Ibrahampatnam
-
‘పట్నం’లో టైట్ ఫైట్! కాంగ్రెస్ నలభై ఏళ్ల కల.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం వల!
సాక్షి, రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం: 'విప్లవాల పురిటిగడ్డ.. కమ్యూనిస్టుల కంచుకోట.. రాచకొండ గుట్టలు నిలయంగా సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం.. నియోజకవర్గ సొంతం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందుగానే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఉండేది. అంతటి చరిత్ర కలిగిన ఈ గడ్డపై ప్రధాన పార్టీలన్నీ తమ జెండాలుఎగురవేశాయి.' నగరానికి ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలు కాలానుగునంగా తమ ప్రాబల్యాన్ని చాటాయి. ఈ సెగ్మెంట్ హస్తం చేజారి రనాలుగు దశబ్దాలు కావొస్తుండగా.. టీడీపీ, సీపీఎంలు మూడు దశాబ్ధాలుగా విజయం సాధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ‘కారు’ 2018లో బోణీ కొట్టింది. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ఉండేది. ఇప్పటి వరకు 16సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, మూడుసార్లు సీపీఎం, ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1978 నుంచి 2004 వరకు ఈ స్థానం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన 11మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే అమాత్య పదవి వరించింది. 15ఏళ్ల పాటు సీపీఎం ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గాన్ని శాసించారు. రోజురోజుకు కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతుంది. కాంగ్రెస్, టీడీపీల పొత్తుల ప్రభావం కారణంగా కమ్యూనిస్టుల ప్రాబ ల్యం మసకబారింది. 1952లో ద్విసభ్య శాసనసభ్యులు.. 1952లో జరిగిన ఈ ఎన్నికల్లో ద్విసభ్య శాసనసభ నియోజకవర్గంగా ఉండేది. తూర్పు, పడమటి ప్రాంతాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించేవారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో 1952 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ నుంచి పిల్లయిపల్లి పాపిరెడ్డి (తూర్పు భాగం), కాంగ్రెస్ నుంచి ఎంబీ గౌతమ్ పడమటి బాగం(ఇబ్రహీంపట్నం ప్రాంతం) నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు.1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన అనంతరం ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. ఇద్దరు అభ్యర్థులను వరించిన హ్యాట్రిక్! 1952 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంబీ గౌతమ్, పీడీఎఫ్ నుంచి పిలాయిపల్లి పాపిరెడ్డి, 1957, 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన లక్ష్మీనర్సయ్య హ్యాట్రిక్ విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో హస్తంపై అనంతరెడ్డి గెలుపొందింది. 1978 నుంచి ఎస్సీ రిజర్డ్వ్ స్థానంగా మారింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుమిత్రదేవి అసెంబ్లీ మెట్లెక్కారు. ఆమె మృతి చెందడంతో 1981లో నిర్వహించిన ఉప ఎన్నిక, 1983 సాధారణ ఎన్నికల్లో ఏజీ కృష్ణ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం వీస్తున్న తరుణంలో 1982లో కాంగ్రెస్ జెండా ఎగరడ గమనార్హం. అనంతరం నియోజవర్గ రాజకీయాల్లో మార్పు వచ్చింది. 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికలోనూ కాంగ్రెస్ ఈ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. 1985 ఎన్నికల్లో కె.సత్యనారాయణ టీడీపీ నుంచి గెలుపొందారు. 1989, 1994 ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న సీపీఎం నుంచి కొండిగారి రాములు, 1999లో సైకిల్‌పై కొండ్రు పుష్పలీల, 2004లో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సీపీఎం నుంచి మస్కు నర్సింహ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన సైకిల్ దిగి కారెక్కారు. 