Meka Venkata Pratap
-
ఎమ్మెల్యేకి కరోనా: సీఎం జగన్ పరామర్శ
మడకశిర : అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి కరోనా పాజిటివ్ రావడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఫోన్లో ఆయనను పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్యం పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి డాక్టర్లతో కూడా ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ స్వామిదినేష్తో కూడా ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు కరోనా పాజిటివ్ నూజివీడు: నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు నెలలుగా ప్రజాహిత కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న ఎమ్మెల్యే ప్రతాప్ రెండు రోజుల కిందట కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎమ్మెల్యే ప్రతాప్ చెప్పారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా అత్యవసరమైతే ఫోన్లో తనను సంప్రదించవచ్చన్నారు. ఎవరికైనా పనులుంటే పట్టణంలోని తన కార్యాలయానికి వెళ్లి కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారన్నారు. -
అసలు నీ ఊరెక్కడా.. ఏం మాట్లాడుతున్నావ్..!
సాక్షి, విజయవాడ : టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై వైఎస్సార్సీపీ నేత, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, మాటల్ని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా నూజివీడుకి ఏం చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసు. అధికార పార్టీ ఇన్చార్జిగా నువ్ ఏం చేశావో కూడా ప్రజలకు తెలుసు. అసలు నీ స్వగ్రామం ఎక్కడ..? ఎక్కడ నుంచి వచ్చావో తెలియని నువ్వు నాపై విమర్శలు చేస్తావా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా. రాజకీయాల్లో ఉంటూ ముందు గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. నూజివీడు ప్రజలు నిన్ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’ అని వెంకట ప్రతాప్ హెచ్చరించారు. కాగా, నూజివీడులో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే మద్దరబోయిన పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. -
హోదా తీసుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ జగన్
-
‘జగన్‌ని సీఎం చేసే వరకు కృషి చేస్తాం’
సాక్షి, కృష్ణా(నూజివీడు): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో జనసంద్రమైంది. సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు కృషి చేస్తామన్నారు. 150 సీట్లకు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూజివీడుకి ట్రిపుల్ ఐటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని గుర్తుచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ తాగునీటి సమస్య లేకుండా చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ నేత కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పారు. పోలవరం, రాజధానులు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. -
నూజివీడు ఎమ్మెల్యేకి సతీ వియోగం
నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి మేకా సుజాతాదేవి (56) ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో నూజివీడులోని స్వగృహంలో కన్నుమూశారు. రోజూ వేకువజామునే నిద్రలేచే ఆమె తెల్లవారిన తరువాత కూడా లేవకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక అమెరికన్ ఆస్పత్రి వైద్యులను పిలిపించారు. వారు వచ్చి పరీక్షించి ఆమె మృతిచెందినట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్‌చేసి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. తన సంతాపం తెలిపారు. విషాద సమయంలో మనోధైర్యంతో ఉండాలన్నారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌చేసి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. తన సానుభూతి తెలిపారు. నేడు నూజివీడుకు వై.ఎస్.జగన్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ సోమవారం నూజివీడు వస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నూజివీడు వస్తారని చెప్పారు. సుజాతాదేవి పార్థివదేహానికి నివాళులర్పించి, ప్రతాప్‌తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించిన తరువాత హైదరాబాద్ వెళతారని తెలిపారు.