సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(సీఈసీ) హైకోర్టు బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియోజకవర్గ పోలింగ్‌కు సంబంధించి అన్నీ వీవీ ప్యాట్‌లను లెక్కించేలా ఆదేశాలివ్వాలంటూ ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసి ఓడిన బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment