సాక్షి, విజయవాడ: ఉయ్యూరులో ప్రభుత్వ కార్యాలయాలు మార్పు విషయంలో వైఎస్సార్ సీపీ నేతల ఆందోళనతో అధికారులు దిగొచ్చారు.జాతీయ రహదారి వెడల్పు చేసే క్రమంలోనే ఉయ్యూరులోని ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలతో పాటుగా పోలీస్ స్టేషన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. కార్యాలయాల ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం కొంత మంది రైతులు వద్ద భూమిని సేకరిస్తున్నామని నూజివీడు ఆర్డీవో రంగయ్య తెలిపారు. ఓ రైతు కార్యాలయాల ఏర్పాటుకు ఎకరం 30 సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు కోరినట్లుగానే అందరి ఆమోదంతోనే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ నిర్మించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్డీవో రంగయ్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment