
సాక్షి, విజయవాడ : టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై వైఎస్సార్‌సీపీ నేత, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, మాటల్ని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా నూజివీడుకి ఏం చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసు. అధికార పార్టీ ఇన్‌చార్జిగా నువ్ ఏం చేశావో కూడా ప్రజలకు తెలుసు. అసలు నీ స్వగ్రామం ఎక్కడ..? ఎక్కడ నుంచి వచ్చావో తెలియని నువ్వు నాపై విమర్శలు చేస్తావా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా. రాజకీయాల్లో ఉంటూ ముందు గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. నూజివీడు ప్రజలు నిన్ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’ అని వెంకట ప్రతాప్ హెచ్చరించారు. కాగా, నూజివీడులో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే మద్దరబోయిన పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment