
రంగారెడ్డి: జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే అనంతరెడ్డి(95) ఆదివారం కన్నుమూశారు. రాంకోఠిలోని తన నివాసంలో అనంతరెడ్డి మృతి చెందారు. 1972లో అనంతరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆనంతరెడ్డి స్వగ్రామం యాచారం మండలం చౌదర్ పల్లి గ్రామం.