2018లో టీఆర్ఎస్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. డీలిమిటేషన్లో మహేశ్వరం, కందుకూరు మండలాల స్థానంలో హయత్‌నగర్ (అబ్దుల్లాపూర్‌మెట్) మండలం ఇందులో కలిసింది. దీంతో 2009 నుంచి మళ్లీ జనరల్ స్థానంగా మారింది. నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు సుమిత్రాదేవి, పుష్పలీల ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించారు. ఇద్దరు మంత్రులు.. నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మంత్రులు పదువులు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన లక్ష్మీనర్సయ్య, టీడీపీ నుంచి ఒకసారి గెలిచిన కొండ్రు పుష్పలీల మంత్రులుగా పనిచేశారు. హస్తంలో గ్రూపు రాజకీయాలు.. 1985 నుంచి కాంగ్రెస్ అపజాయానికి కారణం గ్రూపు రాజకీయాలే. సెగ్మెంట్లో బలమైన పార్టీ కేడర్ ఉన్నా నాయకుల మధ్య సఖ్యత లేక పార్టీ గెలుపునకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ‘కమలం’ తహ తహ! నియోజవకర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ ఏళ్ల నుంచి తహ తహలాడుతోంది. ప్రజల్లో పట్టున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పార్టీకి కేడర్ లేకపోవడం గమనార్హం. ద్విముఖ పోరు.. ‘పట్నం’లో మరోమారు కారు జోరు చూపించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని మల్రెడ్డి రంగారెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కక మల్రెడ్డి రఏనుగు గుర్తుపై పోటీ కేవలం 356 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. దీంతో ఈ ఎన్నికలు మంచిరెడ్డి, మల్రెడ్డి మధ్య హోరాహోరి పోరు జరుగనున్నదని విశ్లేషకులు అంటున్నారు. -
మహిళ కాపురంలో టిక్ టాక్ చిచ్చు
సాక్షి, విజయవాడ: పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’ చిచ్చుపెట్టింది. టిక్ టాక్ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్ మిడియాలో బాగా క్రేజ్ ఉన్న ‘టిక్ టాక్’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి జాఢ్యంలా మారి జీవితాల్లో చిచ్చు పెడుతుంది. తాజాగా ఈ టిక్ టాక్ మాయలో పడి కట్టుకున్న భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని...మొదటి భార్యను కడతేర్చేందుకు సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...విజయవాడ వీటీపీఎస్‌లో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సత్యరాజుతో అనురాధకు పదేళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజులపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవటంతో అనురాధకి కష్టాలు మొదలయ్యాయి. భర్త సూటిపోటీ మాటలతో పాటు, అత్తింటి ఆరళ్ళు పెరిగిపోయాయి. అయినా వాటన్నింటినీ పంటిబిగువున అదిమి పెట్టుకొన్నఅతికష్టం మీద కాలం వెళ్లదీస్తుంది. అయితే టిక్ టాక్‌లో వచ్చిన వీడియోతో భర్త నిజస్వరూపం బయటపడింది. పరస్త్రీతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియోను చూసిన అనురాధ తట్టుకోలేకపోయింది. ఆరాతీస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన వనిత అనే యువతిని తిరుపతిలో వివాహం చేసుకొని వేరుకాపురం పెట్టినట్టు తెలుసుకొంది. ఈ విషయాన్ని నిలదీయడంతో పెద్దల సమక్షంలో తప్పు ఒప్పుకుని, మరోసారి అలా జరగదంటూ ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత తన నిజ స్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఇంకా పిల్లలు లేరంటూ మొదటి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ఎక్కువ కావడంతో మొదటి భార్య తన తల్లిదండ్రులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. -
లాజిస్టిక్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో శుక్రవారం రోజున లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వ కేంద్రం)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో కమర్షియల్ ఆపరేషన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఇబ్రహీంపట్నం ప్రస్తుతం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. హైదరాబాద్ శివారులో విస్తరించడం, ఔటర్ రింగ్‌రోడ్, అనేక కార్పొరేట్ కంపెనీలు ఇక్కడే ఇక్కడే ఏర్పడుతుండడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దేశంలో మొదటి పార్క్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలోనే బాట సింగారంలో మరో లాజిస్టిక్ పార్క్ ప్రారంభం కానుంది. ఎలిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ రానుంది. వ్యవసాయ ప్రాంతాలకు పాలమూరు రంగారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు నీటిని అందిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎనిమిది సార్లు పర్యటించాను. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్ రెడ్డి అని ఎమ్మెల్యేని పొగడ్తలతో ముంచెత్తారు. కుంట్లూర్‌లో ఎస్టీపీ నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తున్నాం. ముచ్చర్లలో ఫార్మా క్లస్టర్ రానుంది. ఫార్మా క్లస్టర్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు రానున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఎన్నో పరిశ్రమలు స్థాపించవచ్చు. మరో ఎనిమిది లాజిస్టిక్ పార్క్ లను నిర్మించనున్నాము. రెండు రైల్వే టర్మినల్స్ వస్తున్నాయి. వాటిని అనుసందానం చేసుకోని పరిశ్రమలు స్థాపించాలి. లాజిస్టిక్ పార్క్‌ల స్థాపనకు మన నగరం అగ్ర భాగంలో ఉంది. మనందరం కోరుకునేది అభివృద్ధి కనుక కొత్త పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చినపుడు మనందరం స్వాగతించాలని' కేటీఆర్ అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీపీపీ మోడ్‌లో నిర్మించిన మొదటి లాజిస్టిక్ పార్క్ ఇది. జిల్లాలోని మున్సిపాలిటీలకు మరిన్ని నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్ రెడ్డి మాట్లాడుతూ.. లాజిస్టిక్ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో ఉన్న ఒక్కో మునిసిపాలిటీకి రూ. పది కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. పరిశ్రమలు స్థాపించడానికి ఇక్కడ అనువైన స్థలాలు ఉన్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మెన్ అనితా రెడ్డి , ఎండీ ఆంకాన్ మాట్లాడుతూ.. జిల్లా వాతావరణం చాలా బాగుంటుంది. లాజిస్టిక్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్పూర్తితో తక్కువ కాలంలోనే పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇందులో ట్రక్ డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ లాజిస్టిక్ పార్క్‌ల ఏర్పాటువల్ల ఇంకా అనేక కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయన్నారు. -
ఈ ప్రాంతాభివృద్ధికి సహకరిస్తా
మంచాల (ఇబ్రహీంపట్నం): చాలారోజుల తర్వాత తన స్వగ్రామానికి రావటం సంతోషంగా ఉందని, ఇబ్రహీంపట్నం ప్రాంతాభివృద్ధికి తాను సహకారం అందిస్తానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు. జస్టిస్ అభిషేక్‌రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా మంచాల మండ లం లింగంపల్లిలో ఆయనకు శనివారం గ్రామస్తులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబం హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ వేసవి సెలవుల్లో తాను ఇక్కడికి వచ్చేవాడినని, అప్పుడు నీటివనరులు బాగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. నాడు ఇబ్రహీంపట్నం పచ్చని పొలాలతో కళకళలాడుతుండేదని, ఇప్పుడా పంటలు, నీటి జాడలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జస్టిస్ అభిషేక్‌రెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. గ్రామస్తులతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీలక్ష్మీ, చీరాల రమేశ్, జంగారెడ్డి, అంజిరెడ్డి తదితరులు జస్టిస్ అభిషేక్‌రెడ్డిని కలసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోద, ఉపసర్పంచ్ స్వాతి, నాయకులు అనిరెడ్డి శ్రీలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. -
ఆరువందలకు పైగా హామీలను ఇచ్చి విస్మరించారు
-
రాక్షస పాలన అంతం చేయండి
పప్పు.. గన్నేరు పప్పు! ‘‘ఇవాళ ఉదయం ఓ అన్న నాతో చెప్పాడు... నారా లోకేష్ పప్పు అయితే ఆయన తండ్రి చంద్రబాబునాయుడు గన్నేరు పప్పు అట. ఈ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రమాదకరమే. రాష్ట్రాన్ని లూటీ చేశారు. నారారూప రాక్షసుల పాలనను అంతమొందించండి’’ – ఇబ్రహీంపట్నం సభలో... పొరపాటున కూడా నమ్మొద్దు ‘‘2014 ఎన్నికలకు ముందు హోదా అన్నావ్.. తర్వాత బీజేపీతో కుమ్మౖక్కై ప్యాకేజీకి ఒప్పుకున్నావ్.. మళ్లీ హోదా అంటున్నావ్. రోజుకో మాట, పూటకో వేషం. ఆయన్ను నమ్మి మళ్లీ మోసపోతే రాష్ట్రం అంధకారమే’’ ఈ అన్న అప్పుడు ఏమయ్యాడు? ‘‘చంద్రబాబు కొత్తగా ఆడపడుచులకు అన్ననని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ రౌడీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లినప్పుడు ఈ అన్న ఎక్కడకు వెళ్లాడు? అంగన్వాడీ కార్యకర్తలను లాఠీలతో చితకబాదితే ఎటు పోయాడు? రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడితే ఏమయ్యాడు? విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం నడిచింది ఈ అన్న కనుసన్నల్లో కాదా? భవానీనగర్‌లో పాఠశాల వద్ద మద్యం దుకాణం తొలగించాలని మహిళలు ధర్నా చేస్తే లాఠీలతో కొట్టించి జైలుకు పంపింది ఈ అన్న కాదా? ఇటువంటి వ్యక్తిని నమ్మి మోసపోవద్దని అక్కచెల్లెమ్మలను హెచ్చరిస్తున్నా’’ – విజయవాడ పంజాసెంటర్ సాక్షి, అమరావతి బ్యూరో: అవినీతి, అబద్ధాలు, అరాచకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మారుపేరని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ఆయన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం కూడా నిర్ధారించారని గుర్తు చేశారు. ‘ఐదేళ్ల బాబు పాలనలో గత 40 ఏళ్లలో చేయనన్ని అప్పులు చేశారని మాజీ సీఎస్‌లు చెబుతున్నారు. తండ్రీ కొడుకులు కలసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’ అని షర్మిల మండిపడ్డారు. రోడ్‌షో, బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం విజయవాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేటలో జరిగిన సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. కాపీ కొట్టి హామీలిస్తున్నారు.. ‘‘వైఎస్సార్ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు భరోసాగా జీవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేశారు. పసుపు–కుంకుమ పేరిట ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు. ఆ డబ్బులు డ్వాక్రా రుణాల వడ్డీకి కూడా సరిపోవు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్ ఆస్పత్రులను తొలగించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆస్పత్రికెళ్లి వైద్యం చేయించుకుంటారా? గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టి కొత్త హామీలిస్తున్నాడు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ తిరుగుతున్న దొంగబాబును ఇంటికి పంపండి. ఐదేళ్ల పాలన గురించి ప్రజలకు చెప్పి ఓట్లడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. హైదరాబాద్ అంతా నేనే కట్టానంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుని సీఎం అయ్యాడు చంద్రబాబు. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తే ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదు. కనీసం ఓ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు. ఆ డబ్బంతా మింగేశారు. ఆయన కోసం మాత్రం హైదరాబాద్‌లో ఒక పర్మినెంట్ బిల్డింగ్ కట్టుకున్నాడు. ఓటు అడిగితే తక్షణమే బకాయిలివ్వమనండి బాబొచ్చాక ఆయన కుమారుడికి తప్పితే జాబులు ఎవరికి వచ్చాయి? జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియని పప్పుగారిని ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. యువతకు మాత్రం ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల బకాయిలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించమని నిలదీయండి. అది మీ హక్కు. కేసీఆర్‌తో చంద్రబాబు కాళ్ల బేరం! ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తుంది. టీడీపీకి ఓటమి తప్పదు. ఇదే విషయాన్ని పలు జాతీయ సర్వే సంస్థలు కూడా తేల్చి చెప్పాయి. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు మాకు ఎవరితోనూ పొత్తులు లేవు. వైఎస్సార్సీపీకి ఆ అవసరం కూడా లేదు. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు జనసేన, కాంగ్రెస్‌లతో కలసి తోడుగా వస్తున్నారు. హరికృష్ణ మృతదేహం సాక్షిగా కనీస ఇంగితం కూడా లేకుండా కేసీఆర్‌తో పొత్తుల కోసం వెంపర్లాడింది చంద్రబాబే. టీఆర్ఎస్తో పొత్తు కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు బాబు. ధర్మాన్ని గెలిపించండి.. పౌరుషం, రోషం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. తండ్రి లాంటి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి కుర్చీని, పార్టీని లాక్కున్నాడు. ఒకవైపు సొంత మామనే మోసగించిన చంద్రబాబు, మరోవైపు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ను వీడి ఒంటరిగా బయటకు వచ్చిన జగనన్న మన ముందు ఉన్నారు. మంచికి, చెడుకు మధ్య యుద్ధం జరుగుతోంది. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటం జరుగుతోంది. విశ్వసనీయత, వెన్నుపోటుకు మధ్య జరుగుతున్న యుద్ధంలో న్యాయం వైపు నిలిచి జగనన్నను గెలిపించండి. జగనన్న తొమ్మిదేళ్లుగా నీతివంతమైన రాజకీయాలు చేశారు. ప్రతి కష్టంలోనూ ప్రజల పక్షాన నిలిచారు. 3,648 కి.మీ పాదయాత్ర చేసి సమస్యలను దగ్గరగా చూశారు. అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలను జగనన్న ఎప్పుడూ ఇవ్వలేదు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. ఈ అవినీతి పాలన అంతం చేయండి. అంతా బైబై బాబు.. అని ప్రజాతీర్పు చెప్పండి’’ -
ఇబ్రహీంపట్నం వీవీ ప్యాట్ల లెక్కింపు వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్ల లెక్కింపుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(సీఈసీ) హైకోర్టు బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియోజకవర్గ పోలింగ్‌కు సంబంధించి అన్నీ వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలివ్వాలంటూ ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసి ఓడిన బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
రంగారెడ్డి: జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే అనంతరెడ్డి(95) ఆదివారం కన్నుమూశారు. రాంకోఠిలోని తన నివాసంలో అనంతరెడ్డి మృతి చెందారు. 1972లో అనంతరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆనంతరెడ్డి స్వగ్రామం యాచారం మండలం చౌదర్ పల్లి గ్రామం. -
ఇబ్రహీంపట్నంలో మళ్లీ పేలుడు
-
ఇబ్రహీంపట్నంలో మళ్లీ పేలుడు
హైదరాబాద్: నగరశివారులోని ఇబ్రహీంపట్నంలో మళ్లీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి ఓ స్కూటర్ డిక్కీ పేలిన అంబేద్కర్ నగర్ ప్రాంతంలోనే ఆదివారం మధ్యాహ్నం మరోసారి గుర్తుతెలియని వస్తువు పేలిపోయింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం నాటి పేలుడులో ఒక వ్యక్తి గాయపడగా, ఆదివారం సంభవించిన పేలుడు ధాటికి ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే ప్రాంతంలో రెండు రోజులు ఇలా వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. తాజా పేలుడు ఎందుకు జరిగిందనే విషయం తెలియాల్సిఉంది. కాగా, శనివారం నాటి స్కూటర్ డిక్కీ పేలుడుకు కిరోసిన్, పెట్రోల్ లేదా జెలిటిన్ స్టిక్స్ కారణం అయిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. (స్కూటర్ డిక్కీలో పేలుడు)