దొంగతనమే ప్రాణాలు తీసింది
దొంగతనానికి వచ్చిన వ్యక్తిని గ్రామస్తులు చితకబాదడంతో మృతి చెందిన సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలం అన్నవరంలో గురువారం తెల్లవారుజామునా చోటు చేసుకుంది. గత అర్థరాత్రి ఐదుగురు దొంగలు అన్నవరంలోని ఇళ్లలో చోరీకి యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమైయ్యారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని... కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు.
దాంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు దొంగలు పరారైయ్యారు. ఆ ఘటనపై అన్నవరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.