
సాక్షి, కృష్ణా జిల్లా: నూజివీడు మెడికల్ షాపుల్లో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మందు బాబులు ఈ మధ్య కాలంలో శానిటైజర్లు సేవించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. శానిటైజర్లు అధికంగా కొనుగోలు చేసే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శానిటైజర్ల అమ్మకానికి ప్రత్యేక రికార్డు మెయింటెన్ చేయాలని షాపుల యజమానులకు పోలీసులు సూచించారు.
ప్రకాశం: జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, మార్కాపురం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉదయం పొదిలి మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేని శానిటైజర్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment