
కృష్ణాజిల్లాలో టీడీపీ నాయకురాలి దాష్టీకం
కృష్ణాజిల్లా: నూజివీడులో టీడీపీ మహిళా కార్యదర్శి రాణీసింగ్ దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక సూపర్ బజార్లో పనిచేస్తున్న ఓ బాలికను రాణీసింగ్ తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు చెప్పుతో కొట్టింది. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక అదే సూపర్ బజార్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసుల తీరు విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. రాణీసింగ్పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. టీడీపీ నాయకురాలిని శిక్షించడంతో పాటు బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.