'జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరింది' | Sharmila will be active again whenever it is required, says Ambati Rambabu | Sakshi
Sakshi News home page

'జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరింది'

Published Mon, Nov 25 2013 2:58 PM | Last Updated on Fri, May 25 2018 7:29 PM

'జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరింది' - Sakshi

'జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరింది'

నూజివీడు: వైఎస్‌ జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఆనాడు జగన్ జైల్లో ఉన్నారు కాబట్టే షర్మిల ప్రజల కోసం, పార్టీ తరఫున పాదయాత్ర చేశారని తెలిపారు. అవసరమైనప్పుడు షర్మిల మళ్లీ ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు.

కుటుంబ సభ్యులను, నమ్మినవారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారంతో వైఎస్సార్ సీపీని దెబ్బతీయలేరని అన్నారు. తమ పార్టీ సీమాంధ్రలో 150, తెలంగాణలో 25 సీట్లకు పైగా సాధిస్తుందని ఆయన విశ్వాసం  వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో నేడు జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement