నూజివీడు ఎంవీఐ కార్యాలయంలో పలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించారు. ఏపీ సీజీ శ్రేణిలో 6666 నంబరు కోసం అధిక పోటీ జరిగింది. దీని కోసం ముగ్గురు బిడ్ వేశారు. ఈ నంబరు బేసిక్ మొత్తం రూ.30వేలు కాగా, హనుమాన్‌జంక్షన్‌కు చెందిన చలమలశెట్టి రమేష్ అత్యధికంగా రూ.1,21,300లకు బిడ్‌వేయగా ఆయనకు నంబర్ ఖరారైంది. దీనికి బేసిక్ మొత్తాన్ని కలిపితే రూ.1.51లక్షలకు రమేష్ నంబర్ దక్కించుకున్నట్టయింది.
ఇదే నంబరుకోసం ముసునూరుకు చెందిన పాల డుగు నాగభరత్ రూ.45వేలకు, నూజివీడు మండలం యనమదలకు చెందిన జి.కృష్ణారావు 37,777కు బిడ్‌లు వేశారు. అలాగే 6667 నంబరును ఆగిరిపల్లి మండలం శోభనాపురానికి చెందిన డి.శ్రీహర్ష రూ.35వేలకు, 6669 నంబరును నూజివీడుకు చెందిన కె.వి.రమేష్‌కృష్ణ రూ.42,625కు, 6677 నంబరును హనుమాన్‌జంక్షన్‌కు చెందిన టి.ఎల్.వి. రమేష్ రూ.10,100కు, 6678 నంబరును హనుమాన్‌జంక్షన్‌కు చెందిన ఎం.రాఘవరావు రూ.12,010కి దక్కించుకున్నారు. మొత్తంమ్మీద ఈ ఫ్యాన్సీ నంబర్ల వల్ల స్థానిక కార్యాలయానికి రూ.21,51,730 ఆదాయం వచ్చింది.