బొండా.. రాజకీయ గూండా
బొండా.. రాజకీయ గూండా
Published Fri, Sep 2 2016 11:49 PM | Last Updated on Tue, Oct 30 2018 4:47 PM
వ్యాపారవేత్త కోగంటి సత్యం
విజయవాడ కల్చరల్ :
‘బొండా ఉమా ఓ రాజకీయ గూండా. తన ఆధిపత్యం కోసం ఎంతటి పనైనా చేస్తాడు.’ అని వ్యాపారవేత్త కోగంటి సత్యం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డూండీ గణేశ్ సేవా సమితి చీలిక నేపథ్యంలో శుక్రవారం సంగీత కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినాయక ఉత్సవాల్లో రాజకీయాలు చోటుచేసుకోవడం శుభం కాదన్నారు. మొదటి నుంచి బొండా ప్రవర్తన వివాదాస్పదంగానే ఉందని, ఘంటసాల సంగీత కళాశాలలో తన ఆధిపత్యం సాగించడానికి సమితిలోని పాత సభ్యులను బలవంతంగా బయటకు పంపడానికి కుట్రలు పన్నాడని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో రూ.30లక్షలు దారి మళ్లించిన వ్యక్తిని చేరదీయడం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయన్నారు. గత ఏడాది ఉత్సవ కమిటీ సభ్యుడిగా ఉన్న పోతిన రాము మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా సేవా సమితి మారిందని, ప్రజలతో మమేకం కావాల్సిన వ్యక్తి ఒక సామాజికవర్గానికి కొమ్ముకాయడం మంచిది కాదని హితవు పలికారు. సమావేశంలో సంస్థ సభ్యులు ఫణిరాజ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement