విజయవాడ: నూజివీడు - హనుమాన్ జంక్షన్ రహదారిలోని మీర్జాపురం వద్ద గురువారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల క్యాట్ ఫిష్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గరు వ్యక్తులతోపాటు లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. క్యాట్ ఫిష్ను కైకలూరు నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు నిందితులు తమ దర్యాప్తులో వెల్లడించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.