
రాము(ఫైల్)
బాలానగర్: చోరీకి వచ్చిన వ్యక్తిని పట్టుకొని చితకబాదటంతో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరి గింది. సీఐ పెండ్యాల భిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా పెదకొత్తపల్లి మండలానికి చెందిన పగడాల రాము(20) తల్లిదండ్రులతో కలిసి బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్‌లో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు.
ఇతను పాతనేరస్తుడు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇదిలా ఉండ గా... బుధవారం రాత్రి రాము తన నివాసానికి సమీపంలో ఉండే రాములు ఇంట్లో చొరబడి చోరీకి యత్నించగా ఆ ఇంట్లో వారు పట్టుకున్నారు. అతడిని బంధించి చితకబాదారు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాము మృతి చెందాడు. మృతుడి తండ్రి శేషయ్య ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.