Thief killed
-
ప్రాణం తీసిన కోళ్ల చోరీ
నూజివీడు: కోడి పుంజులను దొంగిలించడానికి వచ్చాడనుకుని ఓ యువకుడిని చితకబాదడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. ఏలూరు జిల్లా నూజివీడులో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నూజివీడులోని పాతపేటకు చెందిన సయ్యద్ గయాజుద్దీన్ ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద కోడి పుంజులను పెంచుతున్నాడు. అక్కడికి అదే కాలనీకి చెందిన లాకే అవినాష్ (22) శనివారం అర్ధరాత్రి వెళ్లాడు. దీంతో అతను కోడి పుంజులను దొంగిలించడానికి వచ్చాడనుకుని గయాజుద్దీన్ పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఆ తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేయగా, 10 మంది వచ్చారు. అందరూ కలిసి అవినాష్‌పై దాడి చేయగా అతడు స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం వారు అతని అన్నకు ఫోన్ చేసి.. మీ తమ్ముడిని తీసుకువెళ్లాలని చెప్పారు. అవినాష్ అన్న అఖిలేష్ ఘటనాస్థలానికి చేరుకుని తమ్ముడిని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అవినాష్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. అఖిలేష్ ఫిర్యాదు మేరకు సీఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గయాజుద్దీన్,మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
వరంగల్‌లో దొంగ దారుణ హత్య
వరంగల్ సిటీ: వరంగల్ నగరంలో ఓ దొంగ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన తైదాల సాంబయ్య అనే వ్యక్తి దొంగతనాలు చేయడంతోపాటు కూలీల వద్ద పత్తి, మిర్చి, ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటాడు. అలాగే మార్కెట్ సమీపంలోని బాలాజీనగర్‌కు చెందిన పత్రి కుమార్ కూడా ఇదే వృత్తిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి పలుమార్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం గంధం నరేశ్, సోమేశ్వర్ సాయంతో సాంబయ్యను చంపాలని కుమార్ పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో దయానందకాలనీకి వెళ్తున్న సాంబయ్యను బలవంతంగా వీరు ఆటోలో ఎక్కించుకున్నారు. కోటి లింగాల రోడ్డుపైపు తీసుకెళ్లి కొట్టి దారుణంగా చంపారు. సాంబయ్య మొండెం, తలను వేర్వేరు చేసి గోనె సంచుల్లో మూట కట్టారు. మొండెంను మార్కెట్ గేటు సమీపంలో, తలను కాశీబుగ్గ జంక్షన్లో వదిలేశారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్యకు పాతకక్షలే కారణమని స్థానికులు తెలిపారు. -
దొంగతనానికి వెళ్తె చనిపోయేలా కొట్టారు
బాలానగర్: చోరీకి వచ్చిన వ్యక్తిని పట్టుకొని చితకబాదటంతో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరి గింది. సీఐ పెండ్యాల భిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా పెదకొత్తపల్లి మండలానికి చెందిన పగడాల రాము(20) తల్లిదండ్రులతో కలిసి బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్‌లో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. ఇతను పాతనేరస్తుడు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇదిలా ఉండ గా... బుధవారం రాత్రి రాము తన నివాసానికి సమీపంలో ఉండే రాములు ఇంట్లో చొరబడి చోరీకి యత్నించగా ఆ ఇంట్లో వారు పట్టుకున్నారు. అతడిని బంధించి చితకబాదారు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాము మృతి చెందాడు. మృతుడి తండ్రి శేషయ్య ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగతనమే ప్రాణాలు తీసింది
దొంగతనానికి వచ్చిన వ్యక్తిని గ్రామస్తులు చితకబాదడంతో మృతి చెందిన సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలం అన్నవరంలో గురువారం తెల్లవారుజామునా చోటు చేసుకుంది. గత అర్థరాత్రి ఐదుగురు దొంగలు అన్నవరంలోని ఇళ్లలో చోరీకి యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమైయ్యారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని... కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. దాంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు దొంగలు పరారైయ్యారు. ఆ ఘటనపై అన్నవరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.