సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న అసని తుపాన్ బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చనుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. విశాఖకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఈరోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం కూడా ఉంది. తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
ఒక్కసారిగా మారిన వాతావరణం
అసని తుఫాన్ ఎఫెక్ట్‌తో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు మండలాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విజయవాడలో ఆకాశం మేఘావృతమై, భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, గంపలగూడెం మండలాల్లోని పలుగ్రామాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా మామిడి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
చదవండి: (అకాల వానలు, పిడుగులు.. ఆ సమయాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి)
Comments
Please login to add a commentAdd a comment