసుకుని బెదిరించేవాడు. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే.. ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తీవ్ర వ్యధను అనుభవిస్తూ గడిపింది. అక్కడి పరిస్థితి తట్టుకోలేని స్థితిలో రెండు రోజుల కిందట తప్పించుకొని పారిపోయి ఇంటికి వచ్చింది. ఈ సంగతి యువతి కుటుంబసభ్యులకు తెలిసినప్పటికీ అతడికి భయపడి ఎవరికీ చెప్పుకోలేకపోయారని తెలిసింది. యువతి ఇంటికి చేరుకున్నాక పోలీసు శాఖలోని ఓ విభాగంలో పనిచేసే పరిచయస్తుడైన అధికారిని కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు రావడంతోపాటు ఆ శాడిస్టు వల్ల ప్రాణభయం ఏర్పడుతుందనే ఆందోళనను యువతి తాలూకు కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినట్టు తెలిసింది. రౌడీషీటర్ సహకారం ఇంజినీరింగ్ విద్యార్థి సైకో చర్యలకు నూజివీడు పట్టణానికి చెందిన ఓ రౌడీషీటర్ అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. యువతి కిడ్నాప్ మొదలు ఇంట్లో నిర్బంధించడం వరకు కావాల్సిన సహాయ సహకారాలు రౌడీషీటర్ అందించినట్టు తెలిసింది. ఇతడి దన్నుతోనే కత్తులు చూపించి ఆమెను బెదిరించడం ద్వారా తన వాంఛను తీర్చుకున్నట్టు కుటుంబ సభ్యులు వాపోయినట్టు పోలీసు అధికారి చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. -
రాజధానికి నూజివీడే అనుకూలం
పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల సేకరణకు అవకాశం ప్రకృతి విపత్తుల భయం లేని ప్రాంతం విమానాశ్రయం ఏర్పాటుకూ భూములు తొందరపాటు నిర్ణయాలొద్దు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సూచన నూజివీడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి అన్ని హంగులూ కలిగిన అనువైన ప్రదేశం నూజివీడేనని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడును రాజధానిగా నిర్మిస్తే ఏలూరు, నూజివీడు, విజయవాడ కలసి దేశంలోనే ఒక పెద్ద మహానగరంగా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ పరిసరాలలోనే రాజధాని ఉంటుందని ప్రకటించడం శుభపరిణామమని, అయితే రోజుకోవిధంగా ప్రకటన ఇస్తుండటంతో ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. దీనికి తెరదించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టంచేయాలన్నారు. నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల భూములు సేకరించవచ్చన్నారు. ఈ ప్రాంత భూములు భారీ భవనాల నిర్మాణానికి అనువైనవని, భూకంపాలు కూడా వచ్చే ప్రమాదం లేదని నిపుణులు తెలిపారని వివరించారు. నూజివీడుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే విమానాశ్రయం ఉందని, నూతన విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకుంటే కాట్రేనిపాడులో దాదాపు ఐదువేల ఎకరాల అటవీభూములు ఉన్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఎలాంటి నష్టం గాని, ముంపు భయం గాని లేని ప్రాంతం నూజివీడు ఒక్కటేనని తెలిపారు. నూజివీడు ప్రాంతం హైదరాబాద్ తరహా భౌగోళిక నైసర్గికత కలిగి ఉందని చెప్పారు. పాలకులు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని 1953లోనే ఆనాటి పెద్దలు నిర్ణయించారని, కొన్ని అనివార్య కారణాల వల్ల రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయకుండా కర్నూలులో ఏర్పాటు చేశారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నూజివీడు మండల అధ్యక్షుడు మందాడ నాగేశ్వరరావు, నాయకుడు పల్లె రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
వీధినపడ్డ ‘తెలుగు’ తమ్ముళ్లు
నూజివీడులో ముదురుతున్న రగడ ఎంపీ వ్యాఖ్యలతో ముద్దరబోయిన వర్గం ఆగ్రహం అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన ‘దేశం’ నూజివీడు : నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగు తమ్ముళ్ల అంతర్గత విభేధాలు ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిట్టనిలువునా చీలి పోయారు. ముద్దరబోయినను ఇన్చార్జిగా ఎవరు నియమించారని ఆయన వ్యతిరేకవర్గం ప్రశ్నిస్తుండగా, ఓడిపోయిన అభ్యర్థే నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండే ఆచారం తెలుగుదేశంపార్టీ పుట్టిన నాటి నుంచి కొనసాగుతోందని అనుకూలవర్గం వాదిస్తోంది. ఇప్పటివరకు చాపకింద నీరులా ఉన్న విభేదాలు, సోమవారం నూజివీడు వచ్చిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదని స్పష్టం చేయడంతో ముద్దరబోయిన వర్గానికి పుండుమీద కారం చల్లినట్లయింది. టీడీపీకి నూజివీడు అభ్యర్థిగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావును చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలోని ఒక వర్గం నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ వర్గం ఎన్నికల్లో టీడీపీకి పనిచేయలేదనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ముద్దరబోయిన, ఈ వర్గం నాయకులు పలు కార్యక్రమాల్లో కలసి పాల్గొన్నప్పటికీ ముభావంగానే ఉండేవారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ముద్దరబోయిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడని ఈ వర్గం భావించింది. అయితే అందుకు విరుద్ధంగా ముద్దరబోయిన ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాల కోసం తనవంతు పనిచేస్తుండడంతో జీర్ణించుకోలేని నాయకులు ఎలాగైనా పొమ్మనకుండానే పొగబెట్టి ఇక్కడి నుంచి పంపించేయాలనే లక్ష్యంతో ఇటీవల కొద్ది రోజుల నుంచి నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు ఎవరినీ నియమించలేదనే ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ స్వయంగా ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పార్టీలోని బీసీ నాయకులు మండిపడుతున్నారు. కావాలనే బీసీ నాయకుడైన ముద్దరబోయినను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలని పలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొంతమంది బీసీ నాయకులు ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది. గతంలోనూ అప్పటి ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యను సైతం ఇలాగే పొమ్మనకుండా పొగబెట్టి పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోయే వరకు నిద్రపోలేదని, అదే తరహాలో ఇప్పుడూ చేయాలని చూస్తున్నారని బీసీనాయకులు అంటున్నారు.రాబోయే రోజుల్లో పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనంటున్నారు. -
ప్రభుత్వోద్యోగాల పేరుతో టోకరా
8 మంది నుంచి రూ.8.80 లక్షలు తీసుకున్న యువకుడు జల్సాలకు అలవాటు పడి స్నేహితులనూ మోసగించిన వైనం విస్సన్నపేట : ప్రభుత్వోద్యోగాలపై యువతకు ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని ఓ యువకుడు కొందరి వద్ద నుంచి లక్షలాది రూపాయల తీసుకుని మోసగించిన ఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విస్సన్నపేటకు చెందిన దాయక తిరుపతిరావు తహశీల్దార్, ఆర్డీవో కార్యాల యాల్లో సర్వేయర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎనిమిది మంది యువతీ యు వకులను నమ్మించి సొమ్ము తీసుకుని మోసం చేశాడు. విజయవాడ శివారు గొల్లపూడికి చెందిన దాసరి శ్రీనివాసరావు వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అపాయింట్మెంట్ ఆర్డర్, ఐడెంటిటీ కార్డు కూడా తయారు చేయించి ఇచ్చి, ఉద్యోగంలో చేరమని చెప్పాడు. శ్రీనివాసరావు వా టిని తీసుకుని సంబంధిత కార్యాల యానికి వెళ్లి అధికారులను కలిశాడు. అతడు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డరు నకిలీదని వారు చెప్పడంతో అవాక్కయ్యాడు. తిరుపతిరావుకు సొమ్ము ఇచ్చిన మిగతా వారికి ఈ విషయాన్ని చెప్పాడు. వారంతా కలిసి మంగళవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సై దుర్గారావుకు ఫిర్యాదు చేశారు. శ్రీని వాసరావుతోపాటు నూజివీడు సమీపంలోని అన్నవరానికి చెందిన బి.శంకర్దొర, బూరవంచకు చెందిన గుడిపాటి రాజేష్, విస్సన్నపేటకు చెందిన దుర్గాప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన సిహెచ్.సంధ్య, సింహాద్రి, లక్ష్మి, రాజ్‌కుమార్ నుంచి తిరుపతిరావు మొత్తం రూ. 8.80 లక్షలు తీసుకున్నట్లు తేలింది. తమ బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము వేయించి, తమ ఏటీఎం కార్డులను ముందుగానే తీసుకుని, వాటి నుంచి సొమ్ము డ్రా చేశాడని బాధితులు తెలిపారు. తిరుపతిరావు నూజివీడులో ఐటీఐ చదివి సర్వేయర్ వద్ద అసిస్టెంట్‌గా చేస్తున్నట్లు చెప్పి అప్పటి క్లాస్మేట్లు, స్నేహితులను నమ్మించి ఉద్యోగాల పేరుతో ఇదేవిధంగా మోసగించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై బుధవారం తెలిపారు. తిరుపతిరావు జల్సాలకు అలవాటు పడి కొత్త ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశాడని పలువురు పే ర్కొంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపించే వారిని నమ్మి మోసపోవద్దని, ఇటువంటి వారితో జాగ్రత్తగా మెలగాలని ఎస్సై యువతకు సూచించారు. -
విద్యార్థి ఆత్మహత్యతో కలకలం
ఫోన్ మాయంపై వాదులాడుకున్న విద్యార్థులు హత్యేనంటున్న కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎంఎంఈ బ్రాంచికి చెందిన వికలాంగ విద్యార్థి వెంట్రపాటి శ్రీకాంత్ ప్రసన్నకుమార్ ఆత్మహ త్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృ ష్టించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ఐ-2 బ్లాక్‌లోని హాస్టల్ భవనం నాలుగో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కింద పడిన శబ్దానికి విద్యార్థులు లేచి కిందకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో అతడిని క్యాంపస్‌లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ట్రిపుల్ఐటీ అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ వైద్యులు పరీక్షించి, చనిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. వారు అందించిన సమాచారంతో ఇన్చార్జి డెరైక్టర్ కోసూరి హనుమంతరావు ఏవో పరిమి రామనరసింహం, పీఆర్వో వీరబాబుతో కలసి ఏరియా ఆస్పత్రికి వచ్చారు. శ్రీకాంత్ తండ్రి శ్రీ హరిబాబుకు ట్రిపుల్ఐటీ పీఆర్వో వీరబాబు ఫోన్ చేసి, ‘మీ కుమారుడికి సీరియస్‌గా ఉంది’ అని సమాచారమిచ్చారు. ఆస్పత్రి నుంచి సమాచారం రావడంతో పట్టణ ఎస్సై బోనం ఆదిప్రసాద్ సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం హాస్టల్‌కు వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి రూమ్మేట్లనుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. శ్రీకాంత్ స్వ గ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు. పేద కుటుంబానికి చెందిన ఇతడు వికలాంగుల కోటాలో ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యాడు. తండ్రి శ్రీహరిబాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. రాత్రి 11.30 గంటల వరకు వాదన శ్రీకాంత్‌కు స్నేహితుడైన ప్రవీణ్ అనే విద్యార్థికి చెందిన ఫోన్ రెండురోజుల క్రితం పోయింది. గతంలో సెల్ఫోన్లను తస్కరించిన సంఘటనలకు పాల్పడిన నేపథ్యంలో శ్రీకాంత్‌పై అతడికి అనుమానం కలిగింది. తాజా ఘటనపై వారి ద్దరితో పాటు మరికొంతమంది విద్యార్థుల మధ్య హాస్టల్రూంలో రాత్రి 11.30 గంటల వ రకు వాదన జరిగింది. ఈ విషయాన్ని ప్రవీణ్ 11గంటల సమయంలో శ్రీకాంత్ తండ్రికి ఫోన్‌చేసి తెలిపాడు. దానికి ఆయన రేపు వాళ్ల అమ్మను పంపిస్తానని, గొడవ పడవద్దని కూడా చెప్పినట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. ఈ విషయం కేర్‌టేకర్ దృష్టికి కూడా వెళ్లగా, ఆ యన కూడా రేపు దాని గురించి మాట్లాడదామ ని, పడుకోమని తెలపడంతో విద్యార్థులు నిద్రపోయారు. తరువాత 1.30 గంటల సమయం లో ఆత్మహత్య ఘటన జరిగింది. పెళ్లైన పదేళ్లకు పుట్టాడు హరిబాబు, సుశీలకు పెళ్లైన పదేళ్లకు పుట్టిన శ్రీకాంత్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నామ ని, ట్రిపుల్‌ఐటీలో సీటు వస్తే ప్రయోజకుడవుతాడని భావించామని, ఇలా శవాన్ని తీసుకెళ్లా ల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని మృతుడి మేనమామ, బాబాయి, తాత వాపోయారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి సుశీల కన్నీరుమున్నీరైంది. ప్రస్తుతం విధి నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఉన్న మృతుడి తండ్రి శ్రీహరిబాబుకు ఈ విషయం తెలియడంతో హుటాహుటిన నూజివీడు బయలుదేరాడని బంధువులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన సబ్‌కలెక్టర్ ఈ ఘటన గురించి తెలిసిన ఇన్చార్జి సబ్ కలెక్టర్ ఎన్.రమేష్‌కుమార్ ట్రిపుల్ ఐటీకి వచ్చి హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఇన్చార్జి డెరైక్టర్ కె. హనుమంతరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశీల్దార్ షేక్ ఇంతియాజ్‌పాషా, ఎస్సై బి.ఆదిప్రసాద్ ఉన్నారు. డీఎస్పీ జె.సీతారామస్వామి కూడా ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థులే కొట్టి చంపారు : మృతుడి బంధువుల ఆరోపణ శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, విద్యార్థులే కావాలని కొట్టి చంపారని ఆరోపించారు. ఏదైనా జరిగితే డెరైక్టర్ దృష్టికి గానీ, బాధ్యత కలిగిన అధికారి దృష్టికి గానీ విషయాన్ని తీసుకెళ్లాల్సి ఉందన్నారు. ఇలా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. బిల్డింగ్‌పైన ఐదు అడుగుల ఎత్తు ఉన్న పిట్టగోడను శ్రీకాంత్ ఎక్కలేడని, హత్యచేసి మాయ చే యాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇంత చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంటారా? అని శ్రీకాంత్ బంధువులు ప్రశ్నిస్తున్నారు. -
బాలసదనం నుంచి నలుగురు బాలికలు అదృశ్యం
హైదరాబాద్: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని అనాధాశ్రమం 'బాలసదనం' నుంచి నలుగురు బాలికలు అదృశ్యమైయ్యారు. దాంతో బాలసదనం యాజమాన్యం గురువారం పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశారు. నిన్న స్కూలుకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి బాలసదనానికి రాలేదని యాజమాన్యం పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా విద్యార్థుల చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయులను పోలీసులు విచారిస్తున్నారు. -
అటవీ భూములన్నీ ఆక్రమణలోనే
నూజివీడు డివిజన్లో 31,686 ఎకరాలు ప్రభుత్వ భూముల వివరాలన్నీ సేకరణ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోండి సబ్‌కలెక్టర్ చక్రధర్‌బాబు నూజివీడు : నూజివీడు డివిజన్లో 31,686ఎకరాల ప్రభుత్వ, అటవీభూములున్నాయని, వాటిలో దాదాపు 26వేల ఎకరాలున్న అటవీ భూములన్నీ ఆక్రమణలోనే ఉన్నాయని నూజివీడు సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ డివిజన్లో ఉన్న అన్నిశాఖల ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రతి రోజూ ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షిస్తున్నానన్నారు. ఇరిగేషన్‌కు చెందిన చెరువులు, వాగులు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తుందని, మొత్తం వివరాలు సేకరించిన తరువాత ఆ ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో తగినంతమంది సిబ్బంది లేకపోవడం వల్లనే అటవీభూములు , ఇరిగేషన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెపుతున్నారని తెలిపారు. అలాగే గ్రామాలలో, పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, ఆ భూముల్లో ఏమైనా ఆక్రమణలుంటే వాటినీ తొలగిస్తామన్నారు. ప్రభుత్వభూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు గానూ గ్రామస్థాయిలో వీఆర్వోతో పాటు ఆ మండల అధికారులతో కమిటీలు వేశామన్నారు. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, రెడ్డిగూడెం, బాపులపాడు మండలాల్లో అటవీభూములు ఎక్కువగా ఉన్నాయని, ఇవన్నీ దాదాపు ఆక్రమణకు గురవ్వడమే కాకుండా పండ్లతోటలు పెంచుతున్నారని చెప్పారు. డివిజన్లో పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్డీడ్ల పెండింగ్ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని సబ్‌కలెక్టర్ వివరించారు.. ఈ పెండింగ్‌ను తగ్గించేందుకు చర్యలు చేపట్టానన్నారు. డివిజన్లో మీసేవా కేంద్రాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మీ సేవా కేంద్రాల వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలని, ఆ పట్టికలో పేర్కొన్న ఫీజును మాత్రమే ప్రజలు చెల్లించాలన్నారు. అలాగే ఆధార్‌కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, గతంలో ఆధార్‌కార్డు తీసుకుని అందులో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేయించుకోవడానికి మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యాధులు నివారించండి... వర్షాకాలం వచ్చినందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో మండల అధికారులు వ్యాధుల నివారణా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీల్లో పూడికను తొలగించడం, మంచినీటి ట్యాంకుల క్లీనింగ్, నీటిని క్లోరినేషన్ చేయడం, నివేశన ప్రాంతాల్లో, ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. -
దొంగతనమే ప్రాణాలు తీసింది
దొంగతనానికి వచ్చిన వ్యక్తిని గ్రామస్తులు చితకబాదడంతో మృతి చెందిన సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలం అన్నవరంలో గురువారం తెల్లవారుజామునా చోటు చేసుకుంది. గత అర్థరాత్రి ఐదుగురు దొంగలు అన్నవరంలోని ఇళ్లలో చోరీకి యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమైయ్యారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని... కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. దాంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు దొంగలు పరారైయ్యారు. ఆ ఘటనపై అన్నవరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాళీ భూములు గుర్తించండి : కలెక్టర్
కలెక్టర్ విజయవాడ : విజయవాడ, నూజివీడు డివిజన్ల పరిధిలో ఖాళీ భూముల వివరాలను సమగ్రంగా రూపొందించాలని, మ్యాప్‌లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు సబ్ కలెక్టర్లను ఆదేశించారు. భూముల వివరాలపై నగరంలోని తన చాంబర్లో గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ జె.మురళితో కలసి విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలతో పాటు ఇతర సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఖాళీ స్థలాల గుర్తింపునకు చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగా విజయవాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్లకు చెందిన మ్యాప్‌లను పరిశీలించి రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాప్‌లు రూపొం దించే సందర్భంలో సర్వే నంబర్లు, అటవీ, రెవెన్యూ తదితర భూముల వివరాలు స్పష్టంగా గుర్తించాలని డెప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఈ విషయంలో సబ్ కలెక్టర్లు, అటవీ అధికారులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కళాశాలలు, వైద్య సంబంధ సంస్థలు వచ్చే అవకాశం ఉన్నందున దీనిపై పూర్తి సమగ్ర నివేదికను రిమార్క్‌లతో అందించాలని ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ డి.హరిచందన, నూజివీడు సబ్ కలెక్టర్ కేవీఎస్ చక్రధరబాబు, ఎన్ఓయూఎల్పీ ఎం రమేష్‌కుమార్, డీఎఫ్ఓ ఎస్ రాజశేఖర్, ఎఫ్ఎస్ఓ వీ సుబ్బారావు, డెప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు ఎన్ సత్తిబాబు (విజయవాడ), కేవీ రామకృష్ణ (నూజివీడు) పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కష్టాలకు చెక్
నూజివీడు, న్యూస్‌లైన్ : దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఇప్పటి వరకు సమయాధారిత విధానంలో అమలవుతోంది. దీనివల్ల మిగిలిన మార్గాల్లో ట్రాపిక్ లేకపోయినా డిస్ప్లే బోర్డు మీద సెకన్లు పోయి సున్నాకు వచ్చి, పచ్చలైటు వెలిగే వరకూ వాహనాలు నిలిచి ఉండాల్సిందే. ఈ విధానం కారణంగా ఒకే మార్గంలో ఐదారు ట్రాఫిక్ సిగ్నళ్లు ఉంటే సమయం ఎంతో వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సమయం వృథాను అరికట్టేందుకు నూజివీడు సారథి ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ విద్యార్థులు ‘వాహనాల సాంద్రత ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ’ విధానాన్ని రూపొందించారు. ఈ విధానం వల్ల వాహనాలు లేకపోయినా సిగ్నల్ సమయం పూర్తయ్యేవరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అత్యవసర సర్వీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్లొచ్చు. మనం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో ముందుగానే మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈ విధానం ప్రస్తుతం ఉన్న విధానం కన్నా మెరుగైనదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నెల 22న ఇబ్రహీంపట్నం లోని నిమ్రా గ్రూపు ఆఫ్ కాలేజెస్లో నిర్వహిం చిన ఆరో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియంలో ఈ ప్రాజెక్టు ప్రథమస్థానం పొందింది. పనిచేసే విధానం ఇలా.... ఈ విధానంలో 200 మీటర్ల వరకు ట్రాఫిక్ ఐలాండ్ నుంచి అన్ని వైపులా రోడ్లకు సెన్సార్లను అమర్చి, ట్రాఫిక్ కంట్రోల్ వద్ద రిసీవర్ ఏర్పాటు చేస్తారు. వాహనాలు వచ్చినప్పుడు ఈ సెన్సార్లు గుర్తించి గ్రీన్లైటును వెలిగిస్తాయి. మనం సెట్ చేసిన దాని ప్రకారం 10 సెకన్లకు ఒకసారి నాలుగు పక్కలా రౌండ్ ది క్లాక్ క్రమంలో సిగ్నల్ లైట్లు పడతాయి. ఒక మార్గంలో వాహనాలేవీ లేకపోతే వాహనాల ఉన్న మార్గంలోని ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంబులెన్స్‌లో ట్రాన్స్‌మీటర్‌ను అమరిస్తే, ట్రాఫిక్ సిగ్నల్‌కు 200 మీటర్ల దూరంలో ఉండగానే అంబులెన్స్ డ్రైవర్ ట్రాన్స్‌మీటర్ స్విచ్‌ను ఆన్‌చేస్తే ట్రాఫిక్సిగ్నల్ వద్ద ఉన్న రిసీవర్ దానిని స్వీకరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తుంది. అంబులెన్స్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. మనం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో కూడా తెలుసుకునే పరికరాన్ని విద్యార్థులు రూపొందించారు. దీనికి గాను ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీపీఎస్ ఆధారిత పరికరాన్ని ఏర్పాటు చేసి, అందులో సిమ్‌ను ఏర్పాటు చేయాలి. ఎవరైనా తమ సెల్ నుంచి టీడీ (ట్రాఫిక్ డెన్సిటీ) అని టైప్ చేసి దానికి మెసేజ్ పంపితే అది తిరిగి ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది మెసేజీ రూపంలో పంపుతుంది. -
డీఏఆర్‌లో విద్యార్థులకు.....
డీఏఆర్‌లో విద్యార్థులకు ఆటల పోటీలు నూజివిడు : కృష్ణా విశ్వవిద్యాలయం జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) యువజనోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని డీఏఆర్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి వీ స్వాములు ఆధ్వర్యంలో చిత్రలేఖనం, రంగోలి, మిమిక్రీ, మోనోయాక్షన్, క్లాసికల్‌డ్యాన్స్, సోలోసాంగ్స్, వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్ తదితర విభాగాల్లో పోటీలను నిర్వహించారు. చిత్రలేఖనంలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఎస్ మురళీధర్(పీజీకేంద్రం,నూజివీడు), ఎల్ ఉదయ్‌కుమార్(డీఏఆర్), రంగోళీలో ఎం స్వాతి(పీజీ కేంద్రం), డీ స్వరూప(పీజీకేంద్రం), సోలోసాంగ్స్లో పీ లక్ష్మి(డీఏఆర్), ఎల్ఎన్వీ నీరజ(డీఏఆర్), క్లాసికల్ డ్యాన్స్‌లో డీ విజయలక్ష్మి(పీజీ కేంద్రం), పీ మాలాశ్రీ(డీఏఆర్), మిమిక్రీలో ఎం శరత్సూర్య(పీజీ కేంద్రం), కే సతీష్(డీఏఆర్), ఏకపాత్రాభినయంలో డీ పుల్లారావు(పీజీ కేంద్రం), వీ హరిత, వ్యాస రచనలో జీ అనూష(పీజీ కేంద్రం), ఎం వేణు(పీజీ కేంద్రం), పాటలపోటీలలో జీ శ్రీకాంత్(పీజీ కేంద్రం), కే సతీష్(డీఏఆర్)లు నిలిచారు. ప్రథమస్థానంలో నిలిచిన వారందరికీ ఈనెల 15న మచిలీపట్నంలో నిర్వహించే కృష్ణావిశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
ఫలితాల్లో ‘ట్ర’బుల్ ఐటీ
= ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత 55 శాతమే = మెకానిక్స్లోనే ఎక్కువ మంది ఫెయిల్ నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రతిష్ట రానురాను మసకబారుతోంది. పదో తరగతిలో మండలస్థాయిలో ప్రథమస్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపికచేసి, వారిని 24 గంటలు తమ దగ్గరే ఉంచుకుని, వారికి ఐఐటీలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రొఫెసర్లుగా నియమించి విద్యాబోధన చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం సాధారణ ఇంజినీరింగు కళాశాలల కంటే దారుణంగా ఉంటున్నాయి. నూజివీడు, న్యూస్‌లైన్ : స్థానిక ట్రిపుల్ ఐటీలో గత నెలలో నిర్వహించిన తొలిసెమిస్టర్ ఫలితాల్లో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఘోరంగా ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం 55 శాతంగా మాత్రమే. 970 మంది ఇంజినీరింగు ప్రథమ సంవత్సర విద్యార్థులు నవంబర్‌లో నిర్వహించిన సెమిస్టర్ పరీక్షలు రాశారు. వారిలో 536 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 434 మంది ఫెయిలయ్యారు. అత్యధికంగా మెకానిక్స్ సబ్జెక్టులో 195 మంది విద్యార్థులు తప్పారు. ఆ తరువాత స్థానాల్లో ఎలక్ట్రికల్ టెక్నాలజీలో 116 మంది, గణితంలో 118 మంది ఫెయిల య్యారు. ఇంత దారుణ ఫలితాలు ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసిన ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదురవలేదు. పీయూసీదీ అదే పరిస్థితి పీయూసీ-1 ఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. 986 మంది విద్యార్థులు ప్రథమ సెమిస్టర్ పరీక్షలు రాయగా 759 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 77. ఫెయిలైన 227మందిలో ఒక సబ్జెక్టు తప్పిన విద్యార్థులు 144 మంది, రెండు సబ్జెక్టులు తప్పినవారు 60 మంది, మూడు సబ్జెక్టులు తప్పిన వారు 23 మంది. పీయూసీ-2 తప్పిన వారందరికీ ఈ నెలాఖరులో రెమీడియల్ పరీక్షలు నిర్వహించనున్నారు. లోపం ఎక్కడ..! దేశంలోని ఐఐటీల్లో చదివిన వారిని ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి నియమించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులందరూ పదో తరగతిలో 530 మార్కుల కంటే ఎక్కువ సాధించి, మండలస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారే. అయినప్పటికీ ఇంజినీరింగు ప్రథమ సంవత్సరంలో కేవలం 55 శాతం ఫలితాలు మాత్రమే రావడం విస్మయాన్ని కలిగిస్తోంది. నాలుగేళ్లుగా ఇంజినీరింగు ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగు మెకానిక్స్, ఎల క్ట్రికల్ టెక్నాలజీ సబ్జెక్టుల్లోనే ఎక్కువ మంది ఫెయిలవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో గుర్తించి, సరిచేయకపోవడం వల్లే ఏటా ఈ సబ్జెక్టు విద్యార్థులకు గండంగా మారింది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన లెక్చరర్ల బోధన కూడా సరిగా ఉండక, వారు చెప్పేది అర్థంకాక తప్పుతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. కొంత మంది ఫ్యాకల్టీలు, లెక్చరర్లు రెగ్యులర్‌గా క్లాసులకు హాజరుకావడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనుంచైనా ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి, వాటిపై శ్రద్ధ తీసుకుంటనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. లేకుంటే ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట మసకబారడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సంబంధంలేని సబ్జెక్టులే కారణం ట్రిపుల్ ఐటీలో బోధిస్తున్న సబ్జెక్టులు ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధం లేనివే. ఈ కారణంగానే ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. అయినా వీరికి త్వరలోనే రెమీడియల్స్ (సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహిస్తున్నాం. - ఇబ్రహీంఖాన్, ట్రిపుల ఐటీ డెరైక్టర్ -
నూజివీడుతో అనుబంధం తీయనైనది :ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
నూజివీడు, న్యూస్‌లైన్ : నూజివీడుకు, తనకు మధ్య స్నేహవారధిని కట్టిన గొప్ప వ్యక్తి ఎంవీఎల్ అని, ఆయన లేకుండా ఇక్కడకు రావడం ఏదో కోల్పోయినట్లుగా ఉందని ప్రముఖ సినీ గాయకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎల్ఐసీ ఎంప్లాయీస్ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్ వార్షికోత్సవం స్థానిక ఎమ్మార్ ఏఆర్ పీజీ కేంద్రం ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నూజి వీడుతో తన అనుబంధం తీయనైనది, విడదీయలేనిదన్నారు. ఎంవీఎల్ జీవించి ఉన్నంత వరకు ఏటా ఇక్కడకు వచ్చేవాడినన్నారు. ఇప్పటికీ వీలు దొరికితే నూజివీడు రావాలనిపిస్తుందన్నారు. ప్రభుత్వం ఎన్నో విదేశీ సంస్థలకు దార్లు తెరిచినా ఎల్ఐసీపై ప్రజల్లో ఉన్న నమ్మకం అణువంతైనా తగ్గలేదన్నారు. ప్రజలలో నమ్మకాన్ని కలిగించి, దానిని వమ్ము చేయకుండా ఉండబట్టే ఈ సంస్థను ఎంతోమంది ఖాతాదారులు ఆదరిస్తున్నారన్నారు. ప్రపంచంలో సంపూర్ణ కళాకారులు లేరని, అతి తక్కువ తప్పులు చేసేవారే గొప్ప కళాకారులన్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసీ ఉద్యోగులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఘనం గా సన్మానించారు. ఎల్ఐసీ ఉద్యోగులకు నిర్వహించిన పలు అంశాలలో విజేతలకు బాలసుబ్రహ్మణ్యం చేతుల బహుమతులను అందజేశా రు. ఈ సందర్భంగా పలువురు గాయకు లు ఆలపించిన గీతాలు, విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆహూ తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రామకృష్ణానంద్, పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి ఎంవీ బసవేశ్వరరావు, విజయవాడ క్లబ్ సెక్రటరీ ఎం కమలాకాంత్, ప్రముఖ పారిశ్రామికవేత్త మూల్పూరి లక్ష్మణస్వామి, నూజివీడు, ముసునూరు తహశీల్దార్లు కేబీ సీతారామ్, డీఎస్ శర్మ, సీనియర్ బ్రాంచి మేనేజర్ పీ కృష్ణ, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు. -
లక్కీనంబర్ 6666 @ రూ.1.51 లక్షలు
నూజివీడు ఎంవీఐ కార్యాలయంలో పలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించారు. ఏపీ సీజీ శ్రేణిలో 6666 నంబరు కోసం అధిక పోటీ జరిగింది. దీని కోసం ముగ్గురు బిడ్ వేశారు. ఈ నంబరు బేసిక్ మొత్తం రూ.30వేలు కాగా, హనుమాన్జంక్షన్కు చెందిన చలమలశెట్టి రమేష్ అత్యధికంగా రూ.1,21,300లకు బిడ్‌వేయగా ఆయనకు నంబర్ ఖరారైంది. దీనికి బేసిక్ మొత్తాన్ని కలిపితే రూ.1.51లక్షలకు రమేష్ నంబర్ దక్కించుకున్నట్టయింది. ఇదే నంబరుకోసం ముసునూరుకు చెందిన పాల డుగు నాగభరత్ రూ.45వేలకు, నూజివీడు మండలం యనమదలకు చెందిన జి.కృష్ణారావు 37,777కు బిడ్లు వేశారు. అలాగే 6667 నంబరును ఆగిరిపల్లి మండలం శోభనాపురానికి చెందిన డి.శ్రీహర్ష రూ.35వేలకు, 6669 నంబరును నూజివీడుకు చెందిన కె.వి.రమేష్‌కృష్ణ రూ.42,625కు, 6677 నంబరును హనుమాన్జంక్షన్కు చెందిన టి.ఎల్.వి. రమేష్ రూ.10,100కు, 6678 నంబరును హనుమాన్జంక్షన్కు చెందిన ఎం.రాఘవరావు రూ.12,010కి దక్కించుకున్నారు. మొత్తంమ్మీద ఈ ఫ్యాన్సీ నంబర్ల వల్ల స్థానిక కార్యాలయానికి రూ.21,51,730 ఆదాయం వచ్చింది. -
'జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరింది'
నూజివీడు: వైఎస్ జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఆనాడు జగన్ జైల్లో ఉన్నారు కాబట్టే షర్మిల ప్రజల కోసం, పార్టీ తరఫున పాదయాత్ర చేశారని తెలిపారు. అవసరమైనప్పుడు షర్మిల మళ్లీ ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. కుటుంబ సభ్యులను, నమ్మినవారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారంతో వైఎస్సార్ సీపీని దెబ్బతీయలేరని అన్నారు. తమ పార్టీ సీమాంధ్రలో 150, తెలంగాణలో 25 సీట్లకు పైగా సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో నేడు జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు.