
విద్యార్థి ఆత్మహత్యతో కలకలం
- ఫోన్ మాయంపై వాదులాడుకున్న విద్యార్థులు
- హత్యేనంటున్న కుటుంబ సభ్యులు
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎంఎంఈ బ్రాంచికి చెందిన వికలాంగ విద్యార్థి వెంట్రపాటి శ్రీకాంత్ ప్రసన్నకుమార్ ఆత్మహ త్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృ ష్టించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ఐ-2 బ్లాక్‌లోని హాస్టల్ భవనం నాలుగో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కింద పడిన శబ్దానికి విద్యార్థులు లేచి కిందకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో అతడిని క్యాంపస్‌లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో ట్రిపుల్‌ఐటీ అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ వైద్యులు పరీక్షించి, చనిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. వారు అందించిన సమాచారంతో ఇన్‌చార్జి డెరైక్టర్ కోసూరి హనుమంతరావు ఏవో పరిమి రామనరసింహం, పీఆర్వో వీరబాబుతో కలసి ఏరియా ఆస్పత్రికి వచ్చారు. శ్రీకాంత్ తండ్రి శ్రీ హరిబాబుకు ట్రిపుల్‌ఐటీ పీఆర్వో వీరబాబు ఫోన్ చేసి, ‘మీ కుమారుడికి సీరియస్‌గా ఉంది’ అని సమాచారమిచ్చారు.
ఆస్పత్రి నుంచి సమాచారం రావడంతో పట్టణ ఎస్సై బోనం ఆదిప్రసాద్ సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం హాస్టల్‌కు వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి రూమ్‌మేట్లనుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. శ్రీకాంత్ స్వ గ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు. పేద కుటుంబానికి చెందిన ఇతడు వికలాంగుల కోటాలో ట్రిపుల్‌ఐటీకి ఎంపికయ్యాడు. తండ్రి శ్రీహరిబాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు.
రాత్రి 11.30 గంటల వరకు వాదన
శ్రీకాంత్‌కు స్నేహితుడైన ప్రవీణ్ అనే విద్యార్థికి చెందిన ఫోన్ రెండురోజుల క్రితం పోయింది. గతంలో సెల్‌ఫోన్లను తస్కరించిన సంఘటనలకు పాల్పడిన నేపథ్యంలో శ్రీకాంత్‌పై అతడికి అనుమానం కలిగింది. తాజా ఘటనపై వారి ద్దరితో పాటు మరికొంతమంది విద్యార్థుల మధ్య హాస్టల్‌రూంలో రాత్రి 11.30 గంటల వ రకు వాదన జరిగింది. ఈ విషయాన్ని ప్రవీణ్ 11గంటల సమయంలో శ్రీకాంత్ తండ్రికి ఫోన్‌చేసి తెలిపాడు. దానికి ఆయన రేపు వాళ్ల అమ్మను పంపిస్తానని, గొడవ పడవద్దని కూడా చెప్పినట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. ఈ విషయం కేర్‌టేకర్ దృష్టికి కూడా వెళ్లగా, ఆ యన కూడా రేపు దాని గురించి మాట్లాడదామ ని, పడుకోమని తెలపడంతో విద్యార్థులు నిద్రపోయారు. తరువాత 1.30 గంటల సమయం లో ఆత్మహత్య ఘటన జరిగింది.
పెళ్లైన పదేళ్లకు పుట్టాడు
హరిబాబు, సుశీలకు పెళ్లైన పదేళ్లకు పుట్టిన శ్రీకాంత్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నామ ని, ట్రిపుల్‌ఐటీలో సీటు వస్తే ప్రయోజకుడవుతాడని భావించామని, ఇలా శవాన్ని తీసుకెళ్లా ల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని మృతుడి మేనమామ, బాబాయి, తాత వాపోయారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి సుశీల కన్నీరుమున్నీరైంది. ప్రస్తుతం విధి నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఉన్న మృతుడి తండ్రి శ్రీహరిబాబుకు ఈ విషయం తెలియడంతో హుటాహుటిన నూజివీడు బయలుదేరాడని బంధువులు తెలిపారు.
ఘటనాస్థలిని పరిశీలించిన సబ్‌కలెక్టర్
ఈ ఘటన గురించి తెలిసిన ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ ఎన్.రమేష్‌కుమార్ ట్రిపుల్ ఐటీకి వచ్చి హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఇన్‌చార్జి డెరైక్టర్ కె. హనుమంతరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశీల్దార్ షేక్ ఇంతియాజ్‌పాషా, ఎస్సై బి.ఆదిప్రసాద్ ఉన్నారు. డీఎస్పీ జె.సీతారామస్వామి కూడా ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యార్థులే కొట్టి చంపారు : మృతుడి బంధువుల ఆరోపణ
శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, విద్యార్థులే కావాలని కొట్టి చంపారని ఆరోపించారు. ఏదైనా జరిగితే డెరైక్టర్ దృష్టికి గానీ, బాధ్యత కలిగిన అధికారి దృష్టికి గానీ విషయాన్ని తీసుకెళ్లాల్సి ఉందన్నారు. ఇలా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. బిల్డింగ్‌పైన ఐదు అడుగుల ఎత్తు ఉన్న పిట్టగోడను శ్రీకాంత్ ఎక్కలేడని, హత్యచేసి మాయ చే యాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇంత చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంటారా? అని శ్రీకాంత్ బంధువులు ప్రశ్నిస్తున్నారు.