
వరంగల్ సిటీ: వరంగల్ నగరంలో ఓ దొంగ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన తైదాల సాంబయ్య అనే వ్యక్తి దొంగతనాలు చేయడంతోపాటు కూలీల వద్ద పత్తి, మిర్చి, ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటాడు. అలాగే మార్కెట్ సమీపంలోని బాలాజీనగర్‌కు చెందిన పత్రి కుమార్ కూడా ఇదే వృత్తిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి పలుమార్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఆదివారం సాయంత్రం గంధం నరేశ్, సోమేశ్వర్ సాయంతో సాంబయ్యను చంపాలని కుమార్ పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో దయానందకాలనీకి వెళ్తున్న సాంబయ్యను బలవంతంగా వీరు ఆటోలో ఎక్కించుకున్నారు. కోటి లింగాల రోడ్డుపైపు తీసుకెళ్లి కొట్టి దారుణంగా చంపారు. సాంబయ్య మొండెం, తలను వేర్వేరు చేసి గోనె సంచుల్లో మూట కట్టారు. మొండెంను మార్కెట్ గేటు సమీపంలో, తలను కాశీబుగ్గ జంక్షన్‌లో వదిలేశారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్యకు పాతకక్షలే కారణమని స్థానికులు తెలిపారు.