నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని స్టార్ సూపర్ మార్కెట్లో గురువారం ఆర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు వెనుక భాగంలో కిటీకీ తలుపులు బద్దలు కొట్టుకుని దొంగలు లోపలికి ప్రవేశించారు. రూ. 40 వేలు, విలువైన వస్తువులతోపాటు సీసీ కెమెరా, కంప్యూటర్‌ను అపహరించుకుని పోయారు.
శుక్రవారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన షాపు సిబ్బంది... యజమానికి సమాచారం అందించారు. యజమాని షాపు వద్దకు చేరుకుని... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా షాపునకు చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